‘‘టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లు గడుస్తున్నా ఒక్క బోధనా సిబ్బంది పోస్టు భర్తీ చేయక పోగా, ప్రైవేటు విశ్వ విద్యాలయాలు ఇబ్బడి ముబ్బడిగా శాంక్షన్ చేసి విద్య తమ బాధ్యత కాదని చేతులు దులుపుకుంది. శతాబ్దం కిందట వెలసిన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో యాభై సంవత్సరాల క్రిందట 52 విభాగాలు ఏడువందల మంది బోధనాసిబ్బంది ఉండేవారు. ఇప్పుడు కేవలం 24 విభాగాలు పట్టుమని వంద మంది సిబ్బందితో విభాగాలు ఉన్నాయా అన్న ప్రశ్న తలెత్తుతుంది.’
కామన్ రిక్రూట్మెంట్ బోర్డు విధివిధానాలు ఎలా ఉంటాయన్నదానిపై గైడ్లైన్స్ త్వరలో విడుదల కానున్నాయి. ఈ బోర్డు పనిచేయడానికి అయ్యే ఖర్చుల్ని తెలంగాణ ఉన్నత విద్యామండలి, యూనివర్సిటీలు సమానంగా భరిస్తాయి. ఈ బోర్డు ఏర్పాటు చేసేందుకు యూనివర్సిటీ చట్టాల్లో సవరణల్ని కూడా ప్రతిపాదించనుంది ప్రభుత్వం. ఎదో ఒక రూపాన ఉద్యోగం దక్కితే చాలని అభ్యర్థులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. రిజర్వేషన్ రోస్టర్ ఎలా పాటిస్తారన్న సందేహం బిసి, ఎస్సి,ఎస్టీ వర్గాల విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ పరిగణలోకి తీసుకుంటారా లేదా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. లాస్ట్ రోస్టర్ పాయింట్ ఎక్కడ నిలిచింది ఇప్పుడు ఎక్కడ నుండి మొదలవుతుంది అలాగే లోకల్ నాన్ లోకల్ సమస్య రాకుండా చూడాలి. తీవ్ర కాలయాపన చేసి, వాటిపై తమ పార్టీ వారినే కోర్టులో కేసులు వేసి నాన్చే ధోరణి అవలంబిస్తున్నది. నియామకాలపై చిత్తశుద్ధి ఉంటే సత్వరమే ప్రక్రియ మొదలు పెట్టి రెండు నెలలలో పూర్తి చేస్తే మంచిది లేకపోతే విశ్వవిద్యాలయాలు శాశ్వితంగా మూసుకోవాల్సిందే.
డా. యం. సురేష్ బాబు, అఖిలభారత విద్య హక్కు వేదిక.