కాంగ్రెసు కు జై కొట్టిన లోకారెడ్డి బ్రదర్స్

‌జగ్గారెడ్డి సమక్షంలో కండువా కప్పుకున్న గొల్లపల్లి సర్పంచ్‌, ‌నాయకులు

సంగారెడ్డి, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 28:‌ సంగారెడ్డి నియోజకవర్గం కొండాపూర్‌ ‌మండలం గొల్లపల్లి సర్పంచ్‌ ‌మమతతో పాటు యువ నాయకులు విష్షు వర్ధన్‌ ‌రెడ్డి, శ్రీకాంత్‌ ‌రెడ్డిలతో పాటు గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్‌ ‌నాయకులు, కార్యకర్తలు శనివారం కాంగ్రెస్‌ ‌పార్టీలో చేరారు. వారికి కండువాలు కప్పి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. శ్రీకాంత్‌ ‌రెడ్డి సోదరులు వారి అనుచరులతో కలిసి పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉందని జగ్గారెడ్డి అన్నారు. లోకారెడ్డి శ్రీకాంత్‌ ‌రెడ్డి మాట్లాడుతూ  ఈ సారి జగ్గారెడ్డి విజయం కోసం తామంతా పట్టుదలతో పని చేస్తామన్నారు. తనతో పాటు కాంగ్రెస్‌లో జాయిన్‌ అవుతున్న వివిధ గ్రామాల నేతలు, ప్రజాప్రతి నిధులకు, కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. జగ్గారెడ్డి హయాంలోనే సాధ్యమైందన్నారు.

ఈ సారి ఖచ్చితంగా రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్‌ ‌ప్రభుత్వమేనన్నారు. బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వంలో రైతులకు రుణమాఫీ కూడా సరిగా చేయలేదన్నారు. అన్ని విధాలా ప్రజలకు నష్టం కలిగిం దన్నారు. భారీ ఆధిక్యంతో జగ్గారెడ్డిని గెలిపిస్తా మన్నారు. ఈ సందర్బంగా  జగ్గారెడ్డి మాట్లా డుతూ ‘‘సంగారెడ్డిలో రాష్ట్రంలో కాంగ్రెస్‌ ‌గెలవగానే ప్రతి మహిళకు, ప్రతి నెలా రూ. 2,500 ఇస్తారు. సిలిండర్‌ ‌రూ.500లకే వస్తుంది. పింఛను ఒక్కొక్కరికి రూ.4వేలు , ఇంట్లో ఇద్దరు ఉంటే ఇద్దరికీ పింఛను వస్తుంది. చదువుకునే విద్యార్థులకు రూ.5లక్షల సాయం అందిస్తాం. రైతులకు రూ.2లక్షల రుణ మాఫీ చేస్తాం. ఒకటే కిస్తీలో మాఫీ చేస్తాం. కౌలు రైతులు, రైతు కూలీలకు కూడా నగదు సాయం దొరుకుతుంది. ఆరోగ్య శ్రీ ద్వారా రూ .10లక్షల వరకు ఉచితంగా చికిత్సలు. 200 యూనిట్ల లోపు ఉచితంగా కరెంట్‌ ఇస్తాం ’’అని సోనియా, రాహుల్‌ ‌ప్రజలకు చెప్పమన్నారని జగ్గారెడ్డి వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *