సుజాతనగర్‌ ఎం‌పీపీ భూక్యా విజయలక్ష్మి పూజలు

హెల్త్ ‌డైరెక్టర్‌ శ్రీ‌నివాసరావు పాల్గొనడంపై వివాదం
భదాద్రి కొత్తగూడెం, ఏప్రిల్‌  6 : ‌జిల్లాలోని సుజాతనగర్‌ ‌మండలం సింగభూపాలెంలో కొత్త దేవత వెలిసింది. దేవత అవతారంలో సుజాతనగర్‌ ఎం‌పీపీ భూక్యా విజయలక్ష్మి ప్రత్యక్ష్యమయ్యారు. ప్రత్వంగిర మాత అనే కొత్త దేవత అవతారంలో ఎంపీపీ విజయలక్ష్మి దర్శనమిచ్చారు. దీంతో కొత్త దేవతకు ఎండు మిరపకాయలతో హోమాన్ని భక్తులు నిర్వహించారు. ఈ  హోమంలో తెలంగాణ హెల్త్ ‌డైరెక్టర్‌ ‌గడిల శ్రీనివాస్‌ ‌రావు పాల్గొన్నారు. కొత్త దేవత చుట్టూ ఎంపీటీసీలు, సామాన్య ప్రజలు ప్రదక్షిణలు చేసారు. దేవుడు కరుణించాలంటూ ఖమ్మంలో వింత పూజలు నిర్వహించారు. మంటల్లో నిమ్మకాయలు వేస్తూ పూజలు చేశారు. తనను తాను దేవతగా ప్రకటించుకున్న మహిళ ఎంపీపీ చుట్టూ ప్రదర్శనలు చేశారు. అయితే సైన్స్ ‌బోధించాల్సిన డీహెచ్‌ ఇలాంటి పూజలు చేయడం ఏంటని ఆరోపణలు వెల్లువెత్తుతు న్నాయి.

శ్రీనివాస్‌ ‌క్షుద్రపూజల తరహాలో చేశారని రాజకీయ ఎంట్రీ కోసమే ఇదంతా చేస్తున్నారని  విమర్శిస్తున్నారు. కొంతకాలంగా డీహెచ్‌ ‌ఖమ్మంలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం ఎంపీపీ ఆధ్వర్యంలో  పూజలు నిర్వహించారు. తనపై దేవతలు పూనుతారంటూ చెప్పు కుంటున్న పూనకం వచ్చిన మహిళ ఎంపీపీ చుట్టూ ప్రదర్శనలు చేశారు. ఇక తనపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో డీహెచ్‌ ‌స్పందించారు. తమ స్వస్థలం కొత్తగూడెం ప్రాంతంలో హెల్త్ ‌క్యాంప్‌ ‌నిర్వహించేం దుకు అక్కడకు వెళ్లినట్లు తెలిపారు. అయితే బంజారా కమ్యూనిటీ వాళ్లు తమ కుల దేవతకు పూజలు చేస్తున్నారని చెబితే ఆ కార్యక్రమంలో పాల్గొన్నట్లు పేర్కొన్నారు.  తాను హోమానికి దండం పెట్టానని, వ్యక్తికి కాదని చెప్పుకొచ్చారు. రాజకీయాలతో తనకు సంబంధం లేదని తెలిపారు. అయితే అనేక  విషయాల్లో వివాదంలో ఉన్న ఎంపీపీ.. దేవత అవతారం ఎత్తి భక్తులకు దీవెనలు ఇస్తున్న మహిళ వద్దకు డీహెచ్‌ ‌వెళ్లారని ఆరోపణలు వస్తుండగా..

ఆ మహిళ ప్రజా ప్రతినిధి అన్న విషయం తెలుసు కానీ ఆమె దేవతగా ప్రకటించుకున్నట్లు తెలీదన్నారు. అంతేగాక తాను చేస్తున్న సేవా కార్యాక్రమాలు గిట్టని వారు స్థానిక రాజకీయ నేతలతో కలిసి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలు నిజం కాదని  తెలంగాణ హెల్త్ ‌డైరెక్టర్‌ ‌గడల శ్రీనివాస్‌ ‌రావు అన్నారు. క్షుద్రపూజలో పాల్గొనట్టు  తనపై వచ్చిన ఆరోపణలను  శ్రీనివాస్‌ ‌రావు ఖండించారు. ఈ వివాదం పై ఆయన స్పందించారు. ఎంపీపీ చేపట్టిన పూజలో మాత్రమే తాను పాల్గొనట్లు  ఆయన తెలిపారు. అక్కడ జరిగింది క్షుద్రపూజ కాదని, కేవలం హోమం మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. తనకు ఎలాంటి రాజకీయాలు అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. అయితే తెలంగాణ హెల్త్ ‌డైరెక్టర్‌  శ్రీ‌నివాస్‌ ‌వివాదంలో చిక్కుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *