కౌంట్‌ డౌన్‌..07 ‌ప్రజా‘తంత్రం’

ఆఖరి ఘట్టానికి గంట గణగణ
బరిలో నిలిచిన వారికి దడదడ
వార్‌ ‌వన్‌ ‌సైడ్‌ ‌కాదని గుసగుస
వోటరు నాడి పట్టాలని తహతహ

గడప గడపకు నేతలు గిరగిరా
ఆపసోపాలపై లోలోన విసవిస
క్షేత్రస్థాయిలో పరిస్థితి కుతకుత
ఇప్పట్లో చల్లారేలా లేదు భగభగ
– వి.రమేష్‌ ‌బాబు

భారతీయ జనతా పార్టీ జాతీయ  అధ్యక్షుడు జె.పీ నడ్డా ఆ పార్టీ ఎన్నికల ప్రచారసభలో పాల్గొన్నారు.’’ కల్వకుంట్ల కుటుంబ దోపిడీ తెలంగాణలో సాగుతుంది. కేసీఆర్‌ ‌పాలనలో భారీ అవినీతి జరుగుతుంది. ధరణితో పేదల భూములు గుంజుకున్నారు.కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్‌ ‌కి ఎటిఎం గా మారింది. 38 వేల కోట్ల ప్రాజెక్టు లక్ష కోట్ల వ్యయం పెరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టులో కట్టిన పిల్లర్లు కుంగినయి. దళితబంధులో 30 శాతం కమీషన్‌ ‌తీసుకుంటున్నారు.. అవినీతిపై సీట్టింగ్‌ ‌జడ్జ్ ‌తో విచారణ జరిపిస్తాం. ‘‘అని ఆయన సంగారెడ్డి బహిరంగ సభలో అన్నారు. బీఆర్‌ ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ ‌మహేశ్వరం, వికారాబాద్‌, ‌జహీరాబాద్‌ ‌మరియు పఠాన్‌ ‌చెరు ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొన్నారు.  కాంగ్రెస్‌ ‌వాళ్లు రైతు బంధు దుబారా అంటున్నారని, అలాంటి వారికి తగిన బుద్ధి చెప్పాలన్నారు.24 కరెంట్‌ ‌వృధా అని కాంగ్రెస్‌ ‌నాయకులు అంటున్నారని, 3 గంటలు చాలని పేర్కొంటున్నారు.

10 హెచ్‌ ‌పి మోటార్లు పెడితే ట్రాన్స్ఫార్మర్స్, ‌సబ్‌ ‌స్టేషన్లు పేలిపోతాయని, కనీస అవగాహన లేకుండా మాట్లాడటం విడ్డూరంగా ఉంది.. నిమిషాల్లో రిజిస్ట్రేషన్‌లు జరిగి, తప్పొప్పులకు తావులేని ధరణిని బంగాళా ఖాతంలో వేస్తామని చెప్పే కాంగ్రెస్‌ను ఏమి చేయాలో ప్రజలు ఆలోచిం చుకోవలని కేసీఆర్‌ ‌బహిరంగ సభల్లో పేర్కొన్నారు. ప్రదేశ్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి దుబ్బాక, హుజురాబాద్‌, ‌మానకొండూరు బహిరంగ సభల్లో..ముషీరాబాద్‌, ఎల్బీ నగర్‌ ‌నియోజక వర్గాల్లో రోడ్‌ ‌షోల్లో పాల్గొన్నారు.హుజురాబాద్‌ ‌నియోజకవర్గంలో జరిగిన విజయభేరి జనసభలో రేవంత్‌ ‌రెడ్డి మాట్లాడుతూ. సాదుకుంటారా..సంపుకుంటారా అంటే అయ్యో మనోడే అని దిల్లీ నుంచి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తాడు అని రాజేందర్‌ ‌గెలిపించారు.  ఎన్నికల సమయంలో దిల్లీ మోదీ ఉండు నిధులు తెస్తా ఇబ్బడిముబ్బడిగా హామీలు ఇచ్చిన రాజేందర్‌ ‌గెలిచిన తర్వాత ఒక పైసా కూడా తీసుకురాకుండా మిమ్మల్ని మోసం చేశారని రేవంత్‌ ‌రెడ్డి విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *