- దాతలకు ఉచిత దర్శన ఏర్పాట్లు
- టిటిడి ఇవో ధర్మారెడ్డి వెల్లడి
తిరుమల, జనవరి 23 : రూ. లక్ష లోపు విరాళం ఇచ్చేవారికి శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్లు ఇస్తామని టిటిడి ఇఒ ధర్మారెడ్డి తెలిపారు. తిరుమలలో అన్నమయ్య భవన్లో టిటిడి ఇఒ ధర్మారెడ్డి డియా సమావేశంలో మాట్లాడారు. శ్రీవాణి ట్రస్ట్ విరాళాల వివరాలను ఇఒ ధర్మారెడ్డి వెల్లడించారు. లక్ష రూపాయలు విరాళం ఇచ్చే భక్తులకు దర్శనం గదుల సౌకర్యం కల్పిస్తామని పేర్కొన్నారు. పది వేల రూపాయలు విరాళం ఇచ్చే భక్తులకు బ్రేక్ దర్శనం ఉంటుందన్నారు. శ్రీవాణి ట్రస్టుకు రూ.650 కోట్ల నిధులు సమకూరాయని, శ్రీవాణి ట్రస్ట్ నిధులతో దక్షిణాన 2068 ఆలయాలు నిర్మిస్తున్నామన్నారు. ఆరు నెలల్లో ఉన్న ఆలయాల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. శ్రీవారి ఆలయ డ్రోన్ వీడియోపై టిటిడి ఈవో స్పందించారు.
తిరుమలలో డ్రోన్ సర్వేకు ఐఓసిఎల్ కు పర్మిషన్ ఇచ్చింది వాస్తవం కాని అన్నదానం నుంచి డంపింగ్ యార్డ్ వరకే డ్రోన్ సర్వేకు పర్మిషన్ ఇచ్చామని వివరించారు. టిటిడి భద్రత విషయంలో ఎక్కడ రాజీ పడటం లేదని టిటిడి ఈఓ ధర్మారెడ్డి తెలిపారు. టిటిడికి హై సెక్యూరిటి వ్యవస్థ ఉందని ధర్మారెడ్డి సూచించారు. త్వరలో తిరుమలకు యాంటి డ్రోన్ టెక్నాలజీ తీసుకొన్నామని , బాధ్యుల పై తగిన చర్యలు తీసుకుంటామని ఈఓ తెలిపారు.శ్రీవారి ఆలయ డ్రోన్ వీడియోపై టిటిడి ఈవో స్పందించారు. తిరుమలలో డ్రోన్ సర్వేకు ఐఓసిఎల్ కు పర్మిషన్ ఇచ్చింది వాస్తవం కాని అన్నదానం నుంచి డంపింగ్ యార్డ్ వరకే డ్రోన్ సర్వేకు పర్మిషన్ ఇచ్చామని వివరించారు. టిటిడి భద్రత విషయంలో ఎక్కడ రాజీ పడటం లేదని టిటిడి ఈఓ ధర్మారెడ్డి తెలిపారు. టిటిడికి హై సెక్యూరిటి వ్యవస్థ ఉందని ధర్మారెడ్డి సూచించారు. త్వరలో తిరుమలకు యాంటి డ్రోన్ టెక్నాలజీ తీసుకొన్నామని , బాధ్యుల పై తగిన చర్యలు తీసుకుంటామని ఈఓ తెలిపారు.