ఆందోళనతో అట్టుడికిన వర్సిటీ ప్రాంగణం
ఇప్పటికే ముగ్గురి అరెస్ట్..వార్డెన్ సస్పెన్షన్
24 వరకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
చండీగఢ్, సెప్టెంబర్ 19 : పంజాబ్‌లోని చండీగఢ్ యూనివర్సిటీలో గర్లస్ హాస్టల్ వార్డెన్ రజ్విందర్ కౌర్‌ను సస్పెండ్ చేశారు. విద్యార్థులతో అనుచితంగా ప్రవర్తించిన ఘటనలో కౌర్‌ను సస్పెండ్ చేశారు. గర్లస్ హాస్టల్‌కు చెందిన కొందరి అమ్మాయిల ప్రైవేటు వీడియోలు లీకైన కేసులో అధికారులు చర్యలు తీసుకున్నారు. వర్సిటీని శనివారం వరకు మూసి వేస్తున్నట్లు అధికారులు చెప్పారు. దీంతో తమ పిల్లల్ని తీసుకువెళ్లేందుకు తల్లిదండ్రులు వర్సిటీకి వచ్చారు. ఓ అమ్మాయి తన బాయ్‌ఫ్రెండ్‌కు అభ్యంతర కరమైన కొన్ని వీడియోలను షేర్ చేసింది. ఆ వీడియోలను అతను సోషల్ డియాలో షేర్ చేశాడు. దీంతో వర్సిటీ గర్లస్ హాస్టల్‌లో ఆందోళన చెలరేగింది. వీడియోలను రిలీజ్ చేసిన అమ్మాయిని అరెస్టు చేస్తున్న సమయంలో పోలీసుల్ని హాస్టల్ వార్డెన్ అడ్డుకున్నట్లు తెలిసింది. నిరసన చేసిన విద్యార్థినిలను కూడా ఆమె తిట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. మొత్తం నాలుగు వీడియోలను ఓ అమ్మాయి తన బాయ్‌ఫ్రెండ్‌కు పంపించింది. వర్సిటీ వద్ద ఎటువంటి సూసైడ్ ప్రయత్నం జరగలేదని పోలీసు ఆఫీసర్ నవ్రీత్ సింగ్ విర్క్ తెలిపారు.
విద్యార్థుల ఆందోళనలతో అట్టుడుకుతున్న చండీఘడ్ యూనివర్సిటీకి సెప్టెంబరు 24 వరకు సెలవులను ప్రకటించారు. దీంతో కొంతమంది విద్యార్థులు ఇప్పటికే వర్సిటీ క్యాంపస్ ను వదిలి ఇళ్లకు వెళ్లిపోయారు. వర్సిటీ హాస్టల్ లోని కొందరు విద్యార్థినుల అభ్యంతరకర వీడియోలను ఓ విద్యార్థిని రహస్యంగా రికార్డు చేసి సోషల్ డియాలో పోస్ట్ చేయడం కలకలం సృష్టించింది. దీనిపై ఆదివారం వర్సిటీ క్యాంపస్ లో విద్యార్థుల ఆందోళనలు మిన్నంటాయి. బాధిత విద్యార్థులకు అండగా ఉంటామని ఆప్ ప్రకటించింది. మరోవైపు వీడియోలు తీసిన ఘటనతో సంబంధమున్నట్లుగా భావిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేయగా, మరొకరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
ఈ ఘటనపై స్పందించిన పంజాబ్ విద్యాశాఖ మంత్రి హర్జోత్ సింగ్ బైన్స్.. నిందితులను విడిచిపెట్టే ప్రసక్తే లేదన్నారు. క్యాంపస్‌లో విద్యార్థులు శనివారం రాత్రి పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. స్నానం చేస్తుండగా వీడియోలు తీసి, వాటిని హిమాచల్‌ప్రదేశ్‌లో ఉండే తన బాయ్‌ఫ్రెండ్‌కు ఓ అమ్మాయి పంపినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. వీటిని ఆ అమ్మాయి బాయ్‌ఫ్రెండ్ సోషల్‌డియాలో అప్‌లోడ్ చేసినట్టు సమాచారం. అయితే, సదరు విద్యార్థిని తన సొంత వీడియోనే షేర్ చేసిందని పోలీసులు వెల్లడించారు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, విద్యార్థినిని, సిమ్లాలో ఉంటున్న ఆమె బాయ్ ఫ్రెండ్ అరెస్టు చేశామన్నారు. ఇప్పటి వరకు ఈ కేసులో ముగ్గుర్ని అరెస్టు చేశారు. ఘటనపై పంజాబ్ సీఎం భగవంత్‌మాన్ ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు. పంజాబ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ మనీషా గులాటీ ఘటన వివరాలను విద్యార్థినులను అడిగి తెలుసుకొన్నారు. వీడియోలను ఎవరెవరికి షేర్ చేశారు, ఎక్కడెక్కడ అప్‌లోడ్ చేశారన్న కోణంలో ఫోరెన్సిక్ పోలీసులు విచారణ జరుపుతున్నారు.




