నిజమైన ‘ప్రజాతంత్ర’ కథనం -కాంగ్రెస్‌లో చేరిన నీలం మధు

  • మధుకు కాంగ్రెస్‌ ‌కండువా కప్పిన ఏఐసిసి చీఫ్‌ ‌ఖర్గే
  • ఒకట్రెండు రోజుల్లో పటాన్‌చెరుకు మధు…కాంగ్రెస్‌ ‌పార్టీ అభ్యర్థిగా ప్రచారం…?

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 27: ఉమ్మడి మెదక్‌ ‌జిల్లా పటాన్‌చెరు నియోజక వర్గంలోని చిట్కూల్‌ ‌సర్పంచి, ఎన్‌ఎంఆర్‌ ‌వ్యవస్థాపక అధ్యక్షుడు నీలం మధు ముదిరాజ్‌ ‌రాజకీయ భవిష్యత్‌ ‌విషయంలో ‘ప్రజాతంత్ర’ తెలంగాణ దినపత్రిక చెప్పిందే నిజమైంది. ‘ప్రజాతంత్ర’ గత కొన్ని రోజులుగా చెబుతున్న ట్లుగానే నీలం మధు శుక్రవారం కాంగ్రెస్‌ ‌పార్టీలో చేరారు. దిల్లీలోని అఖిల భారత కాంగ్రెస్‌ ‌పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌ ‌పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్‌ ‌చేరిన మధుకు ఖర్గే కాంగ్రెస్‌ ‌పార్టీని కప్పారు.  పటాన్‌చెరు అసెంబ్లీ నుండి బిఆర్‌ఎస్‌ ‌పార్టీ తరపున ఎమ్మెల్యే టికెట్‌ ఆశపడి భంగపడిన నీలం మధు ముదిరాజ్‌ ఆ ‌పార్టీతో అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమైనట్లు  ఈ నెల 7న ‘ప్రజాతంత్ర’తెలంగాణ దినపత్రికలో ‘అమీతుమీకి సిద్ధమైన నీలం మధు ముదిరాజ్‌’ అనే శీర్షికన ప్రముఖంగా వార్తను ప్రచురించిన విషయం పాఠకులకు తెలిసిందే. అలాగే, ఈ నెల 18న ‘ప్రజాతంత్ర’ తెలంగాణ దినపత్రికలో ‘రంగంలోకి కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత, పటాన్‌చెరు కాంగ్రెస్‌ ‌పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మధు’? ఈ నెల 27న ‘ప్రజాతంత్ర’ తెలంగాణ దినపత్రికలో ‘హస్తినలో నీలం!, కాంగ్రెస్‌లో మధు చేరికకు లైన్‌ ‌క్లియర్‌’ అనే శీర్షికన  ప్రత్యేక కథనాలు ప్రచురించింది.  ‘ప్రజాతంత్ర’లో ప్రత్యేకంగా ప్రచురించిన విధంగానే నీలం మధు ముదిరాజ్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీలో చేరారు. మొత్తానికి నీలం మధు విషయంలో ముందు నుండి  ‘ప్రజాతంత్ర’ చెబుతున్నట్లుగా నిజమైంది.

image.png

image.png

‘‌ప్రజాతంత్ర’ ప్రచురితమైన ప్రత్యేక కథనం

ఒకట్రెండు రోజుల్లో పటాన్‌చెరుకు మధు
కాంగ్రెస్‌ ‌పార్టీ అభ్య ర్థిగా ప్రచా రం…?

దేవి నవరాత్రు(ఈ నెల 16న)ల ప్రార ంభం నుండి పటాన్‌ ‌చెరు నియోజ కవర్గ ంలోని ప్రతి ఊరు, ప్రతి వాడలో గడ• •గడపకు ‘మీ కొడుకు మీ ఇంటి గుమ్మంలో’ నీలం మధు ముదిరాజ్‌ ‌నినాదంతో జనం సమస్యలే ఎజెండగా మధు  పాదయాత్రను ప్రారంభి ంచారు.  పాదయాత్ర సందర్భంగా   తనను ఏపార్టీ అయితే అక్కున చేర్చుకుంటుందో ఆ పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాననీ, ఎవరూ ముందుకు రాకుంటే మాత్రం  స్వతంత్ర అభ్యర్థిగానే ఎన్నికల బరిలో ఉండి బిఆర్‌ఎస్‌ ‌పార్టీ అభ్యర్థి మహిపాల్‌రెడ్డికి డిపాజిట్‌ ‌దక్కకుండా చూస్తానని సవాల్‌ ‌చేసిన విషయం విధితమే. పాదయాత్ర సందర్భంగా మధుకు ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన లభించడంతో ఉమ్మడి మెదక్‌ ‌జిల్లా కాంగ్రెస్‌ ‌పార్టీకి చెందిన ఓ సీనియర్‌ ‌సహకారంతో  ఏఐసిసి పెద్దలతో జరిపిన చర్చలు సఫలం కావడంతో గత రెండ్రోజుల కిందట దిల్లీ వెళ్లిన మధు శుక్రవారం టిపిసిసి ప్రిసిడెంటు రేవంత్‌రెడ్డి, సిఎల్‌పి నాయకుడు మల్లు భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌ ‌కండువాను కప్పుకున్నారు.
పటాన్‌చెరు నుండి ఎమ్మెల్యే టికెట్‌ ‌కన్ఫర్మ్ ‌చేస్తేనే కాంగ్రెస్‌ ‌పార్టీ కండువాను కప్పుకుం టాననీ మధు చెప్పిన తర్వాతనే మధుకు ఏఐసిసి చీఫ్‌ ‌ఖర్గే కండువాను కప్పినట్లు సమాచారం. మధుకు దాదాపుగా ఎమ్మెల్యే టికెట్‌ ‌కన్ఫర్మ్ అయినట్లేనని తెలుస్తుంది. ఈ విడుత విడుదల చేసే జాబితాలో మధు పేరు ఉంటుందని సమాచారం. ఒకట్రెండు రోజుల్లో మధు దిల్లీ నుండి పటాన్‌చెరు రాగానే..ఎమ్మెల్యే అభ్యర్థిగా  పటాన్‌చెరు నియోజకవర్గంలో మధు ప్రచారాన్ని మొదలుపెట్టే అవకాశం ఉందని తెలుస్తుంది. కాంగ్రెస్‌ ‌పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మధు ఎన్నికల బరిలో దిగితే  పటాన్‌చెరులో రాజకీయం మరింత వేడెక్కనుందని చెప్పడంలో ఎలాంటి సందే హం లేదు. కాంగ్రెస్‌ ‌పార్టీ అభ్యర్థిగా మధు పోటీతో   అధికార బిఆర్‌ఎస్‌ ‌పార్టీకి ఇబ్బందులు తప్పకపోవచ్చని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే, నీలం మధు పాదయాత్ర ప్రారంభిచిన రోజే బిఆర్‌ఎస్‌ ‌పార్టీతో ఉన్న చెలిమిని తెగతెంపులు చేసుకుని బిఆర్‌ఎస్‌ ‌పార్టీకి గుడ్‌ ‌బై చెప్పారు. తాజాగా…ఆయన కాంగ్రెస్‌ ‌పార్టీలో చేరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *