ఒకవేళ బిఆర్ఎస్కు మెజార్టీ స్థానాలు రానిపక్షంలో ప్రభుత్వ ఏర్పాటుకు బిజెపి తప్పకుండా బిఆర్ఎస్కు సహకరిస్తుందంటున్నారు. ఫలితంగా రేపు జరుగబోయే పార్లమెంటు ఎన్నికల్లో బిఆర్ఎస్ బిజెపికి సహరించే రీతిలోనే ఈ పార్టీలమధ్య అవగాహన ఉందని వాదిస్తోంది కాంగ్రెస్. దానికి తగినట్లు ఏబిపి సి వోటర్ సర్వేకూడా బిఆర్ఎస్కు ఈసారి 43 నుంచి 55 స్థానాలవరకే రానున్నట్లు చెబుతోంది. అలాగే బిజేపికి 5 నుంచి 11 స్థానాలు వస్తాయంటోంది. మ్యాజిక్ ఫిగర్ కావాలంటే కనీసం 60 స్థానాలకు పైగా రావాల్సిఉంది. అలాంటి పరిస్థితిలో హంగ్ ఏర్పడితే ఏ రెండు పార్టీలు సహకరించుకుంటాయంటున్న కాంగ్రెస్ వాదనపైనే ఇప్పుడు చర్చ జరుగుతున్నది.
తెలంగాణ ఎన్నికలు ఈసారి చాలా రసవత్తరంగా మారాయి. పోటీ పడుతున్న పార్టీలన్నీ విజయం తమదేనన్న ధీమాను వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికలకు నేటికి సరిగ్గా నలభై ఆరు రోజులు మాత్రమే వ్యవధి ఉన్నప్పటికీ ప్రచారంలో మాత్రం అన్ని పార్టీలు ముందంజలోనే
ఉన్నాయి. ముఖ్యంగా జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బిజెపిలు కేంద్ర నాయకులతో ఇప్పటికే బహిరంగ సభలను ఏర్పాటు చేశాయి. ఎన్నికలలోగా మరిన్ని సభలను నిర్వహించే విధంగా పథక రచన చేశాయి. ఈ రెండు జాతీయ పార్టీలు రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడిరచాలన్న పట్టుదలతో పనిచేస్తున్నాయి. వీటికి తోడు మరికొన్ని ఉప ప్రాంతీయ పార్టీలుకూడా ఈ ఎన్నికల్లో బిఆర్ఎస్ను మట్టి కరిపించేందుకు తమ వంతు కార్యక్రమాలను రూపొందించు కుంటున్నాయి. అయినప్పటికీ ఇక్కడ ప్రధాన పోటీ మాత్రం కేవలం మూడు పార్టీల మధ్యనే ఉండే అవకాశం ఉంది. ఈ మూడు పార్టీలు కూడా ఒకదానితో ఒకటి బద్ద శత్రువులుగా వ్యవహరిస్తున్నా అంతర్ఘతంగా ఒకదానితో ఒకటి కలిసి పనిచేస్తున్నాయని ఆ పార్టీలే ఆరోపించుకుంటున్నాయి. బిజెపి, బిఆర్ఎస్ ఒకటేనని కాంగ్రెస్ ఆరోపిస్తుండగా, బిఆర్ఎస్, కాంగ్రెస్ ఒకటేనని బిజెపి అంటోంది. ఈ పార్టీలు పోటీపడుతున్న తీరు చూస్తుంటే ఈసారి ఏ పార్టీకైనా సంపూర్ణ మెజార్టీ వొస్తుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఒక వేళ ఏ ఒక్క పార్టీకైనా సంపూర్ణ మెజార్టీ రాని పక్షంలో అధికారంకోసం ఏ రెండు పార్టీలు సహకరించుకుంటాయన్న చర్చకూడా జరుగుతున్నది. ఈ విషయంలో బిఆర్ఎస్కు బిజెపి తప్పకుండా సహకరిస్తుందని కాంగ్రెస్ ఘంటా పథంగా చెబుతున్నది. రాష్ట్రంలో ఈ రెండు పార్టీలు ఒకదానికొకటి సహకరించుకోవాలని చీకటి ఒప్పందాలు చేసుకున్నాయని కాంగ్రెస్‌కు చెందిన కేంద్ర, రాష్ట్ర నాయకులు ఆరోపిస్తున్నారు. బిఆర్‌ఎస్‌పైన దూకుడుగా ఉన్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను తొలగించి, ఆయన స్థానంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని నియమించడం వెనుక ఈ రెండు పార్టీలమధ్య కుదిరిన అవగాహనే కారణమంటున్నారు కాంగ్రెస్ నాయకులు. కాని పక్షంలో తెలంగాణపై కాషాయ జండా ఎగురవేస్తామని చెబుతున్న బిజెపి రాష్ట్రంలో ఆ పార్టీ గ్రాఫ్‌ను తనంత తానే ఎందుకు పడేసుకుంటుందని కాంగ్రెస్ ప్రశ్నిస్తున్నది. అంటే ఒకవేళ బిఆర్ఎస్కు మెజార్టీ స్థానాలు రానిపక్షంలో ప్రభుత్వ ఏర్పాటుకు బిజెపి తప్పకుండా బిఆర్ఎస్కు సహకరిస్తుందంటున్నారు. ఫలితంగా రేపు జరుగబోయే పార్లమెంటు ఎన్నికల్లో బిఆర్ఎస్ బిజెపికి సహరించే రీతిలోనే ఈ పార్టీలమధ్య అవగాహన ఉందని వాదిస్తోంది కాంగ్రెస్. దానికి తగినట్లు ఏబిపి సి వోటర్ సర్వేకూడా బిఆర్ఎస్కు ఈసారి 43 నుంచి 55 స్థానాలవరకే రానున్నట్లు చెబుతోంది. అలాగే బిజేపికి 5 నుంచి 11 స్థానాలు వస్తాయంటోంది. మ్యాజిక్ ఫిగర్ కావాలంటే కనీసం 60 స్థానాలకు పైగా రావాల్సిఉంది. అలాంటి పరిస్థితిలో హంగ్ ఏర్పడితే ఏ రెండు పార్టీలు సహకరించుకుంటాయంటున్న కాంగ్రెస్ వాదనపైనే ఇప్పుడు చర్చ జరుగుతున్నది. అయితే సీ సర్వే మరో సంచలన రిపోర్టుకూడా ఇచ్చింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అధిక స్థానాలను కైవసం చేసుకుంటుందని చెబుతోంది. కనీసం 48 నుండి 60 స్థానాలను కాంగ్రెస్ పొందే అవకాశం ఉందని తన సర్వే రిపోర్టులో తెలిపింది. ఒకవేళ ఒకటిరెండు అటు ఇటు అయినా ఇతర పార్టీలనుండి మద్దతు తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నది. లోక్‌పాల్ సర్వే కూడా అదే చెబుతోంది. కాకపోతే సీ సర్వేతో పోలిస్తే మరిన్ని ఎక్కువ స్థానాలు కాంగ్రెస్ గెలుచుకునే అవకాశం ఉందంటోంది. బిఆర్ఎస్కు 45 నుంచి 51 వొస్తాయని చెబుతున్న లోక్‌పాల్ సర్వే బిజెపిని 2, 3 స్థానాలకే పరిమితం చేసింది. ఎంఐఎం మాత్రం 6 నుంచి 8 స్థానాలను కైవసం చేసుకుంటుందని చెప్పింది. కర్ణాటకలో ఖచ్చిత ఫలితాలను అంచనావేసిన జన్మత్ సర్వే కూడా తెలంగాణలో ఇటీవల సర్వే చేపట్టింది. అందులో కూడా బిఆర్ఎస్ పార్టీకి 43 నుంచి 45 సీట్ల వరకు రావొచ్చని చెప్పింది. బిజెపిని 8 నుంచి 9 సీట్లకే పరిమితం చేసిన ఆ సర్వే రిపోర్టు కాంగ్రెస్ మాత్రం 58 నుంచి 60 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని చెప్పింది. ఇదిలా ఉంటే కొత్తగా న్యూస్ ఎరినా అనే సంస్థ నిర్వహించిన సర్వేలో బిఆర్ఎస్ 80 స్థానాలతో అఖండ విజయాన్ని సాధించనున్నట్లు చెప్పింది. అదే సమయంలో కాంగ్రెస్‌కు 30 స్థానాలు, బిజెపికి పది వరకు వొచ్చే అవకాశాలున్నట్లు చెప్పింది. అయితే ఇదే సమయంలో దేశంలోని ఇతర రాష్ట్రాల్లో అంటే మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో జరిగే ఎన్నికల్లో మాత్రం బిజెపి విజయం సాధిస్తుందని ఆ సర్వేలో వెల్లడిరచింది. ఇదిలా ఉంటే మరో విచిత్రమైన సన్నివేశం ఇక్కడ ఆవిష్కరించబోతున్నది. తెలంగాణ ఎన్నికల్లో ఎంఐఎం రేపు ముఖ్యభూమికను పోషించే అవకాశాలు లేకపోలేదు. ఒక వేళ హంగ్ ఏర్పడితే ఎంఐఎం కింగ్ మేకర్‌గా మారకపోదు. ఆ పార్టీ గత చరిత్ర చూస్తే ఎట్టి పరిస్థితిలో 7, 8 స్థానాలకు తక్కువ కాకుండా ఆ పార్టీ గెలుచుకునే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో పోటీ పడుతున్న ప్రధాన పార్టీలకు మ్యాజిక్ ఫిగర్ సంఖ్య తగ్గితే ఆ పార్టీ తప్పకుండా ఎంఐఎం వైపు చూడక తప్పదు.
– మండువ రవీందర్రావు





