రైతులకు అండగాప్రభుత్వం
ఆన్‌లైన్‌లో ‘రైతునేస్తం’ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
2601 రైతు వేదికలను వీడియో కాన్ఫరెన్సింగ్‌తో అనుసంధానం
ఎప్పటికప్పుడు రైతుల సమస్యల పరిష్కారానికి నిపుణుల సలహాలు, సూచనలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 06 : కరువు వొచ్చినా..ఎంత కష్టం వొచ్చినా రైతులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరువు పరిస్థితులున్నాయని, కలిసికట్టుగా కరువును ఎదుర్కుందామని సీఎం పిలుపునిచ్చారు. ఏడాదిగా సరైన వర్షపాతం లేకపోవటంతో రిజర్వాయర్లలో నీళ్లు అడుగంటుతున్నాయని, అందుకే అన్ని ప్రాంతాల్లో నీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. రిజర్వాయర్ల నుంచి నీళ్లను విడుదల చేయాలని కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్ ప్రాంతంలోని రైతులు, నాయకులు డిమాండ్ చేస్తున్నారని చెప్పారు. రైతులందరూ పరిస్థితిని అర్థం చేసుకోవాలని సిఎం విజ్ఞప్తి చేశారు. వొచ్చే ఎండాకాలంలో తాగునీటి కష్టాలు రాకుండా చూడాల్సిన అవసరముందని, అందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నామని సీఎం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వినూత్నంగా చేపట్టిన రైతు నేస్తం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి బుధవారం ఉదయం తన నివాసం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వ్యవసాయ శాఖ సెక్రెటరీ, కమిషనర్ రఘునందనరావు, డైరెక్టర్ గోపి, రైతు సంఘాల ప్రతినదులు సుంకెట అన్వేష్ రెడ్డి, నల్లమాల వెంకటేశ్వరరావు, వై వెంకటేశ్వరరావు సచివాలయం నుంచి పాల్గొన్నారు. వివిధ జిల్లాల నుంచి పలువురు రైతులు కాన్ఫరెన్స్‌లో పాల్గొని తమ అనుభవాలను పంచుకున్నారు. తాము పండిస్తున్న పంటల ద్వారా లాభాలు సాధిస్తున్న తీరును వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2601 రైతు వేదికలకు వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానం చేసి నేరుగా రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం వినూత్నంగా ఈ కార్యక్రమం చేపట్టింది. తొలి విడతగా ప్రయోగాత్మకంగా 110 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వీడియో కాన్ఫరెన్స్ యూనిట్లను నెలకొల్పింది. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయం సహకారంతో రాష్ట్ర వ్యవసాయశాఖ రూ.97 కోట్లతో ఈ కార్యక్రమం చేపట్టింది. దీంతో రాష్ట్ర అధికారులతో పాటు వ్యవసాయ నిపుణులు నేరుగా గ్రామాల్లో, పంట పొలాల్లో ఉండే రైతులతో ముఖాముఖి మాట్లాడి వాళ్ల సమస్యలను తెలుసుకుంటుంది.
పంటలకు సంబంధించిన సలహాలు, సూచనలతో పాటు అధునాతన మెలకువలను ఎప్పటికప్పుడు వారికి అందిస్తుంది. ఆదర్శ రైతుల తమ అనుభవాలను ఇతర రైతులతో పంచుకునేందుకు వీలు కల్పిస్తుంది. వీడియో కాన్ఫరెన్స్‌లో చేపట్టిన ఈ కార్యక్రమ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…ప్రతి సీజన్లో రైతులు ఎదుర్కునే సమస్యలను దృష్టిలో పెట్టుకొని, ఎప్పటికప్పుడు వాళ్లకు సలహాలు సూచనలిచ్చేందుకు రైతు నేస్తం ఉపయోగపడుతుందని అన్నారు. నేరుగా రైతులు వ్యవసాయ నిపుణులతో మాట్లాడేందుకు వీలు కలుగుతుందన్నారు. ప్రభుత్వమే ప్రజల దగ్గరికి వెళ్లాలని, అందులో భాగంగానే రైతుల సమస్యలను తెలుసుకోవాలనే ఆలోచనతో వ్యవసాయ శాఖ ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని అన్నారు. రైతులతో కలిసి మెలిసి భవిష్యత్ కార్యక్రమాలను తమ ప్రభుత్వం చేపడుతుందని అన్నారు. విత్తనాలు, ఎరువులు, ఏ పంట వేయాలనేది మొదలు పండిరచిన పంట ఉత్పత్తులను అమ్ముకునేంత వరకు ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందన్నారు. రైతులకు పండిరచిన పంటకు గిట్టుబాటు ధర కాకుండా లాభసాటి ధర రావాలనే ఆలోచనతో ప్రభుత్వం కార్యాచరణ చేస్తుందన్నారు. రైతు భరోసా, రైతు రుణమాఫీ, రైతులకు విత్తనాలు అందుబాటులోకి తీసుకురావటం, ఐకేపీ సెంటర్లు, మార్కెట్ యార్డుల ద్వారా పంట ఉత్పత్తుల కొనుగోలు కార్యక్రమాలన్నీ చేపడుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 26 రకాల పంటలు పండటానికి అనుకూలమైన భూములు, వాతావరణం ఉందని, కేవలం వరి లేదా పత్తి, మిర్చీ పంటలకే పరిమితం కావద్దని రైతులకు ఈ సందర్భంగా సీఎం సూచించారు. ఇతర పంటలు సాగు చేయాలని, పంట మార్పిడి ద్వారా అధిక దిగుబడులు వొచ్చే అవకాశం ఉంటుందని అన్నారు. తక్కువ నీళ్లతో, తక్కువ పెట్టుబడితో ఎక్కువ పంట దిగుబడి, ఎక్కువ లాభాలు వొచ్చేలా పంటల ప్రణాళిక చేసుకోవాలని చెప్పారు. వ్యవసాయ శాఖ చేపట్టిన రైతు నేస్తం కార్యక్రమాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని, దీంతో తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు రావచ్చని అన్నారు. ప్రస్తుతం 110 సెంటర్లలో ప్రయోగాత్మకంగా అమలు చేసిన ఈ కార్యక్రమాన్ని భవిష్యత్తులో అన్ని గ్రామాలకు విస్తరిస్తామని చెప్పారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన సూచనలతో ప్రభుత్వం ఇటీవలే పంటల బీమా పథకాన్ని అమల్లోకి తెచ్చిందని గుర్తు చేశారు. రైతులు ఏదైనా ఆపదతో చనిపోతే ఆ కుటుంబాన్ని రైతు బీమా పథకం ఆదుకుంటుందని అన్నారు. రైతులు ధీమాగా బతికేందుకు వీలుగా పంటల బీమా పని చేస్తుందని చెప్పారు. పంట పెట్టుబడి పెట్టినప్పటి నుంచి కరువు వొచ్చినా, వరద వొచ్చినా నష్టపరిహారం అందుతుందని, రైతులు పెట్టిన పెట్టుబడి వారికి తిరిగి వొస్తుందని అన్నారు. దీంతో రైతులు ఆర్థికంగా చితికిపోయే పరిస్థితి ఉండదన్నారు. ఎన్ని కష్టాలు వొచ్చినా రైతులు ధైర్యం కోల్పోవద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం అన్నారు.
నేడు దిల్లీకి సిఎం రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థుల జాబితా ప్రకటించే ఛాన్స్
గెలుపు గుర్రాలు లక్ష్యంగా అభ్యర్థుల ఎంపికకు ఏఐసీసీ కసరత్తు
న్యూ దిల్లీ, మార్చి 6 : కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ప్రకటించనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు దిల్లీకి వెళ్లనున్నారు. గురువారం ఏఐసీసీలో జరిగే స్క్రీనింగ్ కమిటీ సమావేశానికి సీఎం హాజరు కానున్నారు. తెలంగాణ లోక్‌సభ అభ్యర్థుల ఎంపిక కసరత్తును ఏఐసీసీ పూర్తి చేయనుంది. ఒకటి రెండు రోజుల్లో మెజారిటీ లోక్‌సభ స్థానాలను ఏఐసీసీ ప్రకటించనుంది. ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ముగిసిన విషయం తెలిసిందే. మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ కూడా ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అభ్యర్థుల ఎంపిక బాధ్యత రేవంత్‌కు అధిష్ఠానం అప్పజెప్పింది. ప్రస్తుత రాష్ట్ర పరిస్థితులను రేవంత్ హై కమాండ్‌కు వివరించనున్నారు. గెలుపు గుర్రాలకే సీట్లు ఇస్తామని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. తొలి జాబితాలో సీటు దక్కించుకునేందుకు ఆశావహులు ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణలో ఏకాభిప్రాయం ఉన్న సీట్లను ఏఐసీసీ నేడు ప్రకటించనుంది. మహబూబ్‌నగర్ సీటుకు కాంగ్రెస్ అభ్యర్థిగా వంశీచంద్‌రెడ్డి పేరును ఇప్పటికే సిఎం రేవంత్ ప్రకటించారు. మిగతా సీట్లపై మాత్రం హైకమాండ్ ప్రకటన చేస్తుందని చెబుతున్నారు. ఒకవైపు తెలంగాణ నుంచి బరిలోకి దిగాల్సిందిగా రాహుల్ గాంధీని కాంగ్రెస్ నేతలు కోరారు. కేరళలోని వాయనాడ్‌లో సిపిఐ ఈసారి కూడా తమ అభ్యర్థిని బరిలోకి దించడంతో, తెలంగాణ నుంచి ఆయన్ను బరిలోకి దించడానికి కాంగ్రెస్ నేతలు తమ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇకపోతే నాగర్ కర్నూలు నుంచి తన పోటీ ఖాయమని మరో కాంగ్రెస్ నేత మల్లు రవి ప్రకటించారు. తనకు కాంగ్రెస్ అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు. ఈ విషయం కూడా నేటి జాబితా ప్రకటనతో తేలిపోనుంది.