విధి….
అదో వింత ఆట
ఆటరాదన్నా ఆలకించదు
అలుపుగొన్నా కనికరించదు
తప్పించుకోలేని సాలెగూడది
నీ ప్రమేయము లేకనే
నిన్నాడుకొంటుంది.
జీవన పతంగ దారాన్ని
తనకి నచ్చినట్టు తిప్పుతూ,
ఊహించినది జరగక
ఊహించనిది తెరపైకి తెస్తూ,
ఈ క్షణం వీక్షణమైనది
మరుక్షణమే మాయంచేస్తూ,
పలుకలేని భావాల్ని
చెదరిన మేఘాలై సాగించే,
పిడికెడు హృదయానికి
కొండంత దుఃఖాలను కురిపించే
అర్థంకాని ప్రహేళిక.
కాలం కోసం ఆగనిది
ఎవరి కోసమూ సాగనిది
– వేమూరిశ్రీనివాస్, 99121 28967
తాడేపల్లిగూడెం