‘‘సౌభాగ్య’’… మేం సాకారం చేసిన స్వప్నం..

చరిత్ర పుటలను ఒక్కసారి తిరగేస్తే- కలకత్తా (నేటి కోల్‌కతా)లో తొలిసారిగా విద్యుత్తును పరిచయం చేస్తూ 1879లో వీధి బల్బుల వినియోగం ప్రారంభమైంది. కాగా, 2019 మార్చి 31నాటికి భారతదేశం సార్వత్రిక విద్యుద్దీకరణను పూర్తిచేసింది. తద్వారా అనూహ్య ప్రగతివైపు దూసుకెళ్లడంలో మనకు మరింతగా శక్తియుక్తులు సమకూరాయి.

విద్యుద్దీకరణతో అపార అవ కాశాలు అందివస్తాయి. తద్వారా పౌరులకు సాధికారత సిద్ధించడంతో పాటు వారి జీవన నాణ్యత మెరుగ వుతుంది. చిన్న, వర్ధమాన వ్యాపార కార్యకలాపాల సమయం పెరుగుతుంది. ఆరోగ్య పరిస్థితులు మెరుగవుతాయి భౌగోళిక మండలాలతో నిమిత్తం లేకుండా బాలలకు అభ్యాస అవకాశాలు లభిస్తాయిబీ పట్టణ-గ్రామీణ ప్రాంతాల్లో సమాజాలకు భద్రత సమస్య పరిష్కారమవుతుంది.. విద్యుదీరణతో ఈ అనూహ్య ప్రయోజనాలే కాకుండా ఉజ్వల, సుస్థిర భవిష్యత్తు దిశగా ఆశలు చిగురిస్తాయి.
గ్రామీణ విద్యుదీకరణ వంటి బృహత్తర బాధ్యతను నెరవేర్చడంతోపాటు దేశవ్యాప్తంగా గృహాలన్నిటికీ వెలుగులు పంచాలన్న ఆకాంక్షతో కేంద్ర ప్రభుత్వం ఆ అంశంపైనా ఏకకాలంలో దృష్టి సారించింది. ఇందులో భాగంగా ప్రధానమంత్రి రూ.16,320 కోట్ల అంచనా వ్యయంతో ‘ప్రతి ఇంటికీ సహజ విద్యుత్‌ ‌పథకం’ (సహజ్‌ ‌బిజిలీ హర్‌ ‌ఘర్‌ ‌యోజన-సౌభాగ్య) ప్రారంభించారు. దీనిద్వారా 18 నెలల వ్యవధిలో దేశంలోని ప్రతి ఇంటికీ విద్యుత్‌ ‌సదుపాయం కల్పనను సవాలుగా స్వీకరించి శక్తియుక్తులను కేంద్రీకరించాల్సిందిగా సంబంధిత భాగస్వాములకు ఆయన పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ‘సౌభాగ్య’ ఉదంతం దేశ ప్రగతి పయనంలో విజయగాథగా మారి.. లక్షలాది భారతీయుల జీవితాల్లో పరివర్తన తెచ్చింది. ఆ మేరకు ప్రపంచంలోనే అత్యంత భారీ గృహ విద్యుదీకరణ కార్యక్రమానికి ఊపిరులూదుతూ కేవలం కొన్ని నెలల్లోనే చరిత్రాత్మకం అనదగిన అనేక మైలురాళ్లను అధిగమించింది.
సంక్షిప్తంగా… ప్రగతి పయనం
ఏదైనా బృందం ఒక సంఘటిత శక్తిగా నిరంతరం నిర్విరామంగా శ్రమిస్తే తప్ప ఈ బృహత్తర కార్యక్రమం ఇంతటి ఘనతను సొంతం చేసుకోవడం అసాధ్యం. ఈ కృషికి శ్రీకారం చుట్టిన తొలినాళ్లలో దేశవ్యాప్తంగా విద్యుత్‌ ‌సదుపాయం లేని గృహాలను గుర్తించడం ఒక సవాలుగా ఉండేది. ఈ దిశగా మా పని విధానం ఆచరణాత్మకమైనదిగా ఉండాలి… కాబట్టి
మన దేశానికి 150 ఏళ్లకుమించి సమాచార సంధానకర్తగా ఎనలేని పాత్ర పోషిస్తున్న తపాలా వ్యవస్థను ఉపయోగించుకున్నాం. తదనుగుణంగా విద్యుత్‌ ‌సదుపాయం లేని గృహాల సంఖ్య నిర్ధారణ కోసం ఆ శాఖద్వారా అధ్యయనం చేపట్టాం. దీనికోసం ‘సంఖ్య’ పేరిట  ఒక వెబ్‌ ‌పోర్టల్‌ ‌సహా మొబైల్‌ అనువర్తనాన్ని రూపొందించాం. తక్షణ విశ్లేషణ.. తద్వారా ఆచరణాత్మక వ్యూహం సిద్ధం చేసుకునేందుకు ఇవి ఎంతగానో తోడ్పడ్డాయి.
దేశంలో సహకారాత్మక సమాఖ్య విధాన విజయగాథకు ‘సౌభాగ్య’ పథకం అమలు ఒక ప్రతీకగా నిలిచింది. ఆ మేరకు సకాలంలో లక్ష్యాల సాధనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతర సమన్వయంతో పనిచేశాయి. ఇందులో భాగంగా విద్యుత్‌ ‌సౌకర్యం పొందడానికి ఆసక్తిగల ప్రతి కుటుంబానికీ కనెక్షన్‌ ఇవ్వడానికి దేశమంతటాగల 56 ‘డిస్కం’లు అవిశ్రాంతంగా కృషిచేశాయి. ఇందుకోసం లబ్ధిదారులకు చేరువగా గ్రామస్థాయి ‘సౌభాగ్య’ శిబిరాలు నిర్వహించి, ప్రతి ఇంటికీ అక్కడికక్కడే విద్యుత్‌ ‌కనెక్షన్‌ ‌లభించేలా శ్రద్ధ వహించాయి. ఈ లక్ష్య సాధన కింద ప్రతి రాష్ట్రంలో గ్రామీణులకు అవగాహన కల్పించడానికి ప్రత్యేకంగా ‘సౌభాగ్య రథాల’ పేరిట వాహన శ్రేణిని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అదే సమయంలో పథకం ప్రారంభ సమయంలో నమోదుకాని విద్యుత్‌ ‌సదుపాయరహిత ఇళ్లను గుర్తించే బాధ్యతను కూడా వాటికి అప్పగించింది. ఇక పథకానికి సంబంధించి సకల సమాచారం అందిస్తూ లబ్ధిదారుల సమస్యలు పరిష్కరిచడం సహా ఇతరత్రా కు సహాయపడేందుకు 24 గంటలూ పనిచేసే ఒక సహాయ కేంద్రం (కంట్రోల్‌ ‌రూమ్‌) ఏర్పాటు చేయబడింది.
అంతేకాకుండా డిస్కంల మద్దతుతో తక్షణ విద్యుత్‌ ‌కనెక్షన్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంది. నివాసాలు చెల్లాచెదరుగా ఉన్న చోట్ల సాంకేతిక-ఆర్థిక అంశాలరీత్యా వీలుగా లేని పరిస్థితుల నేపథ్యంలో సౌరశక్తి ఆధారిత వ్యవస్థలను నెలకొల్పింది.ఆ విధంగా మా శ్రమ ఫలించి లక్షలాది ప్రజలు ప్రధాన ప్రగతి స్రవంతితో అనుసంధానం కావడంతోపాటు లక్షలాది ప్రజల ఇళ్లలో, వదనాల్లో వెలుగులు విరబూశాయి. చరిత్ర పుటలను ఒక్కసారి తిరగేస్తే- కలకత్తా (నేటి కోల్‌కతా)లో తొలిసారిగా విద్యుత్తును పరిచయం చేస్తూ 1879లో వీధి బల్బుల వినియోగం ప్రారంభమైంది. కాగా, 2019 మార్చి 31నాటికి భారతదేశం సార్వత్రిక విద్యుదీకరణను పూర్తిచేసింది. తద్వారా అనూహ్య ప్రగతివైపు దూసుకెళ్లడంలో మనకు మరింతగా శక్తియుక్తులు సమకూరాయి.
నాణ్యమైన విద్యుత్తువైపు అడుగులు
దేశంలో విద్యుత్‌ ‌సదుపాయంపై ఆసక్తిగల 2.82 కోట్ల కుటుంబాలకు కనెక్షన్లు ఇవ్వడం పూర్తయిన నేపథ్యంలో ఇక పట్టణ-గ్రామీణ ప్రాంతాల్లో 24 గంటలూ నాణ్యమైన విద్యుత్‌ ‌సరఫరా దిశగా మా కృషికి శ్రీకారం చుట్టాం. ప్రతి ఇంటికీ నిరంతరాయ విద్యుత్‌ ‌సరఫరా కూడా నేడు అన్ని అవసరాలూ తీరడానికి ఉపయోగపడుతుంది. దీంతో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో పరివర్తనను తేవడమే కాకుండా సరికొత్త, మెరుగైన వ్యవసాయ పద్ధతులను, వ్యవసాయ యంత్రాలను, తాజా సాంకేతిక పరిజ్ఞానాలను ప్రజలు మరింతగా వినియోగిం చగలుగుతారు. దీనివల్ల వ్యవసాయ దిగుబడులు పెరిగి, ఆర్థిక వృద్ధి మెరుగుపడుతుంది. విశ్వసనీయ విద్యుత్‌ ‌సరఫరాతో చిన్నతరహా పరిశ్రమల రంగంలోనూ కొత్త పరిశ్రమలు వచ్చి సామాజిక-ఆర్థిక వృద్ధికి, ప్రగతికి దోహదం చేసేవిధంగా తగినన్ని అవకాశాలు లభిస్తాయి. భారతదేశం నవ్య ప్రగతి శకంవైపు అడుగులు వేస్తున్న తరుణంలో ‘ప్రతి ఒక్కరికీ శక్తి’నివ్వాలన్న మా లక్ష్యం మేరకు ఏ ఒక్క పౌరుడినీ వెనుకబడనీయం!
image.png
ఆర్‌. ‌లక్ష్మణన్‌
ఎగ్జిక్వూటీవ్‌ ‌డైరెక్టర్‌, ఆర్‌ఈసీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *