సునామీలు సుడిగుండాలు
కొండలు పిండి చేసేది యవ్వనం
హద్దులు దాటే పద్దుల కు
అడ్డుకట్ట వేసేది వృద్ధాప్యం
వాగై వరదై ఉదృతమై
ఉప్పొంగే ప్రవాహం యవ్వనం
పారి పారి తేరుకున్న
నిర్మల నిచ్చల జలం వృద్ధాప్యం
అనుక్షణం ఆరాటంలో
ఆవిరి అయ్యేది యవ్వనం
కాగి కాగి చల్లారిన స్వచ్ఛమైన మైన
పాలమీగడలు వృద్ధాప్యం
కల్లోల కడలి యవ్వనం
పాల కడలిలో దాగిన
జీవామృతం వృద్ధాప్యం
వాడి వేడి యెగల సెగల గ్రీష్మ కాల
మార్తాండ తేజం యవ్వనం
నిశీధి లో మిల మిల తారల మధ్య
వెండి వెలుగుల
శరత్ కాల చంద్రబింబం వృద్ధాప్యం
– పి.బక్కారెడ్డి
9705315250





