నాసిక్ నుంచి ముంబై వరకు భారీ నిరసన ర్యాలీ
ముంబై,మార్చి14: తమ సమస్యల పరిష్కారం కోసం మహారాష్ట్ర రైతులు కదం తొక్కారు. నాసిక్ నుంచి ముంబై వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. సీపీఎం ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో వేలాది మంది రైతులు పాల్గొన్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం డిమాండ్ చేస్తూ , ప్లకార్డులు ప్రదర్శిస్తూ రైతులు ముందుకు కదిలారు. ఈ ర్యాలీలో ఎక్కడ చూసినా ఎర్ర జెండాలు, ఎర్ర టోపీలు, ఎర్ర కండువాలే దర్శనమిచ్చాయి.
రాష్ట్రంలో రైతులు అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నామని, ఆ సమస్యలన్నింటి పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించేలా చేయడం కోసమే తాము ఈ ర్యాలీ చేపట్టామని రైతు సంఘాల నాయకులు తెలిపారు. వేలమంది రైతులు చీమల్లా బారులుతీరి తరలివెళ్తున్న దృశ్యాలను చూస్తే రైతులు భారీగా తరలి వచ్చారు.