అసెంబ్లీ వేదికగా కెసిఆర్‌ అబద్ధాలు

విద్యత్‌ ‌బిల్లుఐ చర్చ కాదు..పెంచిన ఛార్జీలపై చర్చించాలి
మునుగోడులోనూ కెసిఆర్‌కు షాక్‌ ‌తప్పదు
బిజెపి ఎంఎల్‌ఏ ఈటల రాజేందర్‌

‌హైదరబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 12 : కేంద్ర విద్యుత్‌ ‌సవరణ బిల్లుపై సీఎం కేసీఆర్‌ ‌పచ్చి అబద్ధాలు చెప్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. బాయిలకాడ మోటార్లకు వి•టర్లు పెడ్తదని..కేంద్రాన్ని బద్నాం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయం ఎక్కడా చెప్పకున్నా అసెంబ్లీ వేదికగా కెసిఆర్‌ అబద్ధాలు వల్లించారని మండిపడ్డారు. దుబ్బాక, హుజురాబాద్‌ ఉప ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే బోర్లకు వి•టర్లు వొస్తాయని ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నికతో మరోసారి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌ ఎన్ని కుట్రలు చేసినా..మునుగోడులో బీజేపీయే గెలుస్తుందని స్పష్టం చేశారు. ఉప ఎన్నికలో కేసీఆర్‌కు మనమే వి•టర్లు పెట్టాలని పిలుపునిచ్చారు. టిఆర్‌ఎస్‌కు ఫ్యూజు  పీకాలన్నారు. హుజురాబాద్‌ ఉప ఎన్నిక తర్వాత కేసీఆర్‌ ‌తెలంగాణ ప్రజలకు వి•టర్లు పెట్టారని ఈటల రాజేందర్‌ అన్నారు. బోర్లకు వి•టర్లంటూ కేంద్రాన్ని బద్నాం చేస్తూ..సైలెంట్‌గా విద్యుత్‌ ‌చార్జీలు పెంచారని మండిపడ్డారు. కరెంట్‌ ‌బిల్లులతో ప్రజలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కరెంట్‌ ‌ఛార్జీలపై ఎందుకు చర్చించరని అన్నారు. ప్రజలపై భారం మోపిన కెసిఆర్‌ ‌దీనిపై ఎందుకు చర్చించలేదన్నారు. బోర్లకు వి•టర్లు పెడతామని కేంద్రం ఎప్పుడూ చెప్పలేదని ఈటల రాజేందర్‌ అన్నారు. రైతులకు సబ్సిడీ ఇవ్వొద్దని చెప్పలేదని వివరించారు. పేదలకు సబ్సిడీ పథకాలు అమలు చేసేందుకు కేంద్రం ఎప్పుడు ముందుంటుందన్నారు. కానీ కేసీఆర్‌ ‌శాసనసభలో కేంద్రంపై తప్పుడు ప్రచారం చేసి లబ్దిపొందే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిస్కంలు, డిస్టిబ్యూట్రర్లు, జెన్‌కో, ట్రాన్స్‌కో కంపెనీలకు బకాయిలు చెల్లించాలని తెలంగాణతో పాటు అన్ని రాష్ట్రాలను కేంద్రం హెచ్చరిందని గుర్తు చేశారు.

సింగరేణి దివాలా తీసిందని..దాదాపు రూ.10వేల కోట్లు బకాయిలు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నారని ఈటల రాజేందర్‌ అన్నారు. డిస్ట్రిబ్యూషన్‌ ‌కోసం జెన్‌కో కంపెనీకి తెలంగాణ ప్రభుత్వం రూ. 7వేల కోట్ల బాకీ ఉన్నదన్నారు. 16వ ఫైనాన్స్ ‌కమిష ద్వారా కేంద్రం తెలంగాణకు రూ. 10వేల కోట్ల సాయం చేసినా..పదే పదే బీజేపీ ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారని మండిపడ్డారు. శాసనసభలో కేసీఆర్‌ ‌ప్రధాని, బీజేపీ గురించి మాట్లాడుతున్న మాటలు జుగుప్సాకరంగా ఉన్నాయని ఈటల రాజేందర్‌ ఆ‌గ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ ‌మాటలు వింటుంటే..ఈయన్నేనా మనం వోట్లేసి గెలిపించిందని అని ప్రజలు అసహ్యించుకుంటున్నారని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *