Take a fresh look at your lifestyle.

గుజరాత్‌లో నేడే తొలిదశ పోలింగ్‌

ఆప్‌, ‌కాంగ్రెస్‌ల నుంచి బిజెపికి సవాళ్లు
స్థానిక సమస్యలే బిజెపికి తలనొప్పులు
విస్తృతంగా ఏర్పాట్లు చేసిన ఇసి
గుజరాత్‌లో తొలిదశ ఎన్నికలకు రంగం సిద్దం అయ్యింది. బహుశా తొలిసారి బిజెపి గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. డబుల్‌ ఇం‌జన్‌ ‌సర్కార్‌ ఇక్కడ ఉన్నా స్థానిక సమస్యల పరిష్కారంలో ఆ పార్టీ విఫలం కావడంతో ఆప్‌, ‌కాంగ్రెస్‌ ‌పార్టీల నుంచి పోటీని ఎదుర్కొంటోంది. తొలిదశ ఎన్నికలు డిసెంబర్‌1‌న మలిదశ ఎన్నికలు 5న జరుగనున్నాయి. ఈ క్రమంలో ఇసి పటిష్ట ఏర్పాట్లు చేసింది. ఆయా ప్రాంతాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల సామాగ్రి తీసుకుని అధికారులు పోలింగ్‌ ‌కేంద్రాలకు బయలుదేరారు. బిజెపికి వ్యతిరేకంగా ఆప్‌ అధినేత కేజ్రీవాల్‌ ‌దృష్టి పెట్టారు. బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపారు. కాంగ్రెస్‌ ‌తరపున రాహుల్‌, ‌ఖర్గే, చిదంబరం తదితర నేతలు ప్రచారం చేపట్టారు. ఈ క్రమంలో బిజెపి నుంచి అత్యధికులు ప్రచారం నిర్వహించారు. మోడీ, అమిత్‌ ‌షా, నడ్డా, యోగి ఆదిత్యనాథ్‌ ‌తదితరులు ప్రచారం చేపట్టారు. అందుకే రాష్ట్రంలో హిందూత్వ ఓట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోని ఓటర్లను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.

2017 అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి నాయకునిగా ఉన్న విజయ్‌ ‌రూపానీని తన మంత్రివర్గంతో సహా రాజీనామా సమర్పించాలని సెప్టెంబర్‌ 11‌న అధిష్టానం ఆదేశించి, ఆ స్థానాన్ని ఎవరూ ఊహించని రీతిలో భూపేంద్ర పటేల్‌కు కట్టబెట్టడంతో పాటు కొత్త వ్యక్తులను మంత్రివర్గం లోకి తీసుకున్నారు. ఈసారి గుజరాత్‌లో గెలుపు అంత తేలిక కాదనే విషయాన్ని బిజెపి అగ్రనేతలు పసిగట్టారు. ముఖ్యమంత్రిని, మంత్రివర్గ సభ్యుల్ని మార్చడం అనేది దీర్ఘకాలంగా బిజెపి వ్యూహంలో భాగంగా ఉంటూ వస్తున్నది.గుజరాత్‌లో 1996-98 మధ్య కాలంలో చీలిక నాయకుడైన శంకర్‌ ‌సింగ్‌ ‌వాఘేలా నాయకత్వంలోని పాలనా కాలాన్ని మినహాయిస్తే…1995 నుండి నిరంతరాయంగా బిజెపి పాలన సాగిస్తోంది. అలాంటి చోట ఈసారి ఎన్నికల్లో గెలిచేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. అయిన ప్పటికీ రాష్ట్ర ప్రభుత్వంలోని ఉన్నత స్థాయి అధికారులను మార్చడం ఆ పార్టీలో నెలకొన్ని భయాందో ళనలకు సంకేతంగా చూడాలి.

మార్చి 2022 నుండి మొదలుకొని ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికే తన స్వరాష్టాన్ని్ర 12 దఫాలు సందర్శించారు. గత ఆరు నెలల్లోనే 10 సార్లు సందర్శించారు. ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రకటించి, బిజెపి మళ్ళీ అధికారం చేపట్టడానికి అవసరమైన మెజారిటీ సాధించిన మరుసటి రోజున మోడీ మొదటిసారి అంటే మార్చి 11, 12 తేదీల్లో గుజరాత్‌లో పర్యటించారు. ఆ పర్యటనలో భాగంగా అహ్మదాబాద్‌లో, ఆ పక్కనున్న గాంధీనగర్‌లో రోడ్‌ ‌షోలు నిర్వహించి… పొంగి పొర్లుతున్న ఉత్సాహంతో గుజరాత్‌ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఉత్తరప్రదేశ్‌ ‌శాసనసభ ఎన్నికల విజయంతో ప్రయోజనం పొందే స్పష్టమైన సూచిక ఇది. రోడ్‌ ‌షోలు, బహిరంగ సభలు, సమావేశాలతో పాటుగా తన స్వంత రాష్టాన్రికి రూ. 1.18 లక్షల కోట్లతో ప్రాజెక్టులను నిర్మించ తలపెట్టినట్లు ప్రధాని అప్పటికే ప్రకటించారని అంచనా. బిజెపి ఎన్నికల వ్యూహంలో భాగంగా ఆయన ఆ విధమైన ప్రకటనలు చేసారు. అలాగే రాష్ట్రంలో ఉమ్మడి పౌర స్మ•తిని ’అమలు చేసేందుకు’ ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు గుజరాత్‌ ‌ప్రభుత్వం ప్రకటించింది.

గుజరాత్‌ ‌మోడల్‌ ‌విఫలమైందని రుజువు చేసే పరిణామాలు గడచిన ఐదేళ్లలో చోటుచేసుకున్నాయి. గత ఎన్నికల సమయంలో (2017) పటీదార్‌ ఆం‌దోళన చాలా ఉధృతంగా నడుస్తున్నది. దీనికి నాయకత్వం వహించిన యువ నేత హార్దిక్‌ ‌పటేల్‌ను ఆ తరువాత బిజెపి ప్రభుత్వం జైలులో పెట్టింది. జైలు నుండి విడుదలైన తరువాత కాంగ్రెస్‌ ‌పార్టీలో చేరాడాయన. కానీ చివరికి ఇప్పుడు ఈ ఎన్నికల్లో కాషాయ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ప్రభుత్వం చెప్పుకుంటున్నప్పటికీ… తక్కువ వేతనాలు, ఇబ్బందికర పని ప్రాంతాలు, ఉద్యోగ అభద్రత…పలు రకాల అపరిష్క•త సమస్యలతో పారిశ్రామిక కార్మికులు సతమతమవుతున్నారు. కోవిడ్‌ ‌మహమ్మారిని నిరోధించడంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణ తీరు పట్ల ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. దళితులు, ఆదివాసీలు, ముస్లింలు కూడా తీవ్రమైన కష్టాలను, వివక్షతను ఎదుర్కొంటున్నారు. ఈ వర్గాలకు చెందిన ప్రజలు ప్రతిపక్ష పార్టీల వైపు ఆకర్షితులవు తున్నారని పరిశీలకులు భావిస్తున్నారు. పట్టణ స్థానిక సంస్థలు అవినీతి, శిక్షల లేమితో పని చేస్తున్నాయన డానికి మోర్బీ వంతెన విషాదం ఒక సూచన. ప్రజలు రాష్ట్రం లోని పాలక పార్టీ పట్ల బాగా ఆగ్రహంతో ఉన్నారు. తీవ్ర అసంతృప్తితో ఉన్న వివిధ స్రవంతులకు చెందిన ప్రజలు ఒక ప్రత్యామ్నాయం కోసం అన్వేషిస్తున్నారు.

Leave a Reply