‘‘మన ఉమ్మడి కుటుంబాలు, మన విలువలు, ఆచార సాంప్రదాయాలు, జానపద రీతులు, సంస్కృతిలో పలుమార్పులు సంభవించినప్పటికీ వాటివలన మనకు కలిగిన ఉపయోగం, గౌరవాన్ని రాబోయే తరాలవారికీ అందించాల్సిన ఆవశ్యకత లేదా ?అందుకే మన రాష్ట్ర, కేంధ్ర ప్రభుత్వాలు ఈ విషయంపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ’’
ప్రపంచంలో భారతదేశానికి ఒక విశిష్టస్థానం ఉండటానికి గలకారణం మన దేశంలోని సంస్కృతీ, ఆచార సాంప్ర దాయాలు, కటుబాట్ల విలువలు, జానపదరీతులు మరియు భిన్న త్వంలో ఏకత్వాన్నీ కలిగి ఉండటమే. వీటిగురించి తెలిపేదే సామా జిక శాస్త్రం. సమాజ పరిణామ దశలను, సమాజంలోని మానవ సంబంధాలను, సమాజ మనుగడను, ఆర్థిక,రాజకీయ, సాంస్కృతిక, సామాజిక అంశాల గూర్చీ వివరిస్తు ంది.సమాజ మనుగడ సక్రమంగా,సరైనరీతిలో కొనసాగాలంటే సమాజంలోని అంతర్గత సంబంధాలు, సంస్కృతీకరణ, సామాజీకరణ, స్థిరీకరణ ఏ విధంగా జరుగుతుందో తెలుపుతుంది.
ప్రపంచీకరణలో భాగంగా పాష్త్యాతీకరణ మూలంగా క్రమేణా మనదేశంలో ఆచార సాంప్రదాయాలు, సంస్కృతిలో మార్పులకు గురవుతుండడం మూలంగా విద్యా వ్యవస్థలో సైతం సమాజశాస్త్రానికి క్రమంగా గుర్తింపు కరువవుతుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.రాబోయేకాలంలో మన దేశంలో పెను మార్పులు సంభవించి పల్లె, పల్లెన పట్టణ సంస్కృతీ నెలకొని రాబోయే తరానికి మనదేశ ఆచార సాంప్రదాయాలు తెలుసుకునే అవకాశం కూడా కనుమరుగవుతుందా ?అనే అనుమానం కలుగకమానదు.
శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానంతో పెనుమార్పులు సంభవించి, రోజుకో ఆవిష్కరణతో శారీరక శ్రమకంటే మానసిక ఆలోచనకే ఎక్కువ విలువనిస్తున్న నేటి ప్రపంచీకరణలో, టెక్నా లజీకి సంబంధించిన పలురకాల నూతన కోర్సులు పుట్టుకొచ్చిన, ఆంగ్లేయుల బారినుండి మన దేశానికి స్వాతంత్య్రాన్ని తెచ్చిపెట్టిన మహానీయులను మరువకుండా, వారిని విద్యలో భాగంగా ప్రతిఒక్కరం నేర్చుకుంటూనే ఉన్నాము.అలాగే మన ఉమ్మడి కుటుంబాలు, మన విలువలు, ఆచార సాంప్రదాయాలు, జానపద రీతులు, సంస్కృతిలో పలుమార్పులు సంభవించినప్పటికీ వాటివలన మనకు కలిగిన ఉపయోగం, గౌరవాన్ని రాబోయే తరాలవారికీ అందించాల్సిన ఆవశ్యకత లేదా ?అందుకే మన రాష్ట్ర, కేంధ్ర ప్రభుత్వాలు ఈ విషయంపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది.
గ్రామీణ ప్రాంతాలలోని మానవుల సాధక బాధకాలు, సామాజిక సమస్యల పరిష్కారమార్గాలు, సమాజాభివృద్ధికి సంబంధించిన విషయాలను ఈ సామాజికశాస్త్రంలో భాగంగా నేర్చుకోవచ్చు.అందుకే ఈ కోర్సు సమాజాభివృద్ధికి తోడ్పడే వీలున్నది.
గతంలో సామాజికశాస్త్రం ఇంటర్ మీడియేట్, డిగ్రీ, పీజీ స్థాయిలో ఈ కోర్సు ప్రాధాన్యత ఉన్నప్పటికీని,నేడు మనదేశంలోని ఉత్తర భారతదేశంలో ఈ కోర్సుకి అత్యంత ప్రాధాన్యత సంతరిం చుకున్న, దక్షిణ భారతదేశంలో అంతటి ప్రాధాన్యతలేదు .మనరాష్ట్రంలోని యూనివర్సిటీలలోని కొన్నింటిలో ఉస్మానియా కాకతీయ శాతవాహన యూనివర్సిటీలలో మాత్రమే పరిమి తమయ్యి ఉన్నత విద్యనందిస్తున్నాయి.
ఇంటర్,డి
గ్రామీణాభివృద్ధికి సంబంధించిన పలు అంశాలు, సంస్కృతీ, ఆచార సాంప్రదాయాలు, కట్టుబాట్లు, విలువలు, వివాహ వ్యవస్థకు సంబం ధించిన అంశాలు సైతం సామా జికశాస్త్రం ద్వారా తెలుసు కోవచ్చు. గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలు, గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది.అందుకే గ్రామా భివృద్ధికి సంబం ధించిన పలురకాల అంశాలను అధ్యయనం చేయడానికి సామా జికశాస్త్రం తోడ్పడుతుంది. మానసిక రోగులను పరీక్షించ డానికి సామాజిక శాస్త్రం ఎంతో తోడ్పడుతుంది.అంటే ప్రతి వైద్యశాలలో ఒక సామాజికశాస్త్ర నిపుణుడు ఉండాల్సిన అవసరం లేకపోలేదు. ఎంతో ఒత్తిడికి గురవుతున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు మానసికంగా ఉల్లాసంగా పరచడానికి సైతం ఈ శాస్త్రం ఎంతో అవసరం. పరీక్షలలో తప్పామని కొంతమంది,అనుకున్న ర్యాంక్ రాలేదని మరికొంతమంది, చదువుకోవాలనుకున్న కాలేజీలో సీటు రాలేదని కొంతమంది విద్యార్థులు ఒత్తిడికిలోనై ఆందోళనచెంది ఆత్మ హత్యల బారిన పడుతున్నారు అంటే వారికి ఈ శాస్త్రంపట్ల అవగాహన లేకపోవడమె కారణం.అందుకే ప్రతివిద్యార్థి సామాజికశాస్త్ర నైపుణ్యాన్నీ తెలుసుకునేటట్లు ప్రభుత్వం తగుచర్యలు తీసుకోవల్సిన అవసరం ఉన్నది.
దేశంలోని అన్నిరాష్ట్రాలలో అన్ని జూనియర్ కళాశాలలో, డిగ్రీ,పీజీ కళాశాలలో ఈ కోర్సును ప్రవేశపెట్టి , సమాజం గురించి సమగ్రంగా తెలుసుకునే వీలు కల్పిస్తూ, చదివినవారికి ఉపాదావకాశాలు కల్పించాల్సిన అవసరం ఉన్నది.
‘‘దిల్లీకి రాజైన తల్లికి కొడుకే ‘‘అన్నట్లుగా నేడు ప్రపంచంలో శాస్త్ర, సాంకేతిక విజ్ఞానం ఎంతగా అభివృద్ధి చెందినా, మనదేశ సంస్కృతిలో సైతం పెనుమార్పులు సంభవి ంచిన, మన ఆచారాలు, కట్టుబాట్లు క్రమంగా కనుమరు గవుతున్న తరుణంలో వాటిగురించి తెలుసుకునే అవకాశాన్నీ ప్రతివిద్యార్థికి ఏదో ఒక స్థాయిలో కల్పించాలి.ఈ కోర్సును సాధారణ కోర్సులవలే అన్నిరకాల కళాశాలలో పెట్టేందుకు సామాజికవేత్తలు, సామాజిక సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, మేధావులు, ప్రముఖులు, విద్యావంతులు కలిసి రాష్ట్రప్రభుత్వంతో చర్చలుజరిపి సామాజికశాస్త్ర ఆవశ్యకతను తెలియజేస్తూ రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలలో ఈ కోర్సును ప్రవేశపెట్ట డానికి కృషిచేయాలని ఆశిద్దాం.