చార్జీల బాదుడు భారం

ఆర్టీసీ ప్రగతి రథ చక్రాలు
ప్రజల్లో దడ పుట్టిస్తున్నాయ్‌

‌పధికులపై భారం మోపుటలో
వేగంగా పరుగు తీస్తున్నాయ్‌

‌యాజమాన్యం నేరుగా కాక
దొడ్డిదారిన చార్జీలను పెంచి
ప్రయాణికుల నడ్డి విరుస్తుంది

నిన్నటి వరకు సేఫ్‌ ‌సేఫ్టీ సెస్‌
‌పేరిట ప్రయాణికుల పీడించి
ఇపుడు దూరాల ఆధారంగా
దారి దోపిడీకి తెగబడుతుంది

నష్టాల ఊభి నుంచి గట్టెక్కి
లాభాల బాట పట్టించేందుకు
ప్రజలను బలిపశువు చేస్తుంది

పల్లె వెలుగు మొదలు ఏసీ
బస్సుల దాకా ఇదే మోదుడు

సామాన్యుల మాత్రమే కాక
విద్యార్థుల బస్సు పాసులపై
యదాతద పెంపుడు బాదుడు

ఆర్టీసీ తప్పిదాలకు తోడు
ఏలికల ఎమరుపాటు కూడా
ధరాఘాతానికి కారణభూతం

అడిగే నాధుడు లేదన్నట్లు
యథేచ్ఛగా దోచుకుంటుంటే
జనాగ్రహం చూడక తప్పదు

ఇకనైనా ఆర్టీసీ యాజమాన్యం
ప్రత్యామ్నాయ దారులు వెతికి
చార్జీల పెరుగుదల అరికడితేనే
ప్రజల ప్రయాణాలు సులభతరం
రోడ్డు రవాణా సంస్థ సదా సుస్థిరం

          (ఆర్టీసి బస్సు చార్జీల పెంపుకు నిరసనగా..)  
-కోడిగూటి తిరుపతి 9573929493

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *