అమ్మను చూసి చాలా నేర్చుకున్నా..నాపై నాన ప్రభావం తక్కువే

చెల్లెలు కవిత చాలా డైనమిక్‌..‌మా కుటుంబంలో అలా ఇంకెవరూ లేరు
సతీమణికి చాలా ఓపిక
మహిళలకు ఎన్నో పథకాలు తెచ్చాం..ప్రత్యేకంగా నాలుగు ఇండస్ట్రియల్‌ ‌పార్కులు ఏర్పాటు చేశాం
మహిళలకు సరైన సంఖ్యలో టికెట్లు కేటాయించక పోవడం బాధగానే ఉంది
‘వుమెన్‌ ఆస్క్ ‌కెటిఆర్‌’ ‌మహిళలతో చర్చా కార్యక్రమంలో మంత్రి కెటిఆర్‌

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ :  ‌తన చిన్నతనంలో తండ్రి కెసిఆర్‌ ‌ప్రజాజీవితంలో బిజీగా ఉండడం వల్ల ఆయన ప్రభావం తనపై అంతగా లేదని, కాని తమ తల్లిని చూసి చాలా నేర్చుకున్నాననిబిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ‌మంత్రి కెటిఆర్‌ అన్నారు. తన చెల్లి కవిత చాలా డైనమిక్‌ అని, ఆమె అంత ధైర్యవంతురాలు కుంటుబంలో మరెవరూ లేరని అన్నారు. ఆదివారం హైదరాబాద్‌ ‌హోటల్‌ ‌గ్రాండ్‌ ‌కాకతీయలో వుమెన్‌ ఆస్క్ ‌కెటిఆర్‌ ‌పేరున మహిళలతో నిర్వహించిన ప్రత్యేక చర్చా కార్యక్రమంలో కెటిఆర్‌ ‌పాల్గొని తమ కుంబంబం గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా కెటిఆర్‌ ‌మాట్లాడుతూ…తన సతీమణికి ఓపిక చాలా ఎక్కువని తెలిపారు. ఇక తన కుమార్తె చిన్న వయసులోనే బాగా ఆలోచిస్తుందని, ఆమె పుట్టిన తర్వాత తన జీవితం మారిందని అన్నారు.

తాను పిల్లలిద్దర్నీ సమానంగా చూస్తానని అన్నారు. ఇక బిఆర్‌ఎస్‌ ‌మళ్లీ అధికారంలోకి వొస్తే మహిళలలకు చాలా తక్కువ వడ్డీతో రుణాలు ఇస్తామని తెలిపారు. డీప్‌ ‌ఫేక్‌ ‌మహిళలకే కాకుండా రాజకీయ నాయకులకు సైతం ప్రమాదమేనని, ప్రత్యర్థులు దాంతో తమపై దుష్ప్రచారం చేస్తున్నారని  వ్యాఖ్యానిస్తూనే తాను రష్మిక మందన్న అంత ఫేమస్‌ ‌కాదంటూ ఛలోక్తులు విసిరారు. ఇక రాజకీయాల గురించి మాట్లాడుతూ…ఈ ఎన్నికల్లో మహిళలకు ఇవ్వాల్సిన సంఖ్యలో టికెట్లు ఇవ్వ లేదని, అందుకు తనకూ బాధగా ఉందని, భవిష్యత్తులో ఆ సంఖ్య పెరిగేలా చూస్తానని కెటిఆర్‌ ‌తెలిపారు. హైదరాబాద్‌ ‌నుంచి క్రీడాకారుల్లో యక్ష్మీఇళలే ఎక్కువగా ఉన్నారని, కోవిడ్‌ ‌సమయంలో సుచిత్ర ఎల్లా, మహిమా దాట్ల వంటి వారు గొప్పగా సేవలు చేశారని, హహిళలు మానసికంగా చాలా బలంగా ఉంటారని, తాము కూడా అది నేర్చుకోవాలని అన్నారు. ఇక వొచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సైతం గెలుపు తమదేనని, తొమ్మిదేళ్లు తాము ప్రజలకు చేసిన సంక్షేమం అభివృద్ధే తమను గెలిపిస్తుందని అన్నారు. మహిళలలకు సంబంధించి కల్యాణ లక్ష్మి, అమ్మ ఒడి వంటి ఎన్నో పథకాలు తెచ్చామని, నాలుగు చోట్ల మహిళల కోసం ప్రత్యేక పార్కులు ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతిపక్షాలకు కూడా గెలుపు బిఆర్‌ఎస్‌దే అని తెలిసినా వాళ్లు నటిస్తున్నారని కెటిఆర్‌ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *