ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 24 : తెలంగాణ విద్యాశాఖ సమగ్ర శిక్ష, కేజీబీవీ లలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గురువారం కడ్తాల, తలకొండపల్లి, మాడుగుల, ఆమనగల్లు మండలాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు ఆమనగల్ మండల విద్యావనరుల కార్యాలయం ముందు ఒకరోజు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా తెలంగాణ విద్యాశాఖ సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ప్రభుత్వం ఇంతవరకు రెగ్యులర్ చేయలేదని వారు అన్నారు. ఉద్యోగ భద్రత కల్పించి వేతన టైం స్కేలు అమలు చేయాలన్నారు. అన్ని రకాల అర్హతలు ఉన్న ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒరిస్సా, హర్యానా, ఢిల్లీ, మహారాష్ట్రలలో సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఆ రాష్ట్ర ప్రభుత్వాలు క్రమబద్ధీకరించిందని వారన్నారు. రూ. 10 లక్షల జీవిత బీమా ఐదు లక్షల ఆరోగ్య భీమా కల్పించి ఆదుకోవాలని అన్నారు. వీరు చేస్తున్న దీక్షకు జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి సంఘీభావం తెలిపారు. పి ఆర్ టి యు, యూ టిఎఫ్, ఎస్ టి యు, టిపియూఎస్ ఉపాధ్యాయ సంఘాల నాయకులు వారికి మద్దతు తెలిపి సంఘీభావం ప్రకటించారు. అనంతరం ఎంపీడీవో ఫారూఖ్ హుస్సేన్, డిప్యూటీ తాసిల్దార్ నారాయణరెడ్డి, ఎంఈఓ సర్దార్ నాయక్ లకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు షేక్ అహ్మద్, సాయికుమార్, శ్రీశైలం, తిరుపతి, మల్లేష్, శ్రీరాములు, కిషన్, యాదగిరి, లక్ష్మయ్య, జితేందర్ రెడ్డి, రవి, విజయ్ కుమార్, శేఖర్, మధు, అమర్, స్వాతి, జంగమ్మ, మంజుల, రతన్, సుల్తానా, స్వప్న, శైలజ, శ్రీదేవి, రమేష్, కవిత, ఉపాధ్యాయ సంఘాల నాయకులు సుదర్శన్, చందర్, ఆంజనేయులు, శ్రీను, వెంకటస్వామి, మల్లయ్య, యాదయ్య, పద్మ, భగవంతురావు, సురేష్, అంజయ్య, యాదయ్య తదితరు పాల్గొన్నారు.