ఉప్పల్లో బిఆర్ఎస్ జండా ఎగరవేయటం ఖాయం
* సీఎం కేసీఆర్ మాట జవ దాటను
*మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ ఆదేశాలు శిరసావహిస్తా: ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి
ఉప్పల్, ప్రజాతంత్ర, నవంబర్ 6: సీఎం కేసీఆర్ మాట జవదాటను…మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ ఆదేశాలు శిరసా వహిస్తా…ఈ మేరకు శక్తివంచన లేకుండా పని చేసి ఉప్పల్ ల్లో బండారి లక్ష్మారెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం ఉప్పల్ నియోజకవర్గం హబ్సిగూడ డివిజన్ లోని ఎమ్మేల్యే బేతి సుభాష్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్ధి బండారి లక్ష్మారెడ్డి , ఎన్నికల ఇంచార్జీ రావుల శ్రీధర్ రెడ్డి , బిఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్బంగా రావుల శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ..10 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏ స్థాయిలో అభివృద్ధి చెందిందో, సంక్షేమ కార్యక్రమాలు ఏ స్థాయిలో ప్రజలకు అందాయో ప్రతి ఒక్కరికి తెలుసు అని అన్నారు. ఉప్పల్ నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి ఆధ్వర్యంలో ఉప్పల్ స్కై వాక్ , డ్రైనేజి వ్యవస్థ , వైకుంఠ దామాలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి అద్భుతమైన ప్రగతి సాధించామన్నారు.ఉప్పల్ నియోజకవర్గంను ఒక మినీ ఇండియా..ఇతర రాష్ట్రాల నుండి ఇతర దేశాల నుండి సైతం వచ్చి ఇక్కడే నివసిస్తున్నారని తెలిపారు.కేసీఆర్ నేతృత్వంలో ఐటీ కంపెనీలు,ఇతర పరిశ్రమలు ఉప్పల్ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు.నియోజకవర్గంలో పెన్షన్,కంటి వెలుగు,షాది ముబారక్ లాంటి సంక్షేమ కార్యక్రమాలు దాదాపు 96 వేల కుటుంబాలకు అందాయని,ఉప్పల్ లో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీనే గెలిపిస్తాం అంటూ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారనారు.అలవికాని హామీలు ఇచ్చేవారిని ఇక్కడ ప్రజలు నమ్మడం లేదని,ఎక్కడ చూసినా బిఎల్ఆర్ ను గెలిపిస్తాం అని అంటున్నారని తెలిపారు.

ప్రతిపక్ష పార్టీల నేతలు ఉప్పల్ నియోజకవర్గంలో ఎక్కడ కూడా ప్రచారం చేయడం లేదన్నారు.కేసీఆర్ భరోసా మ్యానిఫెస్టోలో 400 కే సిలిండర్ ఇస్తాం అని ముఖ్యమంత్రి చెప్పారన్నారు. మోడీ వంటింటిలో మంట పెడితే మన ముఖ్యమంత్రి కేసీఆర్ సిలిండర్ రేట్లు తగ్గించి మహిళలకు అండగా నిలిచారన్నారు.
ఇక్కడి కాంగ్రెస్ అభ్యర్ధి నామీద కేస్ లు ఉన్నాయో చెప్పండి అంటూ కోర్ట్ కు వెళ్లారు, ఆయన పరిస్థితి ఇలా ఉందన్నారు. కేసీఆర్ హ్యాట్రిక్ ముఖ్యమంత్రి అవుతారని, సౌత్ ఇండియా లో రికార్డ్ సాధిస్తాం అన్నారు.ఉప్పల్ ఎమ్మెల్యే అభ్యర్ధి బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూఎలాంటి విభేదాలు లేకుండా మేము అందరం కలిసి పని చేస్తామని తెలియజేస్తూకా ర్యకర్తలందరినీ కలుపుకొని ముందుకు పోదామని అన్నారు.మా అన్న రాజిరెడ్డి ఉప్పల్ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారనీ, అలానే సుభాష్ రెడ్డి కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారనీ తెలిపారు.అన్నదమ్ముల్లాగా కష్టపడి కలిసి పనిచేసి పార్టీని గెలిపించుకుందామని,మీకు నేను సహకరించాను, మీరు కూడా నాకు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నానని అన్నారు.ఉప్పల్ నియోజకవర్గంలో మరోసారి బీఆర్ఎస్ జెండాను ఎగురవేసి కేసీఆర్ కి గిఫ్ట్ గా ఇద్దామని అన్నారు.బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ నగరాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని రంగాల్లోఎంతో అభివృద్ధి చేశారనీ,ప్రజలు బీఆర్ఎస్ వైపే చూస్తున్నారు. డిసెంబర్ 3వ తేదీన ఉప్పల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ జెండా ఎగురుతుందనీ, రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ జెండా ఎగిరి ముఖ్యమంత్రి కేసీఆర్ మూడవసారి ముఖ్యమంత్రి అవుతారనీ పేర్కొన్నారు. ఉప్పల్ నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ తీసుకొని స్కై వే లు, ప్లై ఓవర్ లు ఏర్పాటు చేశారన్నారు.రేవంత్ రెడ్డి చిప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారనీ, కొడంగల్ లో ఓటమి చెందుతాడు కాబట్టి కామారెడ్డి లో సీఎం పై పోటీ అంటున్నారనీ అన్నారు. సీఎం కేసీఆర్ తో పోటీ చేసి రేవంత్ రెడ్డి ఎలాగూ ఒడిపోతాడు కాబట్టి కొడంగల్ లో కూడా ఒడిపోయాను అని అనేందుకు చిప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారనీ పేర్కొన్నారు.ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మాట దాటననీ, మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ ఆదేశాల మేరకు శక్తివంచన లేకుండా పని చేసి బండారి లక్ష్మారెడ్డిని గెలిపించుకుంటామని స్పష్టం చేశారు.నాకు గత 23 యేండ్లుగా కేసీఆర్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నానన్నారు.పార్టీ పెట్టిన కొద్దిరోజులల్లోనే నేను పార్టీ లో జాయిన్ అయ్యాననీ , నన్ను కడుపులో పెట్టుకొని ఒక్క తండ్రి లాగా చూసుకొని కేసీఆర్ నాకు ఎమ్మెల్యే గా అవకాశం కల్పించారని తెలిపారు.నేను సీఎం కేసీఆర్ ,మంత్రి కేటీఆర్ ఆదేశాలతో ఉప్పల్ లో స్కై వే, ప్లై ఓవర్ లు, శిల్పారామంతోపాటు 24బస్తి దవాఖానలు, ఒక డిగ్రీ కాలేజ్, 3 గురుకులాలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు.నేను తండ్రి మీద అలిగాను, అందుకే నన్ను మళ్ళీ పిలుచుకుని మాట్లాడారన్నారు.సీఎం కేసీఆర్ మాట దాటననీ, మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ ఆదేశాల మేరకు శక్తివంచన లేకుండా పని చేసి బండారి లక్ష్మారెడ్డిని గెలిపించుకుంటామని స్పష్టం చేశారు.ఇది ఒక్క వృక్షం …వృక్షం ను కాపాడుకోవడం మన బాధ్యత , ఎంతో మంది ఇతర పార్టీల నాయకులు ఆ పార్టీలను వీడి బీఆర్ఎస్ లోకి వచ్చారు.నాపై కూడా అనేక మంది అనేక రకాలుగా మాట్లాడారు. కానీ మొదటి నుండి నాది ఇదే పార్టీ నేను పార్టీ మారే ప్రసక్తి లేదన్నారు.కేసీఆర్ నాయకత్వంలో నగరం ఎంతో అభివృద్ధి చెందిందనీ,రానున్న రోజుల్లో హైదరాబాద్ నగరం మరింత అభివృద్ధి చెందాలంటే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీనే అధికారంలోకి తీసుక రావాలని తెలిపారు.ఉప్పల్ ఈశాన్యంలో ఉంది. ఏ కార్యక్రమం జరగాలన్నా ఇక్కడ నుండే జరగాలనీ,అందుకే ఇక్కడ అనేక ఐటీ కంపనీలు వచ్చాయన్నారు.రానున్న రోజుల్లో ఉప్పల్ కు ఒక మహర్దశ రానుందనీ అన్నారు. మేమె హిందువులు అని కొంతమంది చేపుకొంటున్నారు. వారు హిందువులకు ఒక్క గుడి కట్టారా ఏం చేశారన్నారు. కేసీఆర్ యాదాద్రి గుడి కట్టారు మీరుఏం కట్టారనీ ప్రశ్నించారు.రాష్ట్రంలో నూ ,ఉప్పల్ నూ లో బీఆర్ఎస్ గెలిచేది అని బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో బి ఆర్ ఏస్ కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు, మాజీ కౌన్సిలర్ లు, పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.





