సకల జనుల సంతోషాలకు
శుభ సూచకమై వస్తున్నది
శుభకృత్ నామ దారి ఉగాది
శిశిరం రాలుస్తున్న ఆకులు
ఉక్రెయిన్ రష్యా యుద్ధం లో
కూలుతున్న దేహాల శ్వాసలు
మొండి ఆశల మోడులు
పచ్చని చిగురుల పందిళ్లు వేసి
కోయిలలను ఆహ్వానిస్తున్నవి
యుద్ధంలో అలసి జెలన్స్కి పుతిన్లు
కోయిలల మధ్యమ స్వరాలులు విని
శాంతి చర్చలు జరుపుచుండిరి
అది నవ వసంతాగమనానికి
కోయిలలు చల్లని శాంతి సందేశమే!
ప్రకృతి ధర్మం
గ్రీష్మంలో నైనా చల్లదనం!
యుద్ధమంటే గెలుపోటములు కాదు
మానవ ధర్మాన్ని మంట కలపడమే!
నేడు కరోన తగ్గు ముఖం పట్టింది
యుద్ధానికి శుభం తెరపడబొతున్నది!
అది నీ రాక శుభసూచకమేమో!
శుభాలు చేకూర్చు ఓ శుభకృత్ ఉగాది
– పి.బక్కారెడ్డి
9705315250