Take a fresh look at your lifestyle.

సీఎం కేసీఆర్‌ ‌తెలంగాణ ద్రోహి

బిజెపి గెలుపుతో దొర సీఎం కేసీఆర్‌కు దిమ్మతిర్గుతుందని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ అన్నారు.జరిగిన ఉప ఎన్నికలు, హజురాబాద్‌, ‌దుబ్బాకలో బిజెపి విజయకేతనం ఎగరేయడంతో దొర కేసీఆర్‌ ‌పాలనకు ప్రజలు చరమగీతం పాడారన్నారు. మునుగోడు ఉపఎన్నికలలో టీఆర్‌ఎస్‌ ‌పార్టీ గెలిస్తే సీఎం కేసీఆర్‌కు హద్దులుండయన్నారు. మునుగోడు ఎన్నికలలో కాంగ్రెస్‌ ‌మునిగే నావనేనని, కమ్యూనిష్టులు అంతరంగంగా టీఆర్‌ఎస్‌తో మమేకయ్యారని విమర్శించారు. మునుగోడు ఎన్నికలలో టీఆర్‌ఎస్‌ ‌డిపాజిట్‌ ‌గల్లతవుతుందని, కాంగ్రెస్‌ ‌కానరాదని, వామపక్ష పార్టీలు అడ్రస్సే ఉండవన్నారు.

లింగాలఘన్‌పూర్‌ ‌మండలంలోని క్రిష్ట గూడెంలో బండి సంజయ్‌ ‌ప్రింట్‌ ఆం‌డ్‌ ఎలక్ట్రానిక్‌ ‌మీడియా సమావేశంలో మాట్లాడారు.కేసీఆర్‌ ‌కుటుంబ పాలనను అంతమొందించేందుకు బిజెపి ప్రజా సంగ్రామయాత్రను చేపట్టడం జరిగిందని ఇప్పటికే 1000 కిలోమీటర్ల పైనే పాదయాత్ర చేపట్టి తెలంగాన ప్రజల కష్టసుఖాలు తెలసుకోవడం జరుగుతుందన్నారు.మునుగోడు ఎమ్మెల్యే రాజీనామాతో సీఎం కేసీఆర్‌కు గుండెల్లో గుబులు పుట్టిందన్నారు.తప్పిపోయి టీఆర్‌ఎస్‌ ‌గెలిస్తే సీఎం కేసీఆర్‌కు హద్దులుండవని, నాటి గడీల దొరల పాలన, భూస్వాముల రాచరికం తిరిగి వస్తుందన్నారు.ఈ నెల 21న మునుగోడులో జరిగే భారీ బహిరంగసభకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా రానున్నారని ఆయన సమక్షంలోనే రాజగోపాల్‌రెడ్డి బిజెపిలో చేరనున్నట్లు తెలిపారు.ప్రతి బూత్‌ ‌నుండి 200 మంది వచ్చే విధంగా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలన్నారు.

మునుగోడు ఎన్నికల్లో బిజెపి అభ్యర్ది 70 వేల మెజార్టీతో గెలిపించి బిజెపి సత్తా చాటే భాద్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.సీఎం కేసీఆర్‌ ‌ప్రతి పక్ష నాయకులను కలవరని సొంత నాయకులను కూడా దరిచేయనీయరని విమర్శించారు.టీఆర్‌ఎస్‌ ‌పాలనలో రాష్ట్రమిప్పటికే అప్పుల పాలయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు.బిజెపి ఆద్వర్యంలో జరిగేది ధర్మయుద్దమని ప్రపంచం మొత్తం మోదీ పాలనను మెచ్చుకుని ప్రశంసలు కురుపిస్తున్నారని కొనియాడారు.రైతుల వ్యవసాయ బావుల వద్ద కరెంటు మీటర్లు పెడ్తామని అబద్దపు ప్రచారం చేయడం సరియైందికాదన్నారు.అయ్యా కేసీఆర్‌ ‌దొర వికారాబాద్‌ ‌రోడ్డు మట్టి రోడ్డా హైవేనా అర్ధం కావటం లేదన్నారు.

బియ్యం నేనే కొంటున్నాను నీ అబద్దాలు ప్రచారం చేస్తున్నావు బియ్యం కేంద్రమే కొంటుందనే విషయాన్ని రైతులకు తెలియనిది కాదన్నారు.ఇన్ని రోజులు ధనిక రాష్ట్రమని చెప్పి సీఎం కేసీఆర్‌ ‌సుద్ద అబద్దాలు ఆడారని విమర్శించారు.ఈ సమావేశంలో బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు ఇంద్రసేనారెడ్డి, జితేందర్‌రెడ్డి, జి.వివేక్‌ ‌వెంకటస్వామి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, తమిళనాడు సహ ఇంచార్జీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు దుగ్యాల ప్రదీప్‌కుమార్‌, ‌ప్రేమేందర్‌రెడ్డి, బంగారు శ్రుతి, మనోహర్‌రెడ్డి, సీనీయర్‌ ‌నాయకులు దాసోజు శ్రావణ్‌, ‌తదితరులు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply