కర్నాటక రోడ్డు ప్రమాదంలో 9 మంది మృతి

బెంగళూరు, ఆగస్ట్ 23 : ‌కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తుమకూరు జిల్లా శిరా తాలూకా బాలినహళ్లిలో లారీ, జీపు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని తుమకూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది. మృతులంతా రాయచూరు జిల్లాకు చెందిన వారని తెలిపారు పోలీసులు.

ఘటనా సమయంలో జీప్‌?‌లో 20 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. శృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. ప్రమాదానికి గురైన వారంతా రోజువారీ కూలీలు అని పోలీసులు వెల్లడించారు. బెంగళూరుకు వెళ్తుండగా ఘటన జరిగినట్లు వివరించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *