సామాజిక అభద్రత దిశగా పింఛన్‌ ‌పధకాలు…

“పెన్షన్‌’’ ‌బిక్షగాళ్ళకు వేసే ధర్మంలాంటిది కాదు. వయోధిక పౌరులను, వారి వయసుకు తగిన రీతిలో హుందాగా, మర్యాదపూర్వకంగా పరిగణించాల్సిన అవసరం వుంది. పెన్షన్‌ అన్నది వారి చట్టబద్ధమైన, అన్యాక్రాంతానికి తగని, న్యాయపరంగా అమలు పరచాల్సిన హక్కు. అది వారు చమటోడ్చి సాధించుకొన్నది..”

భారతదేశంలో సర ళీకృత ఆర్థిక విధానాలు అమలు ప్రారంభమైన 1991 తర్వాత ప్రపంచ బ్యాంక్‌ ‌నుండి, అంతర్జాతీయ సంస్థల నుండి, బహుళ జాతి సంస్థల నుండి,  ఒత్తిళ్ళ మేరకు ప్రభుత్వం పెన్షన్‌ ‌ఖర్చులు తగ్గించుకోవాలనే డిమాండ్‌ ‌ముందుకు వచ్చింది. భారతదేశం ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే కరెంట్‌ ‌ఖాతాలోటు తగ్గించుకోవాలి. కనుక పెన్షన్‌ ‌రంగంలో సంస్కరణలు చేపట్టవల్సిందేనని భారత ప్రభుత్వంపై అవి ఒత్తిడి చేస్తూ వచ్చాయి.ముఖ్యంగా భారతీయుల సగటు జీవిత కాలం పెరుగుతూ ఉన్నందున ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ తరువాత చెల్లించే పెన్షన్‌ ‌వలన ఆర్ధిక వ్యవస్ధకు భారం అవుతుందని.. కనుక పెన్షన్‌ ‌విధానాన్ని సంస్కరించి ప్రయివేటీకరణ దిశగా అడుగులు వేస్తే మంచిదని అంతర్జాతీయ ద్రవ్య నిధిIMF) ) భారత ప్రభుత్వానికి సూచించడం జరిగింది. ఈ ప్రతిపాదనలు దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం 2001..02 సంవత్సరంలో అప్పటి N D A) ప్రభుత్వం బీ.కే. భట్టాచార్య నేతృత్వంలో ఒక ప్రత్యేక కమిటీని నియమించింది. ఆ కమిటీ తన ప్రతిపాదనలను 2003 ఆగస్టు 23 న ప్రభుత్వానికి నివేదిక అందించగా అదే సంవత్సరం డిసెంబర్‌ ‌నెలలోPFRDA బిల్లును ఆమోదించి కంట్రిబ్యూటరీ పెన్షన్‌ ‌స్కీము ను అమలులోకి తీసుకు వచ్చారు.ఈ బిల్లు ద్వారా పెన్షన్‌ ‌నిధి నియంత్రణ అభివృద్ధి ప్రాధికార సంస్థ (పిఎఫ్‌ఆర్డీఎ)కు చట్టభద్రత లభిస్తుంది. బిల్లు ఆమోదం పొందిన నాటినుండి ఇది చట్టబద్ద స్వతంత్ర సంస్థగా వ్యవహరిస్తుంది. 2003 ఆగస్టులో ఏర్పాటు చేసిన పిఎఫ్‌ఆర్డీఏకు ఈ బిల్లు ద్వారా చట్టభద్రత లభించింది. 2004 జనవరి 1వ తేదీ నుంచే తప్పని సరిగా నూతన పింఛన్‌ ‌పధకం (ఎన్‌.‌పి.ఎస్‌) అమలులోకి వచ్చింది.

నూతన పెన్షన్‌ ‌విధానానికి పాత పెన్షన్‌ ‌విధాననికి మధ్య గల బేధాలు పరిశీలిస్తే….

ఓ పీ ఎస్‌.
1980 ‌పెన్షన్‌ ‌నిబంధనల ప్రకారం పెన్షన్‌, ‌ఫ్యామిలీ పెన్షన్‌ ‌గ్రాట్యుటీ, మ్యూటేషన్‌, ఆర్జిత సెలవును నగదుగా మార్చుకొనే సదుపాయం, మరణానంతర ప్రయోజనాలనేకం ఉద్యోగులకు సమకూరాయి.ప్రతి నెలా జీతం నుంచి సొమ్ము చెల్లించకున్నా రిటైర్‌ అయిన తర్వాత నిర్ధిష్టమైన పెన్షన్‌ ‌నెలనెలా అందుతుంది. ఏటా వచ్చే డీఏ, పీఆర్సీ ఇతర సదుపాయాలను అనుసరించి ఇది ప్రతినెలా పెరుగుతుంది. ఉద్యోగి బతికి ఉన్నంత వరకు పెన్షన్‌ ఇవ్వటంతోపాటు చనిపోయిన తరువాత భార్యకు పెన్షన్‌ ‌చెల్లిస్తారు. ఆ పెన్షన్‌ ‌బాధ్యత ప్రభుత్వానిదే ప్రభుత్వ ఉద్యోగి సర్వీసులో ఉండగా మరణిస్తే అతడి కుటుంబంలో అర్హులైన వారికి దామాషా ప్రకారం జీవితాంతం ఫ్యామిలీ పెన్షన్‌ ‌చెల్లిస్తారు. ఇది కూడా ప్రతినెలా పెరుగుతుంది.ఉద్యోగి అవసరాల కోసం ప్రతినెలా జీతంలో కొంతభాగం జీపీఎఫ్‌ ‌ఖాతాలో పొదుపు చేసుకోవచ్చు. ఈ ఖాతాలను ప్రభుత్వమే నిర్వహిస్తుంది. ఈ సొమ్ముపై ప్రతి నెలా నిర్దిష్ట వడ్డీ చెల్లిస్తుంది. ఉద్యోగికి డబ్బు అవసరమైతే వడ్డీలేని రుణంగా పొందవచ్చు. సులభ వాయిదాల్లో తిరిగి చెల్లించవచ్చు. పదవీ విరమణ అనంతరం ఉద్యోగి ఆరోగ్య అవసరాల కోసం హెల్త్ ‌కార్డుల సదుపాయం ఉంది.తన శక్తి సామర్థ్యాలను ప్రభుత్వ సేవకి వినియోగించినందుకు పదవీ విరమణ సమయంలో బహుమానంగా దామాషా ప్రకారం గరిష్టంగా రూ.12 లక్షల వరకు గ్రాట్యుటీ చెల్లిస్తారు. పీఆర్సీ ప్రకారం ఇది పెరుగుతుంది.పదవీ విరమణ సమయంలో కుటుంబ అవసరాలు తీర్చుకునేందుకు తనకు వచ్చే పెన్షన్‌లో దామాషా ప్రకారం 40 శాతం వరకు ముందుగానే తీసుకోవచ్చు. ఈ సొమ్మును పెన్షన్‌ ‌నుంచి ప్రతి నెలా మినహాయిస్తారు. దీన్నే కమ్యుటేషన్‌ అం‌టారు.ఉద్యోగికి లభించే ఆర్థిక ప్రయోజనాలపై ఎలాంటి పన్ను విధించరు.ఇలా ఉద్యోగికి పూర్తి సామాజిక భద్రత ఈ విధానంలో కొనసాగుతుంది.

సీ పీ ఎస్‌.

ఉద్యోగి తన సర్వీసు ప్రారంభం నుంచే జీతంలో ప్రతి నెలా 10 శాతం సొమ్ము పొదుపు చేసుకోవాలి. దీనికి ప్రభుత్వం అంతే మొత్తం జమచేసి ఎన్‌ఎస్‌డీఎల్‌ అనే సంస్థ ద్వారా షేర్‌ ‌మార్కెట్లలో వివిధ రకాల ఫండ్లలో పెట్టుబడిగా పెడుతుంది. పదవీ విరమణ సమయంలో లాభనష్టాలు పోనూ మిగిలిన సొమ్ములో 60 శాతం ఉద్యోగికి చెల్లిస్తారు. దీనిపై ఉద్యోగి పన్ను చెల్లించాలి. మిగిలిన 40 శాతం సొమ్ము మళ్లీ షేర్‌ ‌మార్కెట్లలో పెట్టుబడి పెట్టి వచ్చే లాభాలతో పెన్షన్‌ ఇస్తారు. ఇది ఎంత అనేది నిర్దిష్టంగా ఉండదు.షేర్‌ ‌మార్కెట్లలో నష్టాలు వస్తే పెన్షన్‌ ‌తగ్గిపోతుంది. ఒకవేళ పెన్షన్‌ ‌తీసుకుంటున్న వ్యక్తి మరణిస్తే కుటుంబానికి ఫ్యామిలి పెన్షన్‌ అం‌దదు. ఆ కుటుంబం వీధుల పాలు కావాల్సిందే.ఉద్యోగి తన శక్తి సామర్థ్యాలను ప్రభుత్వ సేవకి అంకితం చేసినందుకు పదవీ విరమణ సమయంలో ఇచ్చే గ్రాట్యుటీ సదుపాయం లేదు. అయితే దీన్ని ఇచ్చేందుకు ఇటీవలే ప్రభుత్వం అంగీకరించి జీఓ ఇచ్చింది.రిటైరయిన తరువాత ఉద్యోగి హెల్త్ ‌కార్డులపై స్పష్టత లేదు.ఉద్యోగులకు మ్యుటేషన్‌ ‌సదుపాయం లేదు.పాత పెన్షన్‌ ‌విధానంలో మాదిరిగా ఆపదలో ఆదుకోనే జిపిఎఫ్‌లోన్‌ ‌సదుపాయం ఉద్యోగులకు లేదు.దీనినే ఉద్యోగులు ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నారు.ఎందుకంటే ‘పెన్షన్‌’’ అన్నది బహుమతిగా లేదా పారితోషికంగా లేదా దయతో ఇచ్చే అదనపు ఫలితంకాదని, అది సుదీర్ఘ కాలం దేశానికి సేవలందించి రిటైరైన ప్రభుత్వోద్యోగి హక్కు అని సర్వోన్నత న్యాయస్ధానం 1982 డిసెంబరు 17న ఒక చారిత్రాత్మక తీర్పు చెప్పింది.అంతేకాదు ఉద్యోగులు రిటైరైన తరువాత ఒక శాంతియుత, గౌరవప్రదమైన జీవనం గడిపేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకొని తీరాలని కూడా ఆ తీర్పులో పేర్కొన్నారు.ఈ తీర్పు

ప్రాతిపదికగా ఐదవ కేంద్ర వేతన సంఘం కూడా పెన్షన్‌ ‌విధానంపై తన అభిప్రాయాన్ని వెలిబుచ్చింది. దాని ప్రకారం లి’’పెన్షన్‌’’ ‌బిక్షగాళ్ళకు వేసే ధర్మంలాంటిది కాదు. వయోధిక పౌరులను, వారి వయసుకు తగిన రీతిలో హుందాగా, మర్యాదపూర్వకంగా పరిగణించాల్సిన అవసరం వుంది. పెన్షన్‌ అన్నది వారి చట్టబద్ధమైన, అన్యాక్రాంతానికి తగని, న్యాయపరంగా అమలు పరచాల్సిన హక్కు. అది వారు చమటోడ్చి సాధించుకొన్నది. అందువల్ల ఉద్యోగుల జీతభత్యాల లాగే పెన్షన్‌ని కూడా నిర్ధారిస్తూ, సవరిస్తూ, మార్పులు చేర్పులు చేయాల్సి వుంద’’ని పేర్కొంది.

గ్యారంటీడ్‌ ‌పింఛను పథకం (జీపీఎస్‌)

‌సీపీఎస్‌ ‌విధానంలో ఉద్యోగి పదవీ విరమణ పొందిన తర్వాత సుమారు 20.3% పింఛను వస్తున్నట్లు లెక్క కట్టి దాన్ని 33 శాతానికి పెంచి ఇస్తామని గ్యారంటీ పింఛన్‌ ‌పధకాన్ని ప్రభుత్వం ప్రతిపాదించింది.అయితే ఉద్యోగి తన వాటా 10 శాతం (కంట్రిబ్యూషన్‌) ‌చెల్లించాలి. డీఏ పెంపు, పీఆర్సీ వర్తింపుపై స్పష్టత ఇవ్వలేదు. అదనపు క్వాంటం పింఛను, హెల్త్ ‌కార్డులపై వివరణ లేదు.దీనిలో పీఎప్‌ ‌ఖాతా, కమ్యుటేషన్‌ ఉం‌డదు గ్రాట్యుటీపై కూడా స్పష్టత లేదు.ఇవేవీ చెప్పకుండా కమిటీ ఉద్యోగులను ఈ విధానంపై అధ్యయనం చేయమని ఉద్యోగస్తులను అభ్యర్ధించింది. ఒక పక్క ప్రభుత్వ ఆదాయాలను వ్యయాన్ని మరొక పక్క ఉద్యోగుల సామాజిక భద్రతను అదే సమయంలో ప్రయివేటు రంగ ఉద్యోగస్తులకు కనీస పింఛన్‌ ‌కల్పించే విధానం పట్ల ప్రభుత్వాలు ఆలోచించవలసిన సమయం ఆసన్నమయ్యింది..ఒపీసీ విషయమై ప్రభుత్వ ఉద్యోగులు చేపట్టే ఉద్యమం ఆంధ్ర ప్రదేశ్‌ ‌కె పరిమితం కాకుండా దేశ వ్యాప్తంగా వ్యాప్తి చెందే అవకాశాలు లేకపోలేదు.ఈ స్ధితిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయం మై పునరాలోచన చేయవలసిన అవసరం తప్పనిసరి కానుంది.

rudra raju srinivasa raju

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page