‌శ్రీరామ కల్యాణోత్సవం

శ్రీరామ నవమి ఉత్సవ వేళా
విశ్వ జగతి ఆధ్యాత్మిక మేలా
పరమ పవిత్ర సంకీర్తన హేలా
భక్త జనుల పారావశ్య  ఖేలా

సర్వ పాపాల హరణం
సకల లోక మంగళకరం
సమస్త జీవ శ్రేయోదాయకం
రామచంద్రుడు అవతరించిన
చైత్రశుద్ధ నవమి శుభకరదినం

పరమ ధర్మ పరిరక్షకునిగా
సోదర బంధానికి ప్రతీకగా
హనుమకు ప్రీతి పాత్రునిగా
భక్తజనకు ఆరాధ్య దైవంగా
మానవాళికి ఆదర్శమూర్తిగా
పితృవాక్య  పరిపాలకునిగా
ప్రసిద్ధికెక్కెను పరందాముడు

అరణ్యవాస దీక్ష ఆచరించి
రావణాసురుణ్ణి సంహరించి
సీతమ్మను చెరను విడిపించి
శబరి ఎంగిలి ఫలం ఆరగించి
అహల్యకు మోక్షం ప్రసాదించి
ధర్మ సత్కార్యములు ముగించి
పట్టాభిషిక్తుడాయేను రాముడు

శ్రీరామ మంత్రం స్తుతించిన
సమస్త సమస్యలు కడతేరి
సకల సౌభాగ్యం సమకూరు

పరమ పావన ‘‘నవమి’’న
రాములోరి కల్యాణోత్సవం
కళ్లారా వీక్షించి ఆరాధించిన
తనువణువణువు పులకితం
జీవితానికి మోక్షము సంప్రాప్తం

(ఏప్రిల్‌ 10 ‌న శ్రీరామ నవమి పర్వదినం సందర్బంగా…)
 – కోడిగూటి తిరుపతి :9573929493

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page