నేడు దిల్లీకి సిఎం రేవంత్‌ రెడ్డి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 25 : నేడు సిఎం రేవంత్‌ రెడ్డి దిల్లీ వెళ్లనున్నారు. తన దిల్లీ పర్యటనలో భాగంగా సిఎం కాంగ్రెస్‌ పెద్దలను కలిసి  నామినేటెడ్‌ పోస్టుల భర్తీపైన…అలాగే రాబోయే పార్లమెంటు ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికపైన కూడా చర్చించనున్నట్లు సమాచారం. అదే విధంగా ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా  ప్రధాని మోదీని కలువనున్నారు.

ప్రధానితో భేటీ సందర్భంగా సిఎం రాష్ట్ర విభజన సమస్యలు, రాష్ట్రానికి రావలసిన పెండిరగ్‌ నిధులు తదితర సమస్యలపైన చర్చించనున్నట్లు తెలుస్తున్నది. ఇదిలా వుంటే మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెట్టి సోమవారం సిఎం రేవంత్‌ను ఆయన నివాసంలో కలిశారు. ఆయన వెంట ఎన్నారైలు  కూడా ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *