Take a fresh look at your lifestyle.

సమాజ సేవలో సామాజిక మాధ్యమాలు

‘‘‌చిన్న పిల్లలు మొబైల్‌ ‌వాడక పోవడమే మంచిది.ప్రస్తుతం మతవాదులు, మూఢవిశ్వాసకులు, అసత్య, ఆశాస్త్రీయ పాలకవర్గాలు, ప్రజాభిప్రాయాన్ని అనుకూలంగా మలుచుకోవడానికి, రాజకీయ లబ్ధికి,సామాజిక మాధ్యమాలను దురుపయోగం చేస్తున్నారు. హేతువాదులు, ప్రగతికాముకులు, ప్రజాస్వామ్యవాదులు,ప్రజా సంఘాలు ప్రత్యామ్నాయ పక్షాలు, స్మార్ట్ఫోన్లను విరివిగా ఉపయోగించాలి.ప్రజా ప్రయోజనం సామాజిక మాధ్యమాల ధ్యేయం కావాలి. మంచి బాటలో పయనించాలి.’’
ఇటీవలి కాలంలో సామాజిక మాధ్యమాలు ప్రపంచ గతినే మార్చివేస్తున్నాయి. మనదేశం లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఫేస్‌ ‌బుక్‌, ‌ట్విట్టర్‌, ‌వాట్సాప్‌, ఇన్స్టాగ్రామ్‌, ‌యూట్యూబ్‌ ‌లాంటి సామాజిక మాధ్యమాలు సమాచార మార్పిడిలో కీలక పాత్ర పోషిస్తు న్నాయి.ప్రజాభిప్రాయాన్ని మార్చగలిగే శక్తి,సమాచార మార్పిడితో కోట్లాది మందిని ప్రభావితం చేయగలిగే వార్తలను చేరవేయడంలో పెద్ద పెద్ద సామాజిక మాధ్యమాలు ఎనలేని పాత్ర పోషిస్తు న్నాయి.అయితే కొన్ని సందర్భాలలో సామాజిక మాధ్యమాల్లో చట్టవిరుద్ధమైన, తప్పుడు సమాచారం చేరి విపరీతంగా వైరల్‌ అవుతోంది. ఒక వ్యక్తికి సంబంధించిన ఆందోళన లేదా బాధను పంచుకోవడానికి సామాజిక మాధ్యమాలు ఎంతగానో తోడ్పడు తున్నాయి. ఈ మధ్యకాలంతో అనేక ఉద్యమాల వ్యాప్తికి, రాజకీయ ప్రచారాలకు సైతం సామాజిక మాధ్యమాలను విరివిగా వినియోగిస్తున్నారు.దీంతో మంచి కంటే చెడు ఎక్కువ జరిగే సందర్భాలు కూడా ఉన్నాయి.దీంతో పలు దేశాలు సామాజిక మాధ్యమాలపై ఆంక్షలు విధిస్తున్నాయి.అసత్య ప్రచారాన్ని వ్యాపింపచేస్తున్న సోషల్‌ ‌మీడియా సంస్థలను నియంత్రించేందుకు భారత ప్రభుత్వం కూడా కఠిన చర్యలు చేపట్టింది.
ఇందులో భాగంగా సామాజిక మాధ్యమాలకు కొత్త నియమావళిని రూపొందించింది.నూతన మార్గదర్శకాల ప్రకారం సామాజిక మాధ్యమ సంస్థలు తప్పనిసరిగి ఫిర్యాదులు స్వీకరించేందుకు కావాల్సిన వ్యవస్థను రూపొందించుకోవాల్సి ఉంటుంది.దీనికి గాను ఫిర్యాదులను పరిష్కరించేందుకు ముఖ్య అధికారితో పాటు మరో నోడల్‌ అధికారిని నియమించుకోవాల్సిఉంటుంది. యూజర్లు చేసే ఫిర్యాదులను 24 గంటలపాటు నిరాఘాటంగా స్వీకరించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది.మహిళలకు సంబంధించిన అసభ్యకరమైన,మార్పిడిచేసిన ఫొటోలపై వచ్చే ఫిర్యాదులను 24 గంటల్లోగా పరిష్కరించాలని కొత్త మార్గదర్శకాలలో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.సోషల్‌ ‌మీడియా దుర్వినియోగం, విద్వేష పూరిత ప్రసంగాలు, ఏదైనా ఓ వర్గం వారిని రెచ్చగొట్టే వ్యాఖ్యలను నివారించేందుకు మార్గదర్శకాలను రూపొందించాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఓటీటీ, సామాజిక మాధ్యమాల్లో వచ్చే సమాచారాన్ని సునిశితంగా పరిశీలించి విస్తృతంగా చర్చలు జరిపిన మీదట వాటికి సంబంధించి నూతన మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య కాలంలో ప్రకటించడం జరిగింది. ఆపత్కాలంలో అవసరార్థులకు అండగా నిలిచేలా సోషల్‌ ‌మీడియా ఉపయోగపడుతోంది. కొన్ని సంస్థలు సామాజిక బాధ్యతగా స్పందిస్తూ.. అంబులెన్స్ ‌సర్వీసులు, ఆస్పత్రుల వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నాయి.ఆపదలో ఉన్నవారికి ఆడుకొనే విదంగా అవసరమైనవి ఇచ్చేందుకు యువత ముందుకు వస్తున్నారు.
సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతూ, నిత్య నూతనంగా ప్రచార ప్రసారాలు జరుగుతున్నాయి.నిర్మణాత్మక మార్పులు వాటన్నిటికన్నా ప్రస్తుతం నిరక్షర గ్రామీణుల నుండి నిరంతర పరిశోధకుల వరకు చేతిలో అందుబాటు లోకి వచ్చాయి.అధునాతన సెల్‌ ‌ఫోన్లు వాటి ద్వారా ప్రధాన మీడియాను మించి సోషల్‌ ‌మీడియా పని చేయడం సర్వం సెల్‌ ‌ఫోన్లేకుండా, పొద్దున్న లేచింది మొదలు రాత్రి వరకు సోషల్‌ ‌మీడియాలో నిమగ్నం అవుతున్నారు.సామాజిక మాధ్యమాల పాత్ర అన్వితీయం, అపూర్వం, అసమానమైంది.
కంప్యూటర్‌ ‌సౌకర్యాలు గల మొబైల్‌ ‌ఫోన్‌ ‌ను స్మార్ట్ ‌ఫోన్‌ అం‌టారు. అది బహుళ ప్రయోజన నిస్తాంత్రి హస్త యంత్రం. నేటి విద్యార్థులు, యువత గంటకు పదిసార్లు సెల్‌ ‌ఫోన్‌ ‌చూస్తారని పరిశోధనలో తేలింది.ప్రపంచ వ్యాప్తంగా యువకులు సామాజిక మాధ్యమాలకు బానిసలుగా మారారు. స్మార్ట్ ‌ఫోన్లతో సమాచార సామర్థ్యం పెరిగింది.అరబ్‌ ‌వసంత విప్లవం, నిర్భయ నిరసనలు, ప్రజాసంఘాల ఆందోళన, కార్యక్రమాలకు సామాజిక మాధ్యమాలు ప్రధాన పాత్ర పోషించాయి.ఇవే కాకుండా రాజకీయ నాయకుల ప్రయోజనాల కోసం కూడా ఈ సామాజిక మాధ్యమాలు తోడ్పడుతున్నాయి. మాధ్యమాల ప్రభావాల అధ్యయనం విశ్లేషణల  కంస్కోర్‌ 2017 ‌నివేదికలు పెద్దలు సగం మొబైల్‌ ‌వీక్షణ సమయాన్ని మొబైల్‌ ‌యాప్స్ ‌లో గడుపుతున్నారని, పరిశోధన నిర్దేశకుడు డేవిడ్‌ ‌గిన్స్బర్గ్ ‌శాస్త్రజ్ఞుడు మొయిరాబర్ట్ ‌సూత్రీకరించారు.ఫేస్బుక్లో ప్రయోజనం లేని వాద సంవాదాలు చర్చలు వ్యసనంగా మారాయి. వీటి భ్రమల్లో పడి నిస్సార అంశాలపై ప్రవాహంలో కొట్టుకు పోతున్నారు. మానవీయత మాయమవుతుంది. పిల్లలు కళ్ళముందే చెడిపోతున్నారు. అసాంఘిక, అశ్లీల మాధ్యమ సాధనాలను అంతర్జాలాన్ని ఆవిష్కరించి, జనాల మీదికి వదిలిన శాస్త్రజ్ఞులకు మానవత్వ సమాజ వినాశనాలు పట్టవు.ధన సంపాదనే వీరి లక్ష్యంగా మారింది.
స్మార్ట్ ‌ఫోన్ల  వల్ల ఉద్యోగ, వ్యక్తిగత జీవితాలు కాకా వికలమవుతున్నాయి.ప్రైవేటు కంపెనీలలో ఈ జీవితాల విభజన రేఖ ఉండదు.ప్రభుత్వ ఉద్యోగాలను వ్యక్తిగత జీవితాలు ఉద్యోగ సమయాలలో కొనసాగుతున్నాయి. పని వేళల్లో,సమావేశ సమయాల్లో, విద్యార్థులు, యువకులు, ఉద్యోగులు ఫోన్లో లీలమవుతున్నారు.ఉద్యోగుల సంభాషణ ముగిసేటప్పటికీ ముందున్న కంప్యూటర్‌ ఆగిపోతుంది.మరల వేళ్ళ గుర్తు లేసి ఆన్‌ ‌చేయాలి.స్మార్ట్ ‌ఫోన్లు ఉద్యోగులను తికమక పెట్టి పరధ్యానంలో ముంచి ఉత్పాదకతను తగ్గిస్తున్నాయని,అవి లేనప్పుడు ఉత్పాదకత 26% పెరిగిందని అమెరికా ప్రయోగశాల రుజువు చేసింది. మొబైల్‌ ‌ఫోన్ల అతి వినియోగంతో అలసట, తలనొప్పి, నిద్రలేమి మతిమరుపు,చెవుల గింగుర్లు నడుము, కీళ్ల నొప్పులు వస్తాయి.
సామాజిక మాధ్యమాలతో సమస్య ఆత్మ ప్రవర్తన, స్పందన, ప్రతిస్పందనలు కాలయాపన జరుగుతున్నాయి. కాలయాపన, పరధ్యానం, తప్పుడు అంచనాలు, అవాస్తవ ఆకాంక్షలు, సామాజిక ముసుగు అణిచివేత ఒక వైపు, ప్రపంచ అనుసంధానంతో జ్ఞాన సమపార్చన, వ్యాపార అభివృద్ధి నూతన సంబంధాలతో వ్యక్తిగత ప్రగతి సమాజ్‌ అభివృద్ధి అవకాశాలు మరోవైపు,కంప్యూటర్ల పని ఇప్పుడు స్మార్ట్ ‌ఫోన్లు చేస్తున్నాయి.ఫోన్‌ ‌చూడకపోతే ఏదో కోల్పోతామన్న భయంతో దానికి బందీలై,విధులను, ఉద్యోగాలను అశ్రద్ధ చేస్తున్నారు.భార్య బిడ్డలతో సరిగా గడపడం లేదు.దాంపత్య జీవితానికి దూరం అవుతున్నారు. మనుషుల మనస్తత్వం ప్రవర్తన విద్య సమాచార నైపుణ్యతలు,సామాజిక సంబంధాలు, అనుభవాలు దిగజార తున్నాయి. మొబైల్‌ ‌ఫోన్‌ ‌లేనప్పుడు ఇరుగుపొరుగు వారి మాటలు బంధాలు, అనుబంధాలు అనేవి కనబడేవి కానీ అవి ఇప్పుడు కనిపించడం లేదు.చాలా మంది సామాజిక మాధ్యమాలలో ఇరుక్కొని ధన, మానప్రాణాలు కోల్పోతున్నారు.నిజానికి ప్రపంచంలో ఎవరి జీవితము సంపూర్ణము కాదు. ఒక్కొక్కరి జీవితం ఒక్కొక్క జీవన శైలిలో ఉంటుంది.మాధ్యమాలలో పొగడ్తలను చూసి తీవ్ర మొహాన్ని పెంచుకుంటున్నారు. ఎవరో ఆదర్శంగా ఉన్నారని భ్రమించి, అనుకరించి జీవితాలను కోల్పోతున్నారు.పరులతో పోలిక పోటీలతో ఆతురత, ఒత్తిడి,మానసిక ఆందోళనలు పెరుగుతున్నాయి.మానసిక, ఆర్థిక,సామాజిక ఆరోగ్యాలు చెడి,ఆత్మవిచ్చితికి ఆత్మహత్యలకు దారితీస్తున్నాయి.
8 ఏళ్ల పిల్లలు యూట్యూబ్లో వీడియో ఆటలలో మునుగుతున్నారు.పేద పిల్లలే ఈ వ్యర్ధవకంలో నిష్ప్రయోజనంగా సమయాన్ని కోల్పోతున్నారని సర్వేలలో తెలిసింది.పిల్లలకు నేర్చుకునే అవకాశాలు, క్రియాశీలత మెరుగుపడతాయని తల్లిదండ్రుల ఆశ. కానీ 16 ఏళ్ల వయస్సు ఉన్నటువంటి పిల్లలకు తల్లిదండ్రుల అనుమతితో సామాజిక మాధ్యమాలు అందుబాటులో ఉండాలి అవి సరియైన క్రమంలో వాడుకోవాలి తప్ప, రెక్కాడితే గాని డొక్కాడని శ్రమజీవులకు పిల్లలపై శ్రద్ధ పెట్టగల సమయం ఉండదు. ఈ వ్యసరం కొత్త మత్తుకు రహదారి అని పేదలకు తెలియదు అందువలన ప్రయోజనాలను పొందుతూనే పర ధ్యానాలను నివారించే మాయాజాలాన్ని కనుగొనాలి. అభ్యంతర అంతర్జాల అంశాలను మొబైల్‌ ‌ఫోన్ల నుండి తొలగించాలి.వీక్షణ సమయాన్ని పరిమితం చేసే యాప్లను  నిర్దిష్ట సమయాల్లోనే స్మార్ట్ ‌ఫోన్‌ ‌పనిచేసే విధంగా చూసుకోవాలి.
సెల్‌ ‌ఫోన్‌  ‌రేడియేషన్‌ ‌క్యాన్సర్‌ ‌కారకమనడం అపోహ కానీ, ఆరోగ్య సమస్యలు రావచ్చు. రేడియేషన్‌ ‌ప్రభావం తగ్గించడానికి ఇయర్‌ ‌ఫోన్‌ ‌లు వాడాలి.సిగ్నల్‌ ‌బాగా ఉన్నప్పుడే ఫోన్‌ ఉపయోగించాలి. సిగ్నల్‌ ‌బలహీనంగా ఉన్నప్పుడు ఎక్కువ విద్యుత్‌ ‌ఖర్చయి రేడియేషన్‌ ‌పెరుగుతుంది. మొబైల్‌ ‌ను గంటల తరబడి వాడరాదు.ఎక్కువసేపు మాట్లాడడానికి ల్యాండ్‌ ‌లైన్‌ ‌వినియోగించుకోవాలి.వాహనాలు నడిపేటప్పుడు విద్యుత్‌ ‌పరికరాల పరిసరాలలో మొబైల్‌ ‌వాడరాదు. చిన్న పిల్లలు మొబైల్‌ ‌వాడక పోవడమే మంచిది.ప్రస్తుతం మతవాదులు, మూఢవిశ్వాసకులు, అసత్య, ఆశాస్త్రీయ పాలకవర్గాలు, ప్రజాభిప్రాయాన్ని అనుకూలంగా మలుచుకోవడానికి, రాజకీయ లబ్ధికి,సామాజిక మాధ్యమాలను దురుపయోగం చేస్తున్నారు. హేతువాదులు, ప్రగతికాముకులు, ప్రజాస్వామ్యవాదులు,ప్రజా సంఘాలు ప్రత్యామ్నాయ పక్షాలు, స్మార్ట్ఫోన్లను విరివిగా ఉపయోగించాలి.ప్రజా ప్రయోజనం సామాజిక మాధ్యమాల ధ్యేయం కావాలి. మంచి బాటలో పయనించాలి. మంచి గుర్తెరగాలి.మంచి కోసమే సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకోవాలి.
image.png
మోటె చిరంజీవి, 9949194327

Leave a Reply