- ఆరు గ్యారంటీలను అమలు చేస్తుంది
- ఎన్నికల తరువాత హొకేసీఆర్ కు ఫామ్ హౌసే రెస్ట్ హౌస్
- బీజేపీకి బీఆరెస్ బీ టీమ్ లా వ్యవహరిస్తోంది
- కర్ణాటక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్
తాండూర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 28: తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని సోనియా గాంధీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు. కానీ హొపదేళ్లయినా కేసీఆర్ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేదని కర్ణాటక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు. శనివారం తాండూర్ లో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ… కర్ణాటకలో మేం అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాము.. కానీ పదేళ్లయినా కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయలేదు. కర్ణాటకలో 5 గ్యారంటీలను అమలు చేసాం… గృహజ్యోతి ద్వారా ప్రతీ ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నాం.
కర్ణాటకలో ప్రతీ మహిళకు నెలకు రూ. 2000 అందిస్తున్నాం. మేం చెప్పేది నిజమో కాదు కర్ణాటకలో ప్రతీ ఇంటికి వెళ్లి అడగండి…. మీకే తెలుస్తుంది. కర్ణాటకలో మాదిరిగానే తెలంగాణలోనూ ప్రతీ మహిళకు కాంగ్రెస్ ఉచిత బస్సు ప్రయాణం అందించనుంది.. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది.. ఆరు గ్యారంటీలను అమలు చేస్తుంది. బీజేపీ కి బీ టీమ్ లా బీఆరెస్ వ్యవహరిస్తోంది. మీరు కర్ణాటకకు రండి… మేం ఐదు గ్యారంటీలను అమలు చేస్తున్నామో లేదో చూపిస్తాం.. తేదీ , సమయం మీరు చెప్పండి…మిమ్మల్ని బస్సులో తీసుకెళ్లి నిరూపించడానికి మేం సిద్ధం…అంటూ కేసీఆర్.. కేటీఆర్ కు ఆయన సవాల్ విసిరారు. హొడిసెంబర్ 9న రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటం ఖాయం. ఎన్నికల తరువాత కేసీఆర్ ఇక ఫామ్ హౌస్ వెళ్లి రెస్ట్ తీసుకోవాల్సిందే అని ఆయన వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే పేదలకు సంక్షేమ ఫలాలు-టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి
తాండూర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 28: హొవైఎస్ హయాంలో తాండూరుకు నీళ్లు ఇవ్వాలని ఆనాడు సాగునీటి ప్రాజెక్టులు తెచ్చుకున్నాం.. భుజాలపై మోసి గెలిపిస్తే పైలట్ రోహిత్ రెడ్డి వందల కోట్లకు అమ్ముడు పోయాడు. భూ కబ్జాలు, ఇసుక దోపిడీ దొంగను బీఆరెస్ తన అభ్యర్థిగా నిలిపిందని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి విమర్శించారు. ఎప్పుడూ ఒకరిపై ఒకరు కాలుదువ్వుకునే ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే ఇవాళ ఒకరి కాళ్లు ఒకరు మొక్కుకుంటుర్రు. కాంగ్రెస్ గెలుస్తుందని కేసీఆర్ కు తెలిసిపోయింది.
అందుకే ఓడిపోతే రెస్ట్ తీసుకుంటామని చెప్పిండు.. కేసీఆర్ తన ఓటమిని అచ్ఛంపేటలో ముందే ఒప్పుకున్నాడు. కేసీఆర్ ఓడితే నీది ఏం పొదనుకోకు…. నువ్ మింగిన లక్షకోట్లు కక్కిస్తాం.. 10వేల ఎకరాల భూములను స్వాధీనం చేసుకుంటాం. కేటీఆర్..నువ్వు భూములు ఆక్రమించుకుంటే హైదరాబాద్ అభివృద్ధి జరిగినట్టా.. కాంగ్రెస్ అభివృద్ధికి పునాదులు వేస్తే.. మీరు వచ్చి దోచుకున్నారు తప్ప చేసిందేం లేదు.. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే పేదలకు సంక్షేమ ఫలాలు అందుతాయి. డీకే శివకుమార్ లక్ష 20వేల మెజారిటీతో గెలిచారు.. కొడంగల్, తాండూరు, పరిగి నియోజకవర్గంలో కాంగ్రెస్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించండి అని రేవంత్ రెడ్డి కోరారు.





