సిఎం జగన్‌ ఆశయాల మేరకు పనిచేయండి

  • గ్రామ స్వరాజ్య సాధన దిశగా ముందుకు సాగాలి
  • ఎంపిటిసిల శిక్షణలో మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి

చిత్తూరు, మార్చి 19 : రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌.‌జగన్‌ ‌మోహన్‌ ‌రెడ్డి ఆశయాలకు అనుగుణంగా గ్రామ స్వరాజ్య సాధన దిశగా ఎంపిటిసిలు పనిచేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌ ‌గ్రాణాభివృద్ధి శాఖ మాత్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. శనివారం పుంగనూరు నియోజక వర్గం చౌడేపల్లి మండలం ఎంపీడీవో కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్‌ ‌రాష్ట్ర స్థాయి ఎంపీటీసీ సభ్యులు,మండల కో-ఆప్షన్‌ ‌సభ్యుల శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్థానిక సంస్థలను అభివృద్ధి చేయుటకు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించి అందుకు అనుగుణంగా శిక్షణా కార్యక్రమాలను నిర్వహించి వారి బాద్యతలపై వారికి అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టడం జరిగిందనన్నారు.

తద్వారా గ్రాణ ప్రాంతాల అభివృద్ధికి మార్గం సులభతరం అవుతుందన్నారు.ఇది వరకే ఒక లక్ష 30 వేల మంది వార్డు సభ్యులకు,13 వేల 86 మంది సర్పంచులకు శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. నియోజకవర్గం లోని ఎం.పి.టి.సీలందరికీ ఒక చోట శిక్షణా కార్యక్రమ నిర్వహణ కు చర్యలు చేపట్టామన్నారు. ఎంపిపీలకు ప్రత్యేకంగా ఏప్రిల్‌ 11 ‌నుంచి మూడు రోజులు శ్రీకాళహస్తి, బాపట్ల, సామర్లకోటలలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. జడ్పీటీసీలకు కూడా వారి విధి నిర్వహణకు సంబందించి శిక్షణా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మహిళలకు పెద్ద పీట వేస్తూ స్థానిక సంస్థలలోనూ, వివిధ కార్పొరేషన్‌ ‌లలోనూ 50 శాతం పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ప్రత్యేకంగా కేటాయించడం జరిగిందన్నారు.

గ్రామస్వరాజ్య సాధనకు 2000 జనాభాకు ఒక సచివాలయంను ఏర్పాటు చేసి ప్రజల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టారన్నారు.గతంలో ఎప్పుడూ లేని విధంగా 50 శాతం మంది మహిళా సభ్యులు ఉన్నారని తెలిపారు మంత్రి పెద్దిరెడ్డి.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 శాతం పదవులు ఇచ్చిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందన్న ఆయన.. గ్రామ స్వరాజ్యం అంటూ మహాత్మా గాంధీ చెప్పిన విషయాన్ని చేసి చూపిన వ్యక్తి వైఎస్‌ ‌జగన్‌ ‌మోహన్‌ ‌రెడ్డే అన్నారు.. ప్రతి 2000 మందికి సచివాలయం ఏర్పాటు చేశారు.. సచివాలయ వ్యవస్థలో ప్రజాప్రతినిధులు అందరూ భాగస్వాములే.. ఇదే విషయం అన్ని సచివాలయాలకు తెలియజేస్తామన్న ఆయన.. గ్రామాల పరిశుభ్రతపై ఎంపీటీసీ సభ్యులు శ్రద్ద వహించాలని.. ప్రతీ పంచాయతీకి ట్రాక్టర్‌ ఇస్తున్నాం, అందరూ శ్రద్ద తీసుకుని చెట్లు నాటించాలని సూచించారు.. ఇబ్బందులు ఏమైనా ఉంటే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలి.. ఎంపీటీసీలు చేసే అభివృద్ధి గ్రామాల్లో గుర్తుండి పోవాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. త్రాగునీరు, రహదారులు,మౌలిక వసతులు లపై ప్రత్యేక దృష్టి పెట్టి పారిశుద్ద్యానికి సంబంధించిజగనన్న స్వచ్చ సంకల్పం, మున్సిపాలిటీలలో క్లాప్‌ ‌కార్యక్రమం మంచి ఫలితాలను ఇస్తున్నదన్నారు. ప్లాంటేషన్‌ ‌పైన సర్పంచులు ప్రత్యేక దృష్టి పెట్టి మొక్కలను కాపాడాలన్నారు. గ్రామాలలో ఇంటింటికీ మరుగుదొడ్లు ఉన్నప్పటికీ వాటిని పూర్తి స్థాయిలో వాడుకలోకి తీసుకుని వచ్చే విదంగా ప్రజలలో అవగాహన కల్పించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా ఎంపిటిసి లు పనిచేయాలని తెలిపారు. గ్రామాల సమగ్రాభివృద్ధిలో ఎంపిటిసీలు బాగస్వామ్యమై ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. జడ్పీ చైర్మన్‌ ‌గోవిందప్ప శ్రీనివాసులు మాట్లాడుతూ నూతనంగా ఎంపికయిన ఎంపీటీసీలు స్థానిక సంస్థలకు కల్పించిన రాజ్యాంగ ప్రతిపత్తి, ఇతర అంశాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. జగనన్న మానస పుత్రిక అయిన సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందే పౌర సేవలను ఎంపీటీసీలు పరిశీలించాలన్నారు. ఈ శిక్షణ కార్యక్రమాల ద్వారా ఎంపీటీసీలు వారి విధులపై అవగాహన పెంచుకోవాలన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రాణాభివృద్ధి, పంచాయితీ రాజ్‌ ‌శిక్షణా సంస్థ వారిచే తయారు చేసిన కరదీపికను అతిధుల చేతులదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ ‌స్టేట్‌ ‌కౌన్సిల్‌ ‌మెంబర్‌ ‌ముత్యం శెట్టి విశ్వనాథ్‌,‌రాష్ట్ర పాల ఏకిరి కార్పొరేషన్‌ ‌చైర్మన్‌ ‌మురళీధర్‌, ‌పలమనేరు కుప్పం మదనపల్లి అర్బన్‌ ‌డెవలప్మెంట్‌ అథారిటీ చైర్మన్‌ ‌వెంకట్‌ ‌రెడ్డి యాదవ్‌, శ్రీ ‌బోయకొండ గంగమ్మ దేవస్థానం పాలకమండలి చైర్మన్‌ ‌మిద్దింటి శంకర్‌ ‌నారాయణ,జడ్పీ సీఈవో ప్రభాకర్‌ ‌రెడ్డి, డిపివో దశరథ రామిరెడ్డి, చౌడేపల్లి, పుంగనూరు ఎంపిపి లు రామ్మూర్తి, ఎం.భాస్కర్‌ ‌రెడ్డి, తది తరులు,ఇతర ప్రజాప్రతినిధులు, ఎంపీటీసీలు మండల కో ఆప్షన్‌ ‌సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page