Take a fresh look at your lifestyle.

సంక్షేమం..అభివృద్ధి లక్ష్యంగా పాలన

  • ఏపీలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ ‌నజీబ్‌ ‌ప్రసంగం
  • ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు

అమరావతి, మార్చి 14 : ఏపీ ప్రభుత్వం గత నాలుగేళ్లుగా పారదర్శక పాలన అందిస్తోందని గవర్నర్‌ అబ్దుల్‌ ‌నజీర్‌ ‌తెలిపారు. ఈ సందర్భంగా నవరత్నాలతో ఏపీ ప్రజలకు నేరుగా నిధులు అందించా మన్నారు. నాలుగేళ్లుగా 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షల కోసం సీఎం జగన్మోహన్‌ ‌రెడ్డి పాలన సాగిస్తు న్నారని చెప్పారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ ‌సమావేశాల ప్రారంభం సందర్బంగా మంగళవారం ఉభయ సభలను ఉద్దేశించి తొలిసారిగా గవర్నర్‌ ‌ప్రసంగించారు. పారదర్శకంగా  పాలన  సాగుతుందని..ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నేరుగా లబ్దిదారుల బ్యాంకు ఖాతాలకు  చేరుతున్నాయన్నారు. పరిశ్రమలు, వ్యవసాయం, సేవా రంగంలో  గణనీయమైన అభివృద్దిని  సాధించినట్టుగా గవర్నర్‌ ‌వివరించారు.  జీఎస్‌డీపీ లో దేశంలోనే ముందువరసలో ఉందని  గవర్నర్‌ అబ్దుల్‌ ‌నజీర్‌ అన్నారు. ప్రతి ఏటా 11.43 శాతం జీఎస్‌డీపీ వృద్దిరేటు సాధించిందని పేర్కొన్నారు.

తలసరి ఆదాయం  రూ. 2.19 లక్షలకు పెరిగిందన్నారు. రాష్ట్ర ఆర్ధికపరిస్థితి నాలుగేళ్లుగా మెరుగు పడిందని  గవర్నర్‌  ‌చెప్పారు. మన బడి, నాడు-నేడు ద్వారా తొలి దశలో  రూ.3669 కోట్లతో ఆధునీకీకరణ చేపట్టామన్నారు. అమ్మఒడి ద్వారా 80 లక్షల పిల్లలకు  ఆర్ధిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. 44.49 లక్షల మంది తల్లులకు  రూ.19,617.60 కోట్ల ఆర్ధిక సహయం అందించిన విషయాన్ని  గుర్తు  చేశారు. డిజిటల్‌ ‌లెర్నింగ్‌  ‌కోసం విద్యార్ధులకు  రూ. 690 కోట్ల విలువైన  5.20 లక్షల ట్యాబ్‌లను  పంపిణీ చేశామని  గవర్నర్‌ అబ్దుల్‌ ‌నజీర్‌ ‌తెలిపారు. 2020-21 విద్యా సంవత్సరం  నుండి పాఠ్యాంశాల సంస్కరణలు అమలు చేస్తున్నట్లు వివరించారు. 1వ తరగతి నుండి 7వ తరగతి వరకు  పాఠ్యపుస్తకాల  రీడిజైన్‌  ‌చేసినట్టుగా గవర్నర్‌ ‌పేర్కొన్నారు. జగనన్న  గోరుముద్దతో  43.26 లక్షల మంది విద్యార్ధులకు లబ్ది  కలగనుందని  వెల్లడించారు.

2024 నాటికి అర్హులైన  ప్రజలకు శాశ్వత గృహలను అందిస్తున్నామని గవర్నర్‌ ‌వివరించారు. మహిళల పేరుతో  30.65 లక్షల  ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ  చేసినట్టు గుర్తు చేశారు. ఇల్లు కట్టుకునేందుకు 5  నుంచి 10 లక్షల వరకు ఆర్థిక సాయం చేస్తున్నామన్నారు. వీటితో పాటు..ఇండ్లకు విద్యుత్‌, ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని అన్నారు.  5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షల కోసం సిఎం పాలన సాగుతోందన్నారు. సకృత అభివృద్ధి కోసం పారదర్శక పాలన అందిస్తున్నామని తెలిపారు. గ్రామ సచివాలయాలతో ప్రజల దగ్గరకే పాలన అందిస్తున్నామని తెలిపారు. 45 నెలల్లో రూ.1.97 లక్షల కోట్ల నగదు ప్రజలకి చేరిందని తెలిపారు. లబ్దిదారుల గుర్తింపుకోసం వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చినట్లు గవర్నర్‌ ‌పేర్కొన్నారు. నాడు- నేడుతో స్కూళ్ల ఆధునీకరణ, మధ్యాహ్న భోజనం పథకం అమలులోకి తెచ్చామన్నారు. నాడు నేడులో 3669 కోట్లతో ఫేజ్‌ 1‌లో 15717 స్కూళ్ల ఆధునీకరణ చేశామని, ఫేజ్‌ 2‌లో రూ.8,345 కోట్లతో 22345 స్కూళ్ల ఆధునీకరణ జరిగిందన్నారు. 9,900 కోట్లతో 44 లక్ష మంది తల్లులకు అమ్మ ఒడి అందజేసినట్లు చెప్పారు. ఏటా రూ. 15 వేలు ఒక్కో లబ్దిదారుకి అమ్మ ఒడి ద్వారా లబ్ది పొందారని గవర్నర్‌ ‌తన ప్రసంగంలో పేర్కొన్నారు.

Leave a Reply