ముషీరాబాద్ నియోజకవర్గంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జీపు యాత్ర
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 11 : దేశంలో స్థిరమైన పాలన కోసం భాజపాను గెలిపించాలని కేంద్ర మంత్రి, తెలంగాణ భాజపా అధ్యక్షుడు కిషన్రెడ్డి పిలుపునిచ్చారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ముషీరాబాద్ నియోజకవర్గంలో ఆయన జీప్ యాత్ర నిర్వహించారు. కాంగ్రెస్ అధికారంలోకి వొస్తే కర్ఫ్యూలు, మతకలహాలు, అవినీతి కుంభకోణాలేనని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీల అమలు ఏమైందని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ వొస్తే.. దేశంలో మళ్లీ కుటుంబ పాలన వొస్తుందన్నారు. దేశంలో స్థిరమైన పాలన కోసం బిజెపిని గెలిపించాలని కిషన్ రెడ్డి ప్రజలను కోరారు. కాంగ్రెస్ వొస్తే మళ్లీ కర్ఫ్యూ, మతకలహాలు, అవినీతి కుంభకోణాలు జరుగుతాయని ఆరోపించారు.




