ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 30 : ఆమనగల్లు ఎక్సైజ్ సర్కిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆమనగల్లు, కడ్తాల్, తలకొండపల్లి, మాడుగులు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులు శనివారం ఆమనగల్లు కోర్టులో నిర్వహించిన లోక్ అదాలత్ లో 17 కేసులు పరిష్కారం అయ్యాయని ఆమనగల్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ బద్య నాద్ చౌహాన్ తెలిపారు. ఆమనగల్లు పోలీస్ స్టేషన్ నుంచి 4, కడ్తాల్ 4, మాడుగుల 4 కేసులు తలకొండపల్లి నుంచి 5, మొత్తం 17 బెల్ట్ షాప్ కేసుల్ని లోక్ అదాలత్ ద్వారా పరిష్కారమయ్యాయని సిఐ పేర్కొన్నారు.
లోక్ అదాలత్ లో 17 ఎక్సైజ్ కేసుల పరిష్కారం





