రైతు నేత రాకేశ్‌ ‌తికాయత్‌పై సిరా దాడి

  • బెంగుళూరులో వి•డియా సమావేశంలో ఘటన
  • పోలీసులకు ఫిర్యాదుతో ముగ్గురు అరెస్ట్

బెంగళూరు, మే 30 : భారతీయ కిసాన్‌ ‌యూనియన్‌(‌బికెయు) నేత రాకేష్‌ ‌తికాయత్‌పై బెంగళూరులో నిరసనకారులు సిరాతో దాడి చేశారు. వి•డియా సమావేశంలో తికాయత్‌ ‌మాట్లాడుతుండగా ఈఘటన జరిగింది. తెలిసిన వివరాల ప్రకారం..కర్ణాటకలో ఒక రైతు నేత డబ్బులు తీసుకుంటున్నట్లు ఇటీవల స్టింగ్‌ ఆపరేషన్‌లో వెల్లడైంది. దీంతో తికాయత్‌కు, ఆయన అనుచరులకు వ్యతిరేకంగా కొంతకాలంగా రాష్ట్రంలో ఆందోళనలు జరుగుతున్నాయి. స్టింగ్‌ ఆపరేషన్‌ ‌గురించి మాట్లాడేందుకు తికాయత్‌ ‌సోమవారం బెంగళూరులో వి•డియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతుండగా.. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దూసుకువచ్చి తికాయత్‌ ‌ముఖంపై ఇంక్‌ ‌చల్లారు. దీంతో ఆగ్రహించిన తికాయత్‌ అనుచరులు, రైతు నేతలు నిరసనకారులపై దాడికి దిగారు. ఇరు వర్గాలు కుర్చీలతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనపై తికాయత్‌ ‌స్పందించారు. కర్ణాటక ప్రభుత్వం వేదిక వద్ద తనకు ఎలాంటి భద్రత కల్పించలేదని అన్నారు.

ప్రభుత్వ మద్దతుతోనే ఈ దాడి జరిగిందని ఆరోపించారు. మరోవైపు సాగు చట్టాల వ్యతిరేక ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన భారతీయ కిసాన్‌ ‌యూనియన్‌ ‌నేత రాకేశ్‌ ‌టికాయిత్‌పై సిరా దాడి జరిగడంపై సర్వత్రా నిరసనలు వస్తున్నాయి. తికాయత్‌పై చోటుచేసుకున్న ఈ పరిణామంతో అక్కడున్నవారంతా ఒక్కసారిగా కంగుతిన్నారు. సిరా దాడి చేసిన వారిని అడ్డుకుని, కొట్టారు. ఫలితంగా కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. సిరా దాడిపై తీవ్రంగా స్పందిస్తూ.. కొందరితో ప్రభుత్వం కుమ్మక్కై ఇలా చేయించిందని ఆరోపించారు. సిరా దాడి ఘటనపై బెంగళూరు పోలీసులు చర్యలు చేపట్టారు. ఇంక్‌ ‌చల్లినట్లు భావిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని వారు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *