లీడ్ -1
వస్తున్న సర్వేలు, అందుతున్న నివేదికలు చూస్తుంటే హంగ్ అసెంబ్లీ ఏర్పడితే తెలంగాణలో తమ పార్టీ అధికారంలోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు మ్యాజిక్ ఫిగర్ రాకుండా సీట్లు ఈ ఎన్నికల్లో వస్తే అప్పుడు తామే కింగ్ మేకర్ అవుతామని కమలం పార్టీ భావిస్తుంది. కేసీఆర్ ఎటూ కాంగ్రెస్ తో కలవరు. కేంద్రంలో అధికారంలో ఉన్న తమతోనే జట్టు కడతారు. అప్పుడు కేసీఆర్ పార్టీకి కేంద్రంలో మంత్రి పదవులు కేటాయించి తక్కువ స్థానాలను వచ్చినా తాము ఇక్కడ అధికారంలోకి తెచ్చుకోవచ్చన్న ఆలోచనలో ఆ పార్టీ నేతలున్నట్లు తెలుస్తోంది. అందుకే కమలనాధులు హంగ్ ఏర్పడాలని కోరుకుంటున్నారు..
లీడ్ -2
ప్రధాని మోదీ రేపు హైదరాబాద్ వచ్చి మూడురోజుల పాటు తెలంగాణలోనే మకాం వేయనున్నారు. 25న కామారెడ్డి,మహేశ్వరం, 26న తూప్రాన్, నిర్మల్, 27న మహబూబాబాద్, కరీంనగర్లో పర్యటించి బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు. 24 నుంచి 28 వరకు హోమ్ మంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణలోనే ఉంటారు. ముగ్గురు బీజేపీ ముఖ్యమంత్రులు తెలంగాణ బీజేపీ కోసం ప్రచారం చేస్తారు. యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్, అస్సాం సీఎం హేమంత్ బిశ్వాస్ శర్మ, గోవా సీఎం ప్రమోద్ సావంత్ కోసం ప్రత్యేక ప్రణాళికలు
సిద్ధంగా ఉన్నాయి.
తెలంగాణలో పోలింగ్ తేదీ దగ్గరపడడంతో ప్రధాన పార్టీలు ప్రచారంలో దూకుడుపెంచాయి. బీజేపీ అగ్రనేతల ప్రచారంతో హోరెత్తిస్తుంది. దిల్లీ బీజేపీ అగ్రనేతలు వరుసగా ప్రచారంలో దూసుకుపోతున్నారు. తెలంగాణపై ఫోకస్ పెట్టిన బీజేపీ.. ఎలాగైనా అధికారంలోకి రావాలని వ్యూహాలకు పదును పెడుతోంది. పెద్దగా బలం లేకపోయినా ఈసారి అధికారం తమదేనని పదే పదే చెబుతున్నారంటున్నారు. అ విషయం డిసెంబరు 3వ తేదీన తేలనుంది. దక్షిణాది రాష్ట్రాలపై దృష్టి పెడుతూ ముఖ్యంగా తెలంగాణలో బీజేపీ పాగా వేయడానికి వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. 2024 లోక్ సభ ఎన్నికల లక్ష్యంగా బీజేపీ దృష్టి సారించి రాష్ట్రంలో బీజేపీ పట్టు సాధించకపోతే, మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినా, కాంగ్రెస్ విజయం సాధిస్తే కేంద్రంలో తమకు ఇబ్బంది అన్న భావనలో బిజెపి అధినాయకత్వం ఉంది. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌షా తెలంగాణ రాజకీయాలపై పెద్ద ఎత్తున ఆసక్తి కనబరుస్తున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ రాజకీయ పరిస్థితులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పరిస్థితి పై సర్వేలు చేయిస్తూ, నివేదికలు తెప్పించుకొని పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. హోం మంత్రి అమిత్ షా కూడా తెలంగాణ రాష్ట్రం పై పూర్తిగా దృష్టి సారించారు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా పర్యటించాలని నిర్ణయించిన అమిత్ షా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకున్న విషయం తెలిసిందే. ఎక్కువరోజులు తెలంగాణలోనే ఉండాలని అమిత్ షా నిర్ణయించుకున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ర్యాలీలు, సమావేశాలు నిర్వహించి కేసిఆర్ ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలచుకోవాలని బిజెపి అధినాయకత్వం భావిస్తోంది.
తెలంగాణ ఎన్నికల పోరు తీవ్ర స్థాయికి చేరుకుంది. ప్రచార పర్వంలో తుది ఘట్టం అదరగొట్టే తీరులో ఉంటుందని అంటున్నారు. ఆఖరివారం అగ్రనేతలంతా తెలంగాణ బాటపట్టారు. పీయూష్ గోయల్, నితిన్ గడ్కరీ ప్రచారం నిర్వహించారు. ముఖ్యంగా ఆ నలుగురు నయకులు దిల్లీ నుంచి తెలంగాణ గల్లీల మీద ఫోకస్ చేశారు. మిషన్ తెలంగాణ కోసం ఆఖరిపోరాటం చేయబోతున్నారు. వారం రోజులు కూడా లేవు పోలింగ్ తేదీకి. కానీ.. ఈ ప్రచారం రోజుల్లో నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ఫీవర్ ముగిసిపోనుంది. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్‌షా, జేపీ నడ్డా, స్మృతి ఇరాని తెలంగాణ మీదే చూపు పెట్టారు. సభలు, సమావేశాలు, ర్యాలీలతో తెలంగాణ గల్లీల్లో హోరెత్తించనున్నారు. ఇప్పటి వరకు ఒక లేక్క.. ఇప్పుడో లెక్క అన్నట్లు ప్రచారాలు కొనసాగనున్నాయి.

కీలకమైన ఎన్నికల సమయంలో కెసిఆర్ కు మూడేళ్ళుగా ప్రధాన ప్రత్యర్థిగా నిలిచి మింగుడు పడని బండి సంజయ్‌ను పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించడం కార్యకర్తలలో తీవ్ర నిరుత్సాహం ఏర్పడిరది. భారాస కు ఊపిరి నిచ్చినట్లయింది. అయినా సంజయ్ ఆ విషయాన్ని పట్టించుకోకుండా కేంద్రనాయకత్వం అజ్ఞలను సూచనలను శిరసావహిస్తూ పార్టీ గెలుపు లక్ష్యం వదలకుండా తన నియోజకవర్గంతో పాటు అధిక సంఖ్యలో బిజెపి అభ్యర్థుల ప్రచారంలో వివిధ నియోజకవర్గాలు పర్యటిస్తూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతున్నారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో బీజేపీ ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తోంది.ఇదిలా ఉండగా పార్టీలో ముఖ్యులు కొందరు పోటీకి దూరంగా ఉన్నారు. ప్రచారంలో ఆసక్తి కనబరచడం లేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. బీఆర్ఎస్ నుంచి కేసీఆర్, కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి వెంకటరమణా రెడ్డి బరిలో ఉన్న కామారెడ్డిలో కమలనాథులు సభను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా బీజేపీ అభ్యర్థికి మద్ధతుగా ఈనెల 25న కామారెడ్డి నియోజకవర్గంలో మోదీ ఎన్నికల ప్రచారం చేయనున్నారు. కాగా సభా వేదికపై నుంచి బీఆర్ఎస్, కాంగ్రెస్ టార్గెట్ గా మోదీ విమర్శలు చేసే అవకాశం ఉంది.
ప్రధాని మోదీ రేపు హైదరాబాద్ వచ్చి మూడురోజుల పాటు తెలంగాణలోనే మకాం వేయనున్నారు.
25న కామారెడ్డి,మహేశ్వరం, 26న తూప్రాన్, నిర్మల్, 27న మహబూబాబాద్, కరీంనగర్లో పర్యటించి బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు. 24 నుంచి 28 వరకు హోమ్ మంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణలోనే ఉంటారు. ముగ్గురు బీజేపీ ముఖ్యమంత్రులు తెలంగాణ బీజేపీ కోసం ప్రచారం చేస్తారు. యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్, అస్సాం సీఎం హేమంత్ బిశ్వాస్ శర్మ, గోవా సీఎం ప్రమోద్ సావంత్ కోసం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయి.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తేదీ దగ్గరపడుతున్న వేళ బీజేపీ అగ్ర నాయకత్వం రాష్ట్రానికి తరలి వస్తోంది. ఎలాగైనా గట్టి పోటీ ఇవ్వాలని చూస్తున్న బీజేపీకి జోష్ తేవాలని దిల్లీ నేతలు తరలివస్తున్నారు. ఇప్పటికే ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా రాష్ట్రంలో పలు సభలు, సమావేశాల్లో పాల్గొని ప్రచారం నిర్వహించారు. మరికొందరు తెలంగాణ బాట పట్టారు స్మృతి ఇరానీ, యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ ప్రచారం నిర్వహించనున్నారు. వరుసగా అగ్ర నేతల ప్రచారంతో రాష్ట్రంలో ఎన్నికల వేడి మరింతగా రాజుకోనుంది.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇవాళ మరోసారి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. రాత్రి హైదరాబాద్ చేరుకున్న నడ్డాకు బీజేపీ నేతలు గ్రాండ్ వెల్కమ్ పలికారు. ఐటీసీ కాకతీయలో బసచేశారు. బీజేపీ ముఖ్య నేతల సమావేశమయ్యరు. తర్వాత మధ్యాహ్నం నిజామాబాద్ అర్బన్‌లో ప్రచారం చేసి. అక్కడ జరిగే సభలో ప్రసంగించారు.అనంతరం సంగారెడ్డిలో బహిరంగకు హాజరయ్యారు. పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా పార్టీ నేతలకు దిశానిర్ధేశం చేస్తున్నారు. బహిరంగ సభల్లో పాల్గొని.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. నారాయణపేట, చేవెళ్లలో నిర్వహించిన సకల జనుల విజయ సంకల్ప సభల్లో, మల్కాజిగిరి నియోజకవర్గంలో నిర్వహించిన రోడ్‌షోలో కాంగ్రెస్ అవినీతి, బీఆర్ఎస్ కుటుంబ పాలనపై ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ అవినీతిపై విచారణ జరిపిస్తామని ప్రకటించారు.
తెలంగాణలో బీజేపీ జాతీయ నేతల ప్రచారం కొనసాగుతోంది. హైదరాబాద్ రాంకోఠిలో పీయూష్ గోయల్ ప్రచారం.. ఖైరతాబాద్‌లో గోవా సీఎం ప్రమోద్ పాదయాత్ర..సిరిసిల్ల బహిరంగ సభలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ మూకుమ్మడిగా విమర్శల వర్షం మొదలెట్టారు.. అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన, బీజేపీ ఉమ్మడిగా పోటీ చేస్తున్నాయి. పొత్తులో భాగంగా జనసేనకు ఎనిమిది స్థానాలను బిజెపి కేటాయించింది. మొన్నటి వరకు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్న పవన్ వైఖరిపై అసంతృప్తితో ఉంటూ వచ్చిన బిజెపి నాయకులు ఇప్పుడు పవన్ ప్రచారంలోకి దిగడంతో తమ పార్టీ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని ఆశలు పెట్టుకున్నారు. మిత్రపక్షం జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తో జోరుగా ప్రచారం చేయించే ప్రయత్నంలో బీజేపీ మునిగి ఉంది.
ముందు వరంగల్‌లో పర్యటించిన పవన్.. కొత్తగూడెం, సూర్యాపేట, దుబ్బాకలో జరిగే ఎన్నికల ప్రచారంలో పాల్గొం టున్నారు. బిజెపి అభ్యర్థుల పోటీ చేస్తున్న అన్ని స్థానాల్లో పవన్ ఎన్నికల ప్రచారం నిర్వహించడం సాధ్యం కాదు. దీంతో పవన్ తన పార్టీ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని ప్రత్యర్థులపై దూకుడుగా విమర్శలతో విరుచుకుపడతారని బిజెపి వేసిన అంచనా తలకిందులైంది. పవన్ బీఆర్ఎస్ ను నేరుగా టార్గెట్ చేసుకుని విమర్శలు చేయకపోవడానికి కారణాలు చాలానే కనిపిస్తున్నాయి. ఒక వైపు ఆంధ్ర ప్రదేశ్ లో అధికార వై ఎస్ ఆర్ పార్టీ కి వ్యతిరేకంగా తెలుగుదేశంతో నేరుగా ఐక్యమై చంద్రబాబు, లోకేశ్ లతో కలసిపోవడం, ఎన్నికల పొత్తు పెట్టుకుని ప్రభుత్వాన్ని గద్దె దించాలన్న ధ్యేయం తో పనిచేస్తుండడం, పవన్ సినీ రంగనికి చెందినవారు కావడం, ఒకవేళ ఇప్పుడు బీఆర్ఎస్ ను టార్గెట్ చేసుకుని విమర్శలు చేసినా, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఆ ప్రభావం సినీ రంగంపైనా, తన సినిమాల పైన తీవ్రంగా ఉంటుందని పవన్ భావిస్తున్నారని బిజెపి అనుమానిస్తోంది.
బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఎన్నికల ప్రచారంలో దూసుకు పోతుండగా, బిజెపిలో మాత్రం ఆ ఉత్సాహం కనిపించడం లేదు. ప్రచారంలో బీజేపీ స్టార్ క్యాంపెయినర్లు కనబడకపోయినా బీజేపీ అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులకు గట్టిపోటీ ఇస్తున్నారు. పోలింగ్‌కు సమయం దగ్గర పడుతుండటంతో చెమటోడ్చుతున్నారు. దిల్లీ నుంచి బిజెపి పెద్దలు వచ్చిన సమయంలోనే కాస్త హడావుడి చేస్తున్నట్టు కనిపిస్తున్నా, ఆ తరువాత వారి గళాలు వినబడడం లేదు. ముఖాలు కనబడడంలేదు. ఎన్నికల ప్రచారానికి ఈనెల 28 తో గడువు ముగియనుంది.
రాజకీయాల్లో గెలుపు ముఖ్యం. అందుకోసం పార్టీలు ఎంతో శ్రమిస్తుంటాయి. ఎన్నో వ్యూహాలు, ఎత్తులు వేస్తుంటాయి. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా శ్రమిస్తున్న కేంద్రంలోని అధికార బీజేపీ.. విజయం కోసం తమ మార్కు ప్లాన్స్ రెడీ చేసుకుంటోంది. తెలంగాణలో తమ పార్టీని గెలిపించేంత బలగం లేకపోవడంతో.. ఇతర రాష్ట్రాలోని బీజేపీ ఎమ్మెల్యేలు, వ్యూహకర్తలను రంగంలోకి దింపుతున్నది. తెలంగాణలో మొత్తం 119 స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసుకోవాలని చాలా చోట్ల చేరికలను ప్రొత్సహించింది. పార్టీని గెలిపించే బాధ్యతను ఇతర రాష్ట్రాల్లోని పలువురు బీజేపీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలకు అప్పగించింది. జాబితాల విడుదల తర్వాత బీఆర్ఎస్ లో అలక సీన్లు ఉన్నా, తక్కువగానే ఉన్నాయి. కాంగ్రెస్ లో కూడా అసమ్మతి, అసంతృప్తి తక్కువగా ఉండడం, తాజా జాబితా తర్వాత బీజేపీలో టికెట్ కోసం గొడవలు సీన్ రివర్స్ అయింది. వేములవాడ బీజేపీలో ముసలం పుట్టింది. కారణం ఈటల కావడం విశేషం..
మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడంపై అధిష్టానం దృష్టి పెట్టింది. తొలి జాబితా తర్వాత అసంతృప్తులు పెరగడం.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జి. వివేక్, విజయశాంతి సహా పలువురు నాయకులు పార్టీకి రాజీనామా చేసిన నేపథ్యంలో పూర్తి స్థాయి కసరత్తు చేశారు. రెండో జాబితాలో బీసీలు, మహిళలకు సముచిత స్థానం దక్కేయి. పార్టీలో పదవులకు రాజీనామా చేసినా బండి సంజయ్ నేతృత్వంలో పనిచేస్తామంటున్నారు. ఈటల వర్గం ఇరుకున పడిరది. టిక్కెట్లు దక్కని వారు ఓడిరచడానికి పనిచేస్తారన్న అనుమానం ఉంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా బీజేపీ అధికారంలోకి వస్తే బీసీకే ముఖ్యమంత్రి పదవి ఇస్తామని ఇటీవల ప్రకటించడంతో, బీసీలకు ఎక్కువ సీట్లు కేటాయించడంపై దృష్టి పెట్టారు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ పెద్దగా ప్రభావం చూపలేదని అన్ని సర్వేలు చెబుతున్నాయి. కానీ అగ్ర నేతల నుంచి దిగువ స్థాయి నేతల వరకూ ఈసారి అధికారం తమదేనంటున్నారు. ఈ ఈక్వేషన్లు ఎక్కడా కలవడం లేదు. నేతలు కూడా పార్టీ నుంచి వెళ్లి పోతున్నారు. కొత్త నేతలు వచ్చి చేరడం లేదు. అయినా గెలిచేది మేమేనన్న ధీమాలో కమలదళం ఉంది. దీనికి కారణం ఏమై ఉంటుందన్న దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. బీజేపీ నిజంగా అధికారంలోకి వస్తుందా? అది ఎలా సాధ్యం? అని జుట్టుపీక్కుంటున్నా జనాలకు మాత్రం అర్థం కావడం లేదు. కానీ బీజేపీ నేతలు మాత్రం పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. కమలనాధుల లెక్కలు అనుకున్నట్లు వస్తే అధికారంలోకి రావడం ఖాయమని చెబుతున్నారు. ఇప్పుడు వస్తున్న సమాచారం, అనేక నియోజక వర్గాలలో ముస్లిం వోట్లలో తమకు కొంతభాగం బ్యాంక్ ఉందని, నగరంలో రాజాసింగ్‌కు ఉన్న బలం తమకు అనుకూలిస్తుందని కొందరి నమ్మకం. పాత బస్తీలో కూడ బద్దం బాల్ రెడ్డి అనుయాయులు, అభిమానులు తమకు అనుకూలంగా ఉంటారని మరొక ఆశ.
వస్తున్న సర్వేలు, అందుతున్న నివేదికలు చూస్తుంటే హంగ్ అసెంబ్లీ ఏర్పడితే తెలంగాణలో తమ పార్టీ అధికారంలోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు మ్యాజిక్ ఫిగర్ రాకుండా సీట్లు ఈ ఎన్నికల్లో వస్తే అప్పుడు తామే కింగ్ మేకర్ అవుతామని కమలం పార్టీ భావిస్తుంది. కేసీఆర్ ఎటూ కాంగ్రెస్ తో కలవరు. కేంద్రంలో అధికారంలో ఉన్న తమతోనే జట్టు కడతారు. అప్పుడు కేసీఆర్ పార్టీకి కేంద్రంలో మంత్రి పదవులు కేటాయించి తక్కువ స్థానాలను వచ్చినా తాము ఇక్కడ అధికారంలోకి తెచ్చుకోవచ్చన్న ఆలోచనలో ఆ పార్టీ నేతలున్నట్లు తెలుస్తోంది. అందుకే కమలనాధులు హంగ్ ఏర్పడాలని కోరుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో తమకు 20 స్థానాలు వస్తే చాలు ముఖ్యమంత్రి పదవి తమకే దక్కుతుందన్న ఆశతో ఉన్నారు. అందుకోసమే పార్లమెంటు సభ్యులను సయితం అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దించిందని చెబుతున్నారు. కాంగ్రెస్ కు మద్దతివ్వని కారు పార్టీ తమ వైపే మొగ్గు చూపుతుందని, అది దాని అవసరమే కాకుండా అనివార్యమని కూడా భావిస్తున్నారు. మరి బీజేపీ ఆలోచనలు కేవలం ఆశలుగానే మిగులుతాయా? లేదా? వారనుకున్నట్లు నిజంగానే వర్కవుట్ అవుతుందా? అన్నది డిసెంబరు 3వ తేదీన తేలనుంది.
-నందిరాజు రాధాకృష్ణ,
వెటరన్ జర్నలిస్ట్,
98481 28215





