దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్ల్లో భారీ వర్షాలు

  • గుజరాత్‌, ‌మహారాష్ట్రల్లో వర్ష బీభత్సం
  • కేరళలో జోరువానలతో అతలాకుతలం

న్యూ దిల్లీ, జూలై 12 : దేశవ్యాప్తంగా పలు రాష్టాల్ల్రో కురుస్తోన్న భారీ వర్షాలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. నదులు, వాగులు, వంకలు ఉరకలేస్తున్నాయి. రోడ్లపై వరదనీరు చేరి చెరువులను తలపిస్తున్నాయి. రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. విద్యుత్‌ అం‌తరాయం ఏర్పడుతోంది. ఈదురుగాలులు, జడివానల దెబ్బకు భారీ చెట్లు, కరెంటు స్తంభాలు నేలకొరుగుతున్నాయి. న్యూఢిల్లీ, ఉత్తర్‌‌ప్రదేశ్‌, ‌హర్యానా.కేరళలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావారణ శాఖ వెల్లడించింది. ప్రతికూల వాతావరణం కారణంగా … విమాన రాకపోకలపై ప్రభావం పడొచ్చని విమానయాన సంస్థ స్పైస్‌ ‌జెట్‌ ‌వెల్లడించింది. వర్షాల బీభత్సాన్ని చూపుతూ … కొన్ని ప్రాంతాల్లో కార్లు నీట మునిగినట్లు, రోడ్డు కుంగినట్లు సోషల్‌ ‌డియాలో చక్కర్లు కొడుతున్నాయి..! భారీ వర్షాల కారణంగా గుజరాత్‌ అతలాకుతలమయ్యింది. 24 గంటల వ్యవధిలో గుజరాత్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాల కారణంగా గోడ కూలి ఎనిమిదిమంది మరణించారు.

అహ్మదాబాద్‌, ‌రాజ్‌కోట్‌ ‌సహా పలు ప్రాంతాల్లో వరద పోటెత్తింది. ఉరుములు, వరదనీటిలో కొట్టుకొని పోవడం, చెట్లు, కరెంటు స్తంభాలు కూలడం సహా పలు ఘటనల్లో మొత్తంగా 64 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు. ముంబయికి గురువారం వరకు వాతావరణ శాఖ ఆరెంజ్‌ అలర్ట్ ‌జారీ చేసింది. మహారాష్ట్రలో మొత్తం 27 జిల్లాలు, 236 గ్రామాలపై ఈ వర్ష ప్రభావం తీవ్రంగా పడింది. పలు ప్రాంతాల్లో రానున్న కొద్ది గంటల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణశాఖ వెల్లడించింది. ఇప్పటివరకూ 5,873 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు వెల్లడించారు. కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.

కేరళలోని కన్నూర్‌లో కుండపోత వర్షం కురుస్తోంది. అయితే ఈ వరద నీటిలో ఓ జీపు చిక్కుకుపోయింది. ఆ జీపును బయటికి తీసేందుకు స్థానికులు తీవ్రంగా ప్రయత్నించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ ‌డియాలో వైరల్‌గా మారింది. ఇక కేరళలో రానున్న ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. కేరళ తీరంలో గంటకు 65 కి. వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరికలు తెలియజేసింది. త్రిసూర్‌, ‌మలప్పురం, కోజికోడ్‌, ‌వాయనాడ్‌, ‌కన్నూర్‌, ‌కాసర్‌గోడ్‌ ‌జిల్లాలతో సహా ఆరు జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ‌ను అధికారులు ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *