ఆరోగ్య శాఖకు ₹740 కోట్లు విడుదల!

– 1,569 కొత్త సబ్ సెంటర్ల నిర్మాణం
– పల్లెల్లోనే ఉచిత నిర్ధారణ పరీక్షలు
-గ్రామీణ వైద్యానికి మ‌హ‌ర్ద‌శ‌

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 24: తెలంగాణ రాష్ట్రంలో ప్రాథమిక వైద్య రంగాన్ని బలోపేతం చేయడంలో భాగంగా ప్ర‌భుత్వం వైద్య ఆరోగ్య శాఖకు ₹740 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది.  ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కల మార్గదర్శకత్వంలో ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీ సందీప్ కుమార్ సుల్తానియా శుక్రవారం ఈ నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిధులతో రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో  1,569 నూతన ఆరోగ్య ఉప కేంద్రాల (సబ్ సెంటర్లు) భవన నిర్మాణాలను చేపట్టనున్నారు.  అంతేకాకుండా, సాధారణ వైద్య పరీక్షల కోసం గ్రామీణ ప్రజలు ఇకపై పట్టణాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే ఉచిత నిర్ధారణ (డయాగ్నోస్టిక్) సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రాథమిక ఆరోగ్య స్థాయిలోనే వ్యాధులను త్వరగా గుర్తించి సత్వర చికిత్స అందించడం ద్వారా పేద, మధ్యతరగతి ప్రజలకు అయ్యే వైద్య ఖర్చుల భారాన్ని ప్రభుత్వం గణనీయంగా తగ్గించనుంది. వైద్యాన్ని పేద ప్రజల హక్కుగా మారుస్తూ, పల్లెల్లో ఆరోగ్య రంగానికి ప్రజా ప్రభుత్వం కొత్త ఊపిరి పోస్తున్నది. ఈ నిధుల విడుదల ద్వారా గ్రామీణ స్థాయిలో మౌలిక సదుపాయాలు మెరుగుపడటమే కాకుండా వైద్య సేవల అందుబాటు, నాణ్యత గణనీయంగా పెరగనున్నా యి.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *