తుషారాల తునుకులు
తళుకుమంటూ మెరుస్తూ!
అంబరం నుండి అమ్బుదిలోకి
జారుడు బల్లలు ఆడుతూ!
మబ్బుల గోడల మధ్య
చిన్నటి కైపులు పోతూ
గవాక్షాన్ని తెరచిన వెన్నల రేడు!
చిత్రంగా సైగలు రువ్వుతూ!
చిక్కటి చీకటి నభములో
వెండి తీగలు జిగేలుమంటూ!
వెలుగు గీతలు చేసి
సన్నటి తుంపరకు తోవచూపుతూ!
పచ్చటి సన్నజాజి పందిరి
గుబాళింపు తాలింపు వేస్తూ!
వెచ్చటి గుబురులు పూసి
గువ్వల జంటకు గూడు చేస్తూ!
మిన్నులో ఏదో నిగారింపు
మన్నులో ఏదో సింగారింపు!
కలవని తనువుల తపనల మధ్య
ఎన్నో విరహాలు ఉన్నా!
కలసిన మనసుల మమతల మధ్య
ఎన్నో తమకాల మైమరపు!
ఓ వర్షం కురిసిన రాత్రి
భువనం అణువంతా తరించిపోతోంది!
గగనం తనువంతా మురిసిపోతోంది!
– ఉషారం, 9553875577




