సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 23: సిద్దిపేట లో ముస్లిం మైనార్టీ ల అభ్యున్నతి మంత్రి హరీష్ రావు ప్రత్యేకంగా కృషి చేశారన్నారు. బిఆర్ఎస్ అభ్యర్థి టి.హరీష్ రావుకుసిద్దిపేట హజ్ కమిటీ ఈ ఎన్నికల్లో సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ప్రతి ముస్లింకు జీవిత కాలంలో ఒక్కసారైనా మక్కాకు వెళ్లి హజ్ యాత్ర , ఉమ్రా యాత్ర చేయాలన్న కోరిక ఉంటుంది..తన సిద్దిపేటలో ఉండే నిరుపేద ముస్లింలు సైతం ఉమ్రయాత్రలకు వెళ్లాలని మంత్రి హరీష్ రావు ఆలోచన చేశారు. పార్టీలకు సంబంధం లేకుండా ముస్లిం మత పెద్దలతో ఒక కమిటీని ఏర్పాటు చేసి మంత్రి హరీష్ రావు ప్రతి సంవత్సరం కొంతమందిని సొంత డబ్బులతో ఉమ్రా యాత్రకు పంపుతున్నారు. యాత్రకు పంపడమే కాకుండా యాత్ర వెళ్లే కొన్ని రోజుల ముందు అందరితో సమావేశం నిర్వహించి మత బోధకులతో యాత్రికులకు అక్కడ చేయాల్సిన కార్యక్రమాలపై శిక్షణను సైతం ఇప్పిస్తున్నారు. హరీష్ రావు లాంటి నాయకుడు సిద్దిపేటకు ఎమ్మెల్యేగా ఉండడం మన అందరి అదృష్టం. మనము అడగకముందే ప్రజలకు ఏం అవసరమో ఆయనే గుర్తించి ఒకటొకటిగా సిద్దిపేటకు తీసుకొస్తున్నారు. కుల మతాలతో సంబంధం లేకుండా అరుణ ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాలన్న పట్టుదల ఆయనలో ఎప్పుడు ఉంటుంది.
రాజకీయాలకు సంబంధం లేకుండా కుల మతాలకు అతీతంగా అందరిని గౌరవించి సహకరిస్తున్న మంత్రి హరీష్ రావుకు మనమందరం మద్దతు ప్రకటిస్తామని కోరుకుంటున్నామనీ హజ్ సోసైటీ సభ్యులు సయ్యద్ కమారుద్దీన్, ఫరీదుద్దీన్, వాజీద్ పటేల్, సుబూర్, రియాజ్, అహ్మద్, ముస్తక్ అన్నారు.
.