Take a fresh look at your lifestyle.

సిసోడియా, పిళ్లైల కస్టడీ 17 వరకు పొడిగింపు

న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 3 : ‌లిక్కర్‌ ‌స్కామ్‌ ‌కేసులో దిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్‌ ‌సిసోడియాకు రోస్‌ అవెన్యూ కోర్టు షాకిచ్చింది. సిసోడియా జ్యూడిషియల్‌ ‌కస్టడీని ఏప్రిల్‌ 17 ‌వరకు పొడిగించింది. సిసోడియా రిమాండ్‌ ఏ‌ప్రిల్‌ 3‌తో ముగియనుండటంతో అతడిని సీఐబీ అధికారులు  కోర్టులో ప్రవేశ పెట్టారు. దర్యాప్తు కీలక దశలో ఉందని..సిసోడియా కస్టడీని పొడిగించాలని సీబీఐ కోరింది.

వాదనలు విన్న కోర్ట్ ‌సిసోడియా కస్టడీని ఏప్రిల్‌ 17 ‌వరకు పొడిగించింది. దీంతో సిసోడియా మరోసారి కస్టడీలోనే ఉండాల్సిన పరిస్థితి.ఇదే కేసులో మరో నిందితుడు అరుణ్‌ ‌రామచంద్ర పిళ్ళై కస్టడీని ఏప్రిల్‌ 17 ‌వరకు పొడిగించింది దిల్లీ కోర్టు. ఏప్రిల్‌ 3 ‌తో పిళ్లై కస్టడీ ముగియడంతో సిబిఐ కోర్టులో హాజరుపరిచారు ఈడీ అధికారులు. కస్టడీని పొడిగించిన కోర్టు..ఏప్రిల్‌ 12‌న సీబీఐ కేసులో కోర్టులో హాజరుకావాలని ఉత్తర్వులు జారీ చేసింది.

Leave a Reply