Take a fresh look at your lifestyle.

స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు

ముంబై, మార్చి 29 : బులియన్‌ ‌మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు గతంలో ఎన్నడూ లేనంతంగా పరుగులు పెడుతున్నాయి. బంగారం పదిగ్రాముల ధర 70 వేలకు చేరుకుంటుందన్న ఆందోళన కలుగుతోంది. ఈ క్రమంలో పసిడి, వెండి ప్రియులకు స్వల్ప ఊరట లభించింది. తాజాగా.. బంగారం, వెండి ధరలు తగ్గాయి. బుధవారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల  బంగారం ధర రూ.54,500 లుగా ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ‌ధర 59,450 గా ఉంది. 22 క్యారెట్ల బంగారంపై రూ.210, 24 క్యారెట్లపై రూ.240 మేర పెరిగింది. మార్కెట్లో కిలో వెండి ధర రూ.300 మేర పెరిగి రూ.73,000లుగా కొనసాగుతోంది. అయితే, దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకోండి.. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,650 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,600గా ఉంది.

ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,450, చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.55,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,110, కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,450, బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,500, కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,450 లుగా కొనసాగుతోంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,500 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.59,450 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,450, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,450 లుగా కొనసాగుతోంది.

Leave a Reply