ఈ కాలపు ద్రౌపది ఒంటరి కాదు ..!

వార్తల ముఖ్యాంశాలలో ఉద్దేశపూర్వకంగా ద్రౌపది ‘చీరహారన్‌/వస్త్రాహారం’ గురించి నొక్కి చెప్పడం ద్వారా వాటి మధ్య సమాంతరాన్ని గీయడం ఒక అద్భుతమైన సారూప్యతగా మనకు అనిపించవచ్చు. కానీ, 2024 లో రాబోయే లోక్‌సభ ఎన్నికలకు ముందే తెలివిగా మనకి వారికి మధ్య వాళ్ళు గీసిన విభజన రేఖ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాదు కంటికి కనిపించని కుట్రలెన్నో ఉన్నాయక్కడ.

నా స్నేహితురాలి కూతురు అకిరా పుట్టి అప్పుడే సంవత్సరం అయింది. తన మొదటి పుట్టిన రోజు ఈరోజు. కానీ తను పెరగబోయే ఈ ప్రపంచాన్ని తల్చుకుంటేనే నాకేదోలా ఉంది. ఇదేమి తక్కువ పితృస్వామ్యం దేశం కాదు కదా మరి ? తను ఏమీ చేయాలనుకున్న ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సి వస్తుందో ఏమో.. తను కూడ తన అమ్మాలాగే దృఢంగా, స్వతంత్రంగా తయారవుతుందో లేక కోరికల్ని మోస్తూ, మొండిగా ఉంటే  ఎవరేం అనుకుంటారో అన్న ఆలోచన మధ్య పిరికిగా తయారవుతుందా ఏంటని దిగులుగా ఉంది. ఈ కమిటీకి చెందిన మరో ఐదుగురు ప్రతిపక్ష సభ్యులతో పాటు అఖిల భారత తృణమూల్‌ కాంగ్రెస్‌ (టిఎంసి) నాయకురాలు మహువా మొయిత్రా పార్లమెంటరీ ఎథిక్స్‌ కమిటీ సాక్షి స్టాండ్‌లో ఒక్కొక్కరిని కడిగిపడేస్తూ ఉద్రేకపూరితమైన కంఠన్ని వినిపించారు. ఎక్కడ వెనక్కి తగ్గకుండా తన వాదనని వినిపిస్తు పోయారు.తన పార్లమెంట్‌ సభ్యుడి లాగిన్‌ క్రెడెన్సియల్స్‌  తను షేర్‌ చేసినట్టు అంగీకరిస్తూ, అసలు అలా షేర్‌ చేయకూడదనే నిషేధం అక్కడేమి లేదు కదా. అలాంటపుడు నేను ఈ క్రెడెన్సియల్స్‌ ని షేర్‌ చేయడం నేరం ఎలా అవుతుంది అని ప్రశ్నించారవిడ. ప్రశ్నలను టైప్‌ చేయాలంటే ఎంపీ ల లాగిన్‌ క్రెడెన్సియల్స్‌ ని  తప్పక ఇవ్వాలి కదా కాకపోతే నేను దానికి అనుమతినివ్వాలి. అనుమతి లేకుండా వన్‌ టైం పాస్వర్డ్‌ తో చేస్తే అప్పుడు తప్పు అవుతుంతుంది కదా అన్నారు.

‘క్యాష్‌ ఫర్‌ క్వెరీ’ స్కామ్‌లో నేరం మోపబడిన వస్తువుల బ్యాగ్‌ను కూడా ఆమె తన వెంట తీసుకువచ్చింది. అందులో ఎలాంటి నగదు లేదని, ఆమె అందుకున్న వస్తువులన్ని కూడ స్నేహపూర్వకంగా, బహుమతి రూపంగా పొందినవే తప్ప ఇంకేం కాదని చూపించింది విప్పి చూపించింది. అసలిదంతా అదానీపై ఎలాంటి ప్రశ్నలు లేవనెత్తకుండా, మోదీ కి అదానీకి మధ్య వున్నా బంధాన్ని బహిర్గతం చేయకుండా తనను ఆపడానికి భారతీయ జనతా పార్టీ (బిజెపి) చేసిన ఒక ఘోరమైన హిట్‌-జాబ్‌ ఇది అని ఆమె పేర్కొంది. ఇక్కడ మొత్తం ఎపిసోడ్‌ అసలేంటానేది నిజ నిర్ణీత సమయంలో బయటపడుతుంది. నచ్చిన వారి పక్షం వహించే స్వేచ్ఛ వారికి ఉన్నప్పటికి, ‘వస్త్రాహారన్‌’ (మృదువుగా అయిన) మీద  కమిటీ ఛైర్‌పర్‌సన్‌ని ప్రశ్నించిన ఆమె తీరు ఆమె లోని నిరాడంబరతకు అద్దం పడుతుంది. కొన్ని తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతుంది. అంతేకాదు వాటి ప్రభావం మనపై చాలా పడ్తుంది. వార్తల ముఖ్యాంశాలలో ఉద్దేశపూర్వకంగా ద్రౌపది ‘చీరహారన్‌ /వస్త్రాహారం’ గురించి నొక్కి చెప్పడం ద్వారా వాటి మధ్య సమాంతరాన్ని గీయడం ఒక అద్భుతమైన సారూప్యతగా మనకు అనిపించవచ్చు. కానీ, 2024 లో రాబోయే లోక్‌సభ ఎన్నికలకు ముందే తెలివిగా మనకి వారికి మధ్య వాళ్ళు గీసిన విభజన రేఖ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాదు కంటికి కనిపించని కుట్రలెన్నో ఉన్నాయక్కడ..

మహాభారత కాలం నుండి నేటి వరకు ఏం మారింది..? ఒక చట్రంలో ఇరుక్కుపోయిన స్త్రీ ఒంటరితనం తప్ప…మహాభారతంలో ద్రౌపది ఒక్కతే ఇతర స్త్రీల పాత్రలని కూడ పోషించి అందరి దృష్టిని ఆకర్షించినట్టు ఇక్కడ మహువా కూడ ఒక్కతే ఒంటరిగా బ్యాటింగ్‌ అండ్‌ ఫీల్డింగ్‌ చేస్తుంది అంతే పెద్దగా తేడా ఏమీ లేదిక్కడ. కొందరు ఆమెను ‘బెంగాల్‌ టైగర్‌’ అని పిలుస్తున్నారు. నిజమే పులులు ఒంటరిగా గంబీరంగా జీవిస్తాయి. అందుకు ప్రతీకే ఈ బెంగాల్‌ పులి. అందుకే టీ ఎం సీ  మరియు  ఇంకే ఇతర అధికారిక పార్టీలు ఆమెకు మద్దతుగా రాకపోయినప్పటికీ, నేటి ద్రౌపది ఒంటరిగా నిలబడదనే నిజాన్ని మహిళలు భారతదేశం అంతటా బహిర్గతం చేయాల్సిన సమయం ఇది. పార్టీ శ్రేణులకు అతీతంగా,ఆదర్శ భావజాల రేఖకి అతీతంగా సోదరీమణులంతా తనకి మద్దతుగా నిలబడాలి. ఒక సోదరభావాన్ని ఎలిగేత్తి చాటడం కోసం తన సైడ్‌ నిలబడాలి. ఎందుకంటే ‘మహిళల పట్ల గౌరవం’అనేది చాలా రాజకీయ పార్టీలలో ఉత్తి నామమాత్రానికే ఉంది.
ఒక ఎంపీ ని పట్టుకొని ‘ఆమె అర్థరాత్రి ఎవరిని పిలుస్తుంది?’ అని అడగడం, ఆమె వ్యక్తిగత విషయాల్ని ఎథిక్స్‌ కమిటీ చర్చలో పెట్టి ఆమె గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంత అసహ్యకరం..? ఇలాంటి వాటిని చర్చలో అనుమతించకూడదు.

ఇది కేవలం బాధితులుగా మార్చాబడిన మహిళల గురించి మాత్రమే కాదు, ఇప్పటివరకు మనం మాట్లాడుకుంటున్న పులి గురించి మాత్రమే కాదు గదిలోని ఏనుగును గురించి కూడా సంబోధించే ఒక అవకాశం. భారతదేశంలో ఇప్పటివరకు రాజకీయాలలోకొచ్చిన, రాణిస్తున్న స్త్రీలంతా కూడ చాలా కాలంగా ఒక రకమైన ‘టూల్‌కిట్‌’తో కొట్టబడుతున్నారు. ఎన్నో ప్రశ్నల్ని ఎదురుకుంటు, ఎన్నో అవమానాల్ని భరిస్తు వస్తున్నారు. వాళ్ళు అమలు చేసే పద్ధతిపై కాకుండా వ్యక్తిగతంగా వారి జీవితాలపై ప్రశ్నల్ని నిందల్ని మోయాల్సి వస్తుంది. ఆమె వేసుకునే బట్ట దగ్గరినుంచి, ఆమె ఎవరితో డేటింగ్‌ చేస్తున్నది అన్ని చర్చే ఇక్కడ.

 ఇక చాలు ఇప్పటికే చాలా భరించం.!
దీనిని కేవలం టిఎంసి మహిళలే కాదు, కాంగ్రెస్‌, బిజెపి మహిళలే కాకుండా రాజకీయేతర మహిళలు కూడా శ్రద్ధ వహించాలి. మహిళలంతా ఒక్కటిగా గట్టిగ, స్పష్టంగా చెప్పాలి. ‘‘భారతదేశంలోని మహిళలంతా మేము గతానికి అనుగుణంగా నడుచుకుంటు, ఆ ఆదర్శల్నే పట్టుకు వెళ్ళాడుతూ మమ్మల్ని మేము దిగజార్చుకోలేమని, మాతోటి స్త్రీలని కూడ దిగజారానివ్వం ఇక అని ప్రకటించాలి. మేము మా సొంత మహిళా మ్యానిఫెస్టోను ప్రకటించాల్సిన అవసరం ఉంది . ప్రతి తలుపు మీద,  కార్యాలయాల గోడల మీద, ప్రతి ట్విట్టర్‌ అకౌంట్‌ లోను దీన్ని తగిలించాలి. అండ్‌ అది ఎలా ఉండాలి  అంటే బీ ‘‘పురుషులకూ మల్లె ధైర్యంగా, మొండిగా, చురుగ్గా, ఆశవాది గా ఉండే హక్కు స్త్రీలకూ వుంది. ఒకరి భార్యగా, స్నేహితురాలిగా, ప్రేయసిగా ఉండాలో, ఉండకూడదో నిర్ణయించుకునే హక్కు తనకి పూర్తిగా వుంది.మోడరన్‌ గా ఉండాల వద్దా, మేకప్‌ వేసుకోవాలా వద్దా, ఒంటరిగా బతకాలో వద్దో కూడ నిర్ణయించుకునే స్వేచ్చ తనకి వుంది.

పని చేయాలా లేదా అన్నది తన ఇష్టం. పిల్లలు కావాలా వద్ద అన్నది కూడ తన ఛాయస్‌. హిజాబ్‌ వేసుకోవాలా వద్ద ప్రతిదీ తన ఇష్టం. పురుషులకి మల్లె తనకి తన ఇష్టానుసార నిర్ణయాలు తీస్కునే హక్కు తనకుంది. మగాళ్ళకి మాత్రమే ఫ్రెండ్స్‌ తో నైట్‌ ఔట్‌ అని మీటింగ్స్‌ అని, పార్టీలని చెప్పి బైట ఉండే హక్కు లేదు,అది స్త్రీలకు కూడ వర్తిస్తుంది. మహిళకి కూడ సామాజిక స్థితిగతులను, ప్రభుత్వ చర్యలను, ఆర్థిక విషయాలకి సంబందించిన నిర్ణయాలను (ఆధానితో సహా ) ప్రశ్నించే అధికారం ఉంది. దేవున్ని ప్రార్ధించడం, వారి వారి నమ్మకాల్ని అనుసరించడం, పొగ తాగడం, మందు తాగడం, నిషేదాల్ని ఉల్లంగించడంలాంటి అన్ని చట్టపరమైన హక్కులు పురుషులకి ఉన్నట్టుగానే మహిళలకి కూడ ఉన్నాయ్‌. కాలు మీద కాలేసుకొని కూర్చునే హక్కు మగాడికే కాదు ఆడాళ్ళకి వుంది. తను జీన్స్‌ వేసుకోవాలో వద్దో అది పూర్తిగా తన వ్యక్తిగతం. తన పేరు ముందు ఇంటిపేరు తోకని తగిలించుకోవాలో వద్దో అంత తన ఇష్టం. తనకా హక్కు వుంది. పనిచేస్తున్న చోట జీతాలు పెంచమని, ప్రొమోషన్స్‌ ఇవ్వమని అడిగే హక్కుంది తనకి. ఇంట్లోను సమాన హక్కుగా ఆస్తిలో తన వాటాను తను అడిగి తీసుకునే హక్కు గురించి కూడ మనకు తెలియనిది కాదు. మగాళ్ళకి మల్లె పని పాట లేకపోయిన రోడ్లు పట్టుకు తిరిగే, పార్క్‌ ల వెంట వెళ్ళే, మనసుకి నచ్చిన చోటుకి వెళ్ళే స్వేచ్చ స్త్రీకీ వుంది. అల్లరిచేసే, గంతులేసే, నవ్వే, ఏడ్చే ప్రతి హక్కు స్త్రీకి వుంది. మగాళ్ళకి మాత్రమే కాదు.స్త్రీలకీ ప్రైవసీ ఉండాలి. ఆ ప్రైవసీలో తను ఏం చేసుకుంటుంది అనేది పూర్తిగా ఆమె వ్యక్తిగతం. ఆమె ప్రైవేట్‌ స్పేస్‌ లో ఆమె ఏమైన చేసుకునే హక్కు ఆమెకి వుంది. ఆమెకి అనిపించిన చోటల్ల తన అభిప్రాయాన్ని చెప్పే హక్కు తనకుంది.’’

ఇటీవల, మహిళా రిజర్వేషన్‌ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని పిలుపునిస్తూ, ప్రియాంక గాంధీ మహిళలు ఇంకా బానిసలుగా ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. తరతరాలుగా మనల్ని నొక్కిపెట్టిన, అణచివేసి ఈ వ్యవస్థ నుండి మనల్ని మనం కాపాడుకోవాలని ఉద్వేగభరితమైంది. ప్రజాభిప్రాయంతోనో, వారిని వక్రీకరిస్తూ, దూషిస్తునో లేక వ్యవస్థీకృతమైన దాడి ద్వారానో మహిళల్ని ఇక ఉరి తీయలేరు.వారి ధైర్యాన్ని దెబ్బ తీయలేరు. అలాగే చుట్టపు చూపుగా ఏదో పై పైకి అలా మహిళ సమస్యలని పట్టించుకొని, ఏదో ఉద్దరిస్తున్నట్టు షో చేసే డ్రామాలన్ని కూడ ఇక చెల్లు ఇకనుంచి. ‘‘కలిసి నడుస్తం మేం, వెలుగై ప్రకాశిస్తాం  మేము.’’ అన్న మాయా ఏంజెలో స్ఫూర్తిదాయకమైన మాటల్ని గుర్తుచేసుకోవాలి మనం. మహువా మోయిత్రా మీ ధైర్యానికి సలాం. మీరు ఒంటరి కాదు. దైర్యంగా మాట్లాడండి మీరు. మిమల్ని చూసి స్ఫూర్తి పొందే వారి కోసం మాట్లాడండి. ఈ రోజు ఇక్కడ మీరున్నారు బహుశా రేపు మేముండొచ్చు.
(అవని బాన్సల్‌ సుప్రీం కోర్ట్‌ అడ్వకేట్‌ మాత్రమే కాదు కాంగ్రెస్‌ పార్టీ మెంబెర్‌ కూడ)
-‘ది వైర్‌ ‘ సౌజన్యంతో.. అనువాదం : దియావిగ్నేష్‌

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *