గవర్నర్‌ ఫైల్‌ తొక్కిపెట్టడం కుదరదు

హైకోర్టులో ఎమ్మెల్సీ అభ్యర్థుల పిటిషన్‌

హైదరాబాద్‌,ప్రజాతంత్ర,జనవరి5: గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎమ్మెల్సీ పదవులకు నామినేట్‌ చేస్తూ.. గవర్నర్‌కు రెకమెండ్‌ చేయగా దానిని గవర్నర్‌ తమిళసై పక్కన పెట్టారు. ఇందులో దాసోజు శ్రవణ్‌, సత్యనారాయణలు హైకోర్టును ఆశ్రయించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆర్టికల్‌ 171 ప్రకారం తమను ఎమ్మెల్సీలుగా నామినేట్‌ చేస్తూ.. ఆ అభ్యర్ధనను గవర్నర్‌కు పంపారని, కానీ గవర్నర్‌ దానిని నిలుపు చేశారని, కేబినేట్‌ నిర్ణయాన్ని  ఆపడానికి వీలులేదని వీరు హైకోర్టులో పిటీషన్‌ దాఖలు చేశారు. పిటీషన్‌ పై హైకోర్టు విచారణ జరిపింది. క్యాబినెట్‌ నిర్ణయాన్ని గవర్నర్‌ ఆపడానికి వీలు లేదని శ్రవణ్‌, సత్యనారాయణ తరుపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.

ఆర్టికల్‌ 361 ప్రకారం ఈ పిటిషన్‌కు అర్హత లేదని గవర్నర్‌ తరుపు కౌన్సిల్‌ వాదించింది. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు పిటీషన్‌ మెంటేనబిలిటీ పై విచారణ జరుపుతామని తెలిపింది. తదుపరి విచారణ జనవరి 24 కు వాయిదా వేసింది. కాగా, గత బీఆర్‌ఎస్‌ సర్కార్‌ నామినేటెడ్‌ కోటా ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్‌, సత్యనారాయన పేర్లను సూచించింది. ఇందుకు అప్పటి క్యాబినెట్‌ కూడా ఆమోద ముద్రవేసింది.చివరగా  గవర్నర్‌ దగ్గరకు ఫైల్‌ వెళ్లగా గవర్నర్‌ హోల్డ్‌ లో పెట్టింది. గత నెలలో జరిగిన ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ అధికారం కోల్పోయి కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడంతో శ్రవణ్‌, సత్యనారాయణ ఎమ్మెల్సీ పదవుల విషయం అయోమయంలో పడిరది. దీంతో వారు కోర్టును ఆశ్రయించారు. అయితే గవర్నర్‌ ఆమోదిస్తేనే వారికి చట్టబద్దత వస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *