కామారెడ్డి బరిలోనే ఉంటా

కెసిఆర్‌పై పోటీ చేసి గెలుస్తా
ఓటమి భయంతో బిఆర్‌ఎస్‌ ‌దుష్పచ్రారం

కామారెడ్డి,ప్రజాతంత్ర,అక్టోబర్‌24: ‌కెసిఆర్‌ ‌పోటీచేసినా..ఎవరు వచ్చినా..కామారెడ్డి నియోజకవర్గం నుంచే పోటీ చేసి తీరుతానని  మాజీ మంత్రి, కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత షబ్బీర్‌ అలీ స్పష్టం చేశారు. తాను మరో నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతారన్న వార్తలను కొట్టి పారేశారు. తన పుట్టుక, చావు కామారెడ్డితోనే ముడిపడి ఉన్నాయని అన్నారు. గజ్వెల్‌లో ఓటమి భయంతోనే కెసిఆర్‌ ఇక్కడికి వస్తున్నారని, ఇక్కడా ఆయనకు భంగపాటు తప్పదని అన్నారు. అయితే తను అభ్యర్థిగా ఉంటే ఓటమి తప్పదని భయడపుతున్న అధికార పార్టీ నేతలు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని షబ్బీర్‌ అలీ మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌రాజకీయ ప్రయోజనాల కోసం కామారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారని స్పష్టం చేశారు.

ఇద్దరు ప్రజాక్షేత్రంలో నిలబడితే ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు. కేసీఆర్‌ అధర్మయుద్ధం చేస్తున్నారన్న షబ్బీర్‌ అలీ, నా నిజాయితీ నిరూపించుకుంటానన్నారు.  కామారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు షబ్బీర్‌ అలీ ఆసక్తి చూపడం లేదని, మరో నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారంటూ కొన్ని రోజుల నుంచి ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌కామారెడ్డి నుంచి బరిలోకి దిగడంతో నియోజకవర్గం మారుతున్నారన్న విమర్శలు వచ్చాయి. కామారెడ్డిని వదిలేసి ఎల్లారెడ్డి నుంచి పోటీ చేసేందుకు షబ్బీర్‌ అలీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారని ప్రచారం జరిగింది.

కొన్ని రోజుల వస్తున్న పుకార్లకు షబ్బీర్‌ అలీ తాజాగా చెక్‌ ‌పెట్టారు. కేసీఆర్‌ ‌పోటీ చేసినా సరే కామారెడ్డి నుంచే బరిలోకి దిగుతానని స్పష్టం చేశారు. కామారెడ్డి నియోజకవర్గం నుంచి షబ్బీర్‌ అలీ రెండు సార్లు కాంగ్రెస్‌ ‌పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తొలిసారి 1989 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి యుసుఫ్‌ అలీపై గెలుపొందారు. 2004 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఉప్పునూతల మురళీధర్‌ ‌గౌడ్‌ ‌పై విజయం సాధించారు. వైఎస్‌ ‌రాజశేఖర్‌ ‌రెడ్డి తొలి కేబినెట్‌లో విద్యుత్‌ ‌శాఖా మంత్రిగా పని చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *