ఉన్నది ఉన్నట్లు చెప్పటం
ఉన్నది ఉన్నట్లు రాయటం
ఇప్పుడు గతం
ఏది ఉందని చెప్పాలి?
ఏది లేదని దాయాలి?
లేనిదేదో ఉందని
భ్రమింప జేసుకున్న తర్వాత
భ్రమ చుట్టూ ప్రపంచం
పరిభ్రమించటం మొదలు పెట్టాక
ఉందని అనుకోవటంలోనే ఆనందం ఆరాధనే తాదాత్మ్యం
భ్రమల్లో బతుకుతున్నారని
ఎద్దేవా చేస్తారా??
భ్రమే వాస్తవమని ప్రపంచం సూత్రీకరించాక
భ్రమింపబడటమే ఓ సంభ్రమం
– రెహానా




