సంతోష సంరంభ సూచిక
సమైక్య జీవన సుమమాలిక
సంస్కృతి,సంప్రదాయ వేదిక
యుగానికి ఆది ఉగాది వేడుక
శుభకృత నామ నవ వత్సరిక
చైత్ర శుక్ల పాడ్యమి వేళా
ప్రాతఃకాల తలస్నానాలు
నూతన వస్త్రాలంకరణలు
వేలాడే మామిడి తోరణాలు
బంధు, మిత్రుల సందళ్ళతో
ప్రతి మనసు మధురరసడోలా
ప్రతి తనువు తన్మయత్వజోలా
వేప పువ్వుల సౌరభాలు
కోకిలమ్మల స్వర గీతాలు
చిగుళ్లు తొడిగిన వనాలు
ప్రకృతి నవవసంత శోభతో
పుడమి పులకరింతల హేలా
జగతి ఆనందోత్సవాల మేలా
ఈ మంగళకర రోజున
సడ్రుచుల పచ్చడి సేవనలు
పూజలు దైవనామ స్మరణలు
భవిష్య పంచాంగ శ్రవణాలతో
ప్రతి మానసం భక్తిపూర్వకలీలా
విశ్వ మానవాళికి
నూతనోత్తేజం నింపే
శాంతి సౌభాగ్యం పంచే
ఉగాది పర్వదినోత్సవాన్ని
ఉత్సాహంగా జరుపుకుందాం
నవ జీవన ‘‘ప్రస్థానం’’ సాగిద్దాం
శుభకృతుకు…స్వాగతం
నవవత్సరకు…సుస్వాగతం
(ఉగాది పర్వదిన శుభాకాంక్షలతో..)
– కోడిగూటి తిరుపతి :9573929493