ఆత్మవిశ్వాసం తో చదవండి.. విజయం మీదే..

  • మీరు ఉద్యోగాలు సాధించడమే మాకు బహుమతి..
  • మీరు జీవితంలో స్థిరపడే వరకు తోడుంటాం

ఆత్మవిశ్వాసంతో చదివితే … విజయం మీ సొంతమవుతుందని రాష్ట్ర ఆర్థిక , వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు . సిద్దిపేట జిల్లా కేంద్రంలోని విపంచి కళానిలయంలో పోలీస్ శిక్షణ తీసుకున్న అభ్యర్థులకు ఉచిత మెటిరీయల్ పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు . ఈ సందర్భంగా శిక్షణ పొందిన అభ్యర్థులను ఉద్దేశించి మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ ఈ 60 రోజుల శిక్షణ పూర్తయిందంటే .. మీరు మొదటి ఎక్కినట్టే అని .. మీకు ఒక బలమైన సంకల్పం ఏర్పడిందన్నారు . కొంత మంది ఉద్యోగాలు సాధించి మిగతా వారు మిగిలినా .. ఎవరూ నిరాశ చెందవద్దని.. మీరు జీవితంలో స్థిరపడే వరకు మిమ్మల్ని వదలిపెట్టమన్నారు . ప్రభుత్వ ఉద్యోగాలే కాకుండా , ప్రయివేటు కానీ , ఇతర ఉద్యోగాలు సాధించేందుకు అన్ని సహకారాలు తాము అందిస్తామని భరోసా ఇచ్చారు .

ఎవరైతే తల్లిదండ్రుల కళ్లల్లో ఆనందం చూడాలనుకుంటారో.. అదే పట్టుదల ఉన్నవారికి తాము అన్ని విధాల సహకరిస్తామని తెలిపారు . మీరందరూ ఉద్యోగం సాధిస్తారనే నమ్మకం తమకు ఉందని .. ఆత్మవిశ్వాసంతో గురి చూసి కొడితే ఆకాశానికి కూడా రంధ్రం పడుతుందని .. కాబట్టి మీరందరూ ఆత్మవిశ్వాసంతో ఉండాలని సూచించారు . కొండపాకకు చెందిన అఖిల్ ఇంటివద్దనే చదివి సివిల్స్ సాధించాడని .. అతన్ని మీరందరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు . తాత్కాలిక ఆనందాలకు కొద్ది రోజులు దూరంగా ఉంటే శాశ్వతంగా సంతోషంగా ఉండే ఫలితాలు వస్తాయన్నారు.

Read with confidence .. Success is yours minister harees rao

ప్రిలిమినరీ తర్వాత ఫిజికల్ టెస్ట్ పాటు ఫైనల్స్ కు కూడా శిక్షణ అందిస్తామని హామి ఇచ్చారు . అన్నీ మీ చేతులో ఉన్నాయని .. అందుకోవాల్సింది మీరే అని మంత్రి హరీష్ రావు అన్నారు . మీరు ఎన్ని ఉద్యోగాలు సాధిస్తే.. అదే మాకు బహుమానం అన్నారు. శిక్షణ సమయంలో అభ్యర్థులకు భోజనాలకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు . ఈ కార్యక్రమంలో ఎంపీ ప్రభాకర్ రెడ్డి , సీపీ శ్వేత , శిక్షకుడు భాగ్యకిరణ్ , డీసీపీలు , ఏసీపీలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *