వసంత ఋతువులో
కోయిలలు కూ, కూ, కూనీ,
రాగాలా పలుకులు
జీవరాసంత మధురానుభూతి
పొందుతూ ప్రకృతిని
అస్వాదిస్తూ
ఉదయించె సూర్యునితో
మోదుకు పువ్వుల రంగు
పోటీ పడుతూ
నింగి నేలని ఒక్కటి
చేస్తున్నాయి
ఆ తుమ్మెదలు
పంచ భూతలను
ఉపయోగించుకుని
మకరందానికై విహరిస్తూ
పిల్లలు హోలి పువ్వులకై
పరుగులు
నిండు పున్నమి రాత్రి
కావనుడి దహనంతో
చెడును పారదోలి
రంగుల పండుగతో
మరునాడు హోలి
ఆడుతూ జీవితాల్లో కొత్త
వెలుగులు నింపాలని
సంబురం వాడ వాడనా
పిల్లా జల్లా ముసలి ముతక
కుల, మతాలకు అథితంగా
యావత్తు దేశం జరుపుకునే
రంగుల పండుగ హోలి…!
– మిద్దె సురేష్, కవి, వ్యాస కర్త
9701209355