ట్రాన్స్‌కో, జెన్‌కో సిఎండి పదవికి ప్రభాకర్‌ రావు రాజీనామా

కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ముందే పదవి నుంచి తప్పుకున్న దేవులపల్లి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెబర్‌ 4 : తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌ కో ఛైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌(సీఎండీ) దేవులపల్లి ప్రభాకర్‌ రావు తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల వల్ల తాను రాజీనామా చేస్తున్నట్లుగా ప్రభాకర్‌ రావు వెల్లడిరచారు.

కేసీఆర్‌ అధికారంలోకి వొచ్చిన తర్వాత ప్రభాకర్‌ రావు..25 అక్టోబర్‌ 2014 నుంచి టీఎస్‌ ట్రాన్‌కో, జెన్‌ కోకు సీఎండీ హోదాలో కొనసాగుతున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడుతున్న తరుణంలో నియామక పదవులకు రాజీనామా చేయడం ఆనవాయితీ. ఈ క్రమంలో  ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ పదవికి దేవులపల్లి ప్రభాకర్‌ రావు తన పదవికి రాజీనామా చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *