డిమాండ్ చేస్తూ జూడాల నిరసన
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 22 : దీర్ఘకాలంగా పెండిరగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉస్మానియా మెడికల్ కళాశాల జూనియర్ డాక్టర్లు నిరసన ప్రదర్శన నిర్వహించారు. కళ్లకు గంతలు కట్టుకుని నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా జూనియర్ డాక్టర్ల సంఘం అధ్యక్షుడు దీపాంకర్ మాట్లాడుతూ.. అధికారుల చుట్టూ తిరగకుండా ప్రతి నెలా నిర్దిష్టమైన తేదీకి స్టైఫండ్ ఇవ్వాలని ఎప్పటి నుంచో తాము కోరుతున్నామని, కానీ, ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని అన్నారు. ఉస్మానియా హాస్పిటల్ భవనం మూసి వేసి నాలుగేళ్లు అయ్యిందని, పక్కనే ఉన్న మరో భవనంలోకి హాస్పిటల్‌కు మార్చారని, విపరీతమైన రద్దీ కారణంగా ఇన్‌ఫెక్షన్ల శాతం పెరుగుతుందని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ డిమాండ్లపై లిఖితపూర్వక హావ్ని ఇవ్వాలని జూడాలు కోరారు.



