కార్పొరేట్ లకి
రేట్లు కడుతూ
వారి ఋణాల మాఫియా కి
వెన్నుదన్నుగా నిలిచి
మాఫీ చేస్తుంటే
ప్రభుత్వ ఆదాయానికి
రాబడి ఎక్కడ?
ప్రభుత్వ ప్రతినిధులను
రాత్రికి, రాత్రే
సూటుకేసులతో కొనేస్తుంటే
ప్రభుత్వ ఆదాయానికి
ఆదారం ఎక్కడ?
నాయకుల విలాసాల కోసం
సర్కారు ఖజానాకు
గండి కొట్టి పల్లకీలు మోస్తుంటే
ప్రభుత్వ ఆదాయానికి
ఆసరా ఎక్కడ?
ప్రతిసంవత్సరం
వోటుకు నోటును కొంటూ
వోటరు ఖాతాల్లో
పప్పు బెల్లాలు వేస్తుంటే
ప్రభుత్వ ఆదాయానికి
మార్గం ఎక్కడ?
పీల్చే గాలి మీద తప్ప
సామాన్యుడిపై వేసే
ప్రతి పన్ను
వారి వెన్నును విరిచేసి
ప్రభుత్వ ఆదాయానికి
నిధులు సమకూర్చుకోవడమే
నేటి పాలకుల ముందున్న లక్ష్యం
– కయ్యూరు బాలసుబ్రమణ్యం





